HomeLife StyleCalcium: శరీరంలో క్యాల్షియం తగ్గితే ఏం జరుగుతుంది? సంకేతాలు ఇవీ..!

Calcium: శరీరంలో క్యాల్షియం తగ్గితే ఏం జరుగుతుంది? సంకేతాలు ఇవీ..!

Calcium: పోషకారం తీసుకోవడం అందరికీ ముఖ్యం. మనిషి అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండేందుకు మన బాడీకి పోషకాలు అందేలా చూసుకోవాలి. శరీరానికి సరైన పోషకాహారం అందకపోయినట్లయితే అనారోగ్యం బారిన పడతారు. మరీ ముఖ్యంగా కాల్షియం దొరికే ఫుడ్స్‌ రోజూ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా కాల్షియం లభించే ఆహారాలు డైలీ డైట్‌లో కచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇది శరీరానికి చాలా అవసరమైన ఖనిజం. ఇది లోపిస్తే ఎముకలు బలహీనంగా తయారవుతాయి. చిన్న దెబ్బలకే ఎముకలు విరిగిపోవచ్చు. కండరాల కదలిక, నరాల మధ్య కమ్యూనికేషన్, రక్తం గడ్డకట్టడానికి కూడా కాల్షియం అవసరం. శరీరంలో కావాల్సినంత కాల్షియం లేనప్పుడు, హైపోకాల్సెమియా అనే పరిస్థితి ఏర్పడుతుంది. శరీరంలో చాలా తక్కువ కాల్షియం స్థాయిలు ఉంటే ఎముకల బలహీనత, కండరాలు తిమ్మిరిగా ఉండటం, గందరగోళం లాంటి సమస్యలు ఏర్పడతాయి.

ఎముకల బలహీనత
శరీరంలోని కాల్షియం ఎక్కువ భాగం పళ్లు, ఎముకల్లోనే నిల్వ ఉంటుంది. ఇది రక్తంలోనూ ఉంటుంది. కాల్షియం గుండె, కండరాలు, నరాలు సరిగ్గా పని చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆహారం నుంచి కావాల్సినంత కాల్షియం పొందకపోతే, శరీరం దానిని ఎముకల నుంచి తీసుకుంటుంది. దీనివల్ల ఎముకలు బలహీనంగా మారుతాయి. బోలు ఎముకల వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

థైరాయిడ్ సర్జరీ చేయించుకున్న వారు, కొన్ని మందులు తీసుకునేవారు, జన్యుపరమైన పరిస్థితులు, తక్కువ మెగ్నీషియం, ప్యాంక్రియాటైటిస్ లేదా డిజార్జ్ సిండ్రోమ్ ఉన్నవారు కాల్షియం తక్కువై బాధపడుతుంటారు. పెరుగుతున్న పిల్లలు, మహిళలు, వృద్ధుల్లోనూ కాల్షియం లోపించడం అప్పుడప్పుడూ కనిపిస్తుంది. మూత్రపిండ సమస్యలు ఉన్న వారు కాల్షియం లేమితో ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే వారి రక్తంలో చాలా ఎక్కువ భాస్వరం ఉంటుంది. ఇది కాల్షియం స్థాయిలను గందరగోళానికి గురి చేస్తుంది. మనదేహం కాల్షియంను గ్రహించడానికి విటమిన్ డీ అవసరం అవుతుంది. అది లేకుండా కాల్షియం లభించే ఆహారాలు తిన్నా, శరీరం దానిని సరిగ్గా వినియోగించదు.

లక్షణాలు ఏంటి?
తేలికపాటి హైపోకాల్సెమియా పరిస్థితి స్పష్టమైన లక్షణాలను చూపకపోవచ్చు. అయితే, కండరాల తిమ్మిరి, చర్మం పొడిబారడం, గోళ్లు పెళుసుగా మారడం, జుట్టులో మార్పులు, గందరగోళం, మానసిక కల్లోలం, జలదరింపు, కండరాల నొప్పులు, మూర్ఛ, గుండె సమస్యలు కనిపిస్తే అది హైపోకాల్సెమియా అని అర్థం చేసుకోవాలి.

ఎలాంటి ఆహారం..?
క్యాల్షియం లోపంతో బాధపడే వారికి వైద్యులు సాధారణంగా కాల్షియం మాత్రలు సూచిస్తుంటారు. ఈ మాత్రలకు బదులుగా కాల్షియం అధికంగా ఉండే డెయిరీ ప్రొడక్ట్స్, నారింజ, పాలకూర వంటి ఆహారాలను తినొచ్చు. బీన్స్, బఠానీలు, బాదం వంటి గింజలు, చేపలు, సోయా ఉత్పత్తుల నుంచి కూడా ఈ ఖనిజం లభిస్తుంది. శరీరంలో కాల్షియం ఎక్కువ పెరిగిపోకుండా కూడా చూసుకోవాలి.

ఎక్కువ కాలం కాల్షియం లోపంతో బాధపడుతున్న వారికి విటమిన్ డీ మాత్రలు లేదా ప్రత్యేక హార్మోన్ షాట్ అవసరం అవుతాయి. తీవ్రమైన సందర్భాల్లో ఆసుపత్రిలో ఐవీ ద్వారా కాల్షియం తీసుకోవచ్చు. ఆరోగ్యానికి కాల్షియం స్థాయిలను సరిగ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఆహారంలో కాల్షియంను తప్పకుండా భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి: Sleep: మనిషికి నిద్ర ఎలా ఉపయోగపడుతుంది? ఆరోగ్యంపై ప్రభావం ఎలా ఉంటుందంటే..
Wax gourd: బూడిద గుమ్మడికాయతో మీ ఆరోగ్యం పదిలం.. ప్రయోజనాలు ఇవీ..!
Sitting on Chair: రోజూ ఎక్కువ సమయం కుర్చీలోనే కూర్చుంటున్నారా? శారీరక ఆరోగ్య ప్రమాదాలు!
Daily Egg: రోజుకో గుడ్డు.. ఆరోగ్యానికి వెరీ గుడ్డు.. ఉడికించిన గుడ్డులో పోషకాలెన్నో తెలుసా?
Egg benefits: ఇది మీకు తెలుసా? గుడ్డుతో పాటు పెంకులు తిన్నా ఆరోగ్యమేనట..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు