HomeLife StyleWash Hair with cola: మీ జుట్టును కోలాతో శుభ్రంగా కడిగితే తళతళ మెరిసిపోవాల్సిందే!

Wash Hair with cola: మీ జుట్టును కోలాతో శుభ్రంగా కడిగితే తళతళ మెరిసిపోవాల్సిందే!

Wash Hair with cola: జుట్టు కర్లీగా, అందగా, పొడుగ్గా, నల్లగా ఉండాలని అందరూ కలలు కంటుంటారు. ముఖ్యంగా కాస్త బట్టతల ఉన్నవాళ్లు, పెళ్లి కావాల్సిన అమ్మాయిలు జుట్టు గురించి బాగా బెంగ పెట్టుకుంటారు. అయితే, మీ జుట్టు మెరిసిపోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు.

మీకు లింప్, డల్ హెయిర్ ఉంటే, మీరు కోలా కలగిలిపిన ఈ ట్రిక్ పాటించి చూడండి. చాలా మంది స్త్రీలకు వాల్యూమ్, షైన్ లేని జుట్టుతో తెగ ఫీల్‌ అయిపోతుంటారు. మనం మన జుట్టును తరచుగా కడగడం, రంగులు వేయడం, స్ట్రెయిట్ చేయడం మరియు కర్లింగ్ చేయడం వంటివి చేస్తుంటాం. అయితే ఇలా చేయడం వల్ల మన జుట్టుకు ఎలాంటి మేలూ కలగదని గ్రహించాలి.

మీ జుట్టును కోలాతో కడగడం వల్ల భారీ మార్పులు గమనించవచ్చు. ఇది చదివిన తర్వాత మీరు ఆశ్చర్యపోవడం గ్యారెంటీ. కోలా నిజానికి చాలా విభిన్నమైన విషయాలకు ఉపయోగపడుతుందని చాలా మందికి తెలియదు. మీరు మీ టీ కెటిల్‌ను డీస్కేల్ చేయడానికి లేదా టాయిలెట్‌ను శుభ్రం చేయడానికి వాడుకోవచ్చు. ఉదాహరణకు.. కోలా లాంటి హార్డ్‌ డ్రింక్‌తో చాలా వస్తువులను శుభ్రం చేసుకోవచ్చు.

మీరు మీ జుట్టు నుంచి లేదా మీ పిల్లల జుట్టు నుంచి చూయింగ్ గమ్‌ను తొలగించడానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఒక గిన్నెలో కోక్ నింపి అందులో చూయింగ్ గమ్ ఉన్న జుట్టు ముక్కను ఉంచండి. దీన్ని కాసేపు అలాగే ఉంచండి. గమ్‌ను తొలగించడం ఎంత సులభమో మీరు స్వయంగా ఎక్స్‌పీరియన్స్‌ చేస్తారు. అలాగే జుట్టు మొత్తాన్ని మీరు కోలాతో కడుక్కోవచ్చంటే నమ్మగలరా?

మీ జుట్టును ఇలా కడగండి
ఇది నిజంగా పని చేస్తుందో లేదో ఎవరూ చెప్పలేరు కానీ కొన్ని అధ్యయనాలు మాత్రం ప్రత్యేకంగా చెబుతున్నాయి. మీ జుట్టు మరింత పెరగాలన్నా, లేదా దృఢమైన హెయిర్‌ కావాలన్నా ఈ ట్రిక్‌ తప్పనిసరిగా పాటించి చూడండి. కోలాలో ఉండే అధిక ఆమ్లత స్థాయి జుట్టు పొలుసులు మూసుకుపోవడానికి మరియు కుదించడానికి కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో మీ జుట్టు మెరిసేలా తయారవుతుంది. చాలా బాగుంది అంటూ మీ కొలీగ్స్‌, ఫ్రెండ్స్‌ కామెంట్లు చేయడం ఖాయం. ఇందుకోసం మీకు కావాల్సిందల్లా రెండు చిన్న బాటిళ్ల కోక్. దానిని మళ్లీ శుభ్రం చేయడానికి నీరు మాత్రమే. ఒక సారి ప్రయత్నించి చూడండి. నచ్చితే, మంచి ఫలితాలు ఉంటే మీ స్నేహితులకు కూడా సిఫార్సు చేయవచ్చు.

గమనిక: నిర్దిష్ట ఫలితాలకు ఈ కథనం ఎటువంటి హామీని ఇవ్వదు. వ్యక్తిని బట్టి ఫలితాలు మారవచ్చు.

ఇవీ చదవండి: Hair problems: జుట్టు రాలుతోందా.. ఇలా చేస్తే మంచి ఫలితాలు చూస్తారు
White Hair: ఈ ఆకు నలిపి తలకి రాసుకుంటే తెల్ల జుట్టు నల్లగా మారిపోతుంది!
Calcium: శరీరంలో క్యాల్షియం తగ్గితే ఏం జరుగుతుంది? సంకేతాలు ఇవీ..!
Calcium: శరీరంలో క్యాల్షియం తగ్గితే ఏం జరుగుతుంది? సంకేతాలు ఇవీ..!
Onion: ఉల్లిపాయ తొక్కతో ఊహించని ప్రయోజనాలు..!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు