Bhakti: ఈ లోకంలో భక్తి విషయమై చాలా మందికి అనేక అనుమానాలు తలెత్తుతుంటాయి. భగవంతుడిని ఎవరు ఎలా పూజించాలనే సందేహం కలుగుతూ ఉంటుంది. ఒకరు ఆధ్యాత్మికంగా భగవన్నామ స్మరణ ఎక్కువగా చేస్తూ, నిత్యపూజలు, నిత్య దీపారాధన, నిత్య నైవేద్యం పెడుతూ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తే.. మరొకరు ఉన్న దాంట్లో కాసిన్ని పూలు పెట్టి భగవంతుడా కరుణించాలంటూ మొక్కకుంటాడు. అలా అని బాగా పూజ చేస్తే భగవంతుడు వారిపైనే అనుగ్రహం చూపిస్తాడనుకోవడం తప్పని పెద్దలు చెబుతున్నారు. (Bhakti)
ఇలా భక్తి మార్గాల్లో ఎవరికి నచ్చిన విధానం వారు అనుసరించే హక్కు ఉంటుంది. అయితే, నలుగురు స్నేహితులుంటే వారిలో ఒకరికి శ్రీమహావిష్ణువంటే ఇష్టం అనుకుందాం.. ప్రతి రోజూ విష్ణుసహస్రనామాలు జపించి మహావిష్ణు అవతారాలైన ఏదో ఒక రూపాన్ని పూజిస్తూ ఉంటాడు. అయితే, మిగతా ముగ్గురిలో ఒకరికి దుర్మామాత అ్మవారంటే ఇష్టం ఉంటుంది. మరో వ్యక్తి పరమేశ్వరుని ధ్యానిస్తాడు. ఇంకొకరికి సాయిబాబా అంటే మక్కువ. అలా అని అందరూ తాము పూజించే విధానాన్ని అనుసరించాలని కోరుకోవడం తప్పు.
నచ్చినది చేసుకో.. రుద్దకూడదు..
నిత్యం మనకు నచ్చిన పూజా విధానాన్ని అనుసరిస్తూ దైవాన్ని ఆరాధించాలి. అంతేకానీ, మన నమ్మకాన్ని ఎదుటివారు తప్పనిసరిగా అనుసరించాలని, వారు కూడా ఇదే విధానం పాటించాలని కోరుకోవడం దురాశ అవుతుంది. ఎవరికి నచ్చిన విధానంలో వారు దైవాన్ని పూజించుకోవచ్చు. ఎదుటివాళ్లకు ఈ విధానం నచ్చితే వారు కూడా మీ దారిలోకి వచ్చేస్తారు. అంతేకానీ బలవంతం చేయకూడదని పెద్దలు చెబుతున్నారు.
ఒక వేళ తమ నమ్మకాన్ని ఇతరులు పట్టించుకోకపోయినా, తాము నమ్ముతున్న పూజా విధానాన్ని, దైవ నామ స్మరణను వారు నమ్మకపోయినా వీరు హర్ట్ అవుతుంటారు. ఇలా చేయడం ఏ మాత్రం సమంజసం కాదని పెద్దలు చెబుతున్నారు. ఇది మహాపాపంగా పరిగణించాలని సూచిస్తున్నారు. భక్తి మార్గంలో ఏది సరైనదని చెప్పేందుకు ఈ భూ ప్రపంచంలో ఎవరికీ అర్హత లేదని స్పష్టం చేస్తున్నారు.