YSRCP: చంద్రబాబుకు పొరపాటున ఓటు వేయడం అంటే చీకటి రోజులను మళ్లీ తెచ్చుకోవడమేనని వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు చెప్పేవి అబద్దాలని ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. అయినా పదేపదే అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు.
“చేయగలిగినవి మాత్రమే సీఎం జగన్ మేనిఫెస్టో లో పెట్టారు. బాబు కూటమిలో అన్ని సాధ్యం కానీ హామీలే. వాళ్లు చెప్పేవి అబద్ధాలని ప్రజలకు తెలుసని చంద్రబాబుకు కూడా తెలుసు. కోవిడ్ ఉన్నప్పుడు కూడా సంక్షేమ పథకాలు కొనసాగించాం. అభివృద్ధి ఎక్కడా ఆపలేదు … కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చాం. మేము ఇస్తున్న పథకాలకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు ? గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. రుణమాఫీ అన్నాడు .. సున్నావడ్డీ అన్నాడు చేసిందేమి లేదు.
డ్వాక్రా మహిళలకు అసలు సున్నా వడ్డీ ఇవ్వలేదు. యువతకు ఉపాధి అవకాశాలు, నెలకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి ఇస్తానంటున్నాడు. 2014 లో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఏం చేశాడు? పథకాలన్నింటినీ వడపోస్తూ ఎవరికీ ఇవ్వలేదు. ఎన్నికలు వచ్చేసరికి హడావిడిగా హామీలు ఇవ్వడం .. అమలు చేయకపోవడం బాబుకు అలవాటు. అర్హత ఉన్నవాళ్లందరికీ జగన్ సంక్షేమ పథకాలు అందించారు. చంద్రబాబు మాత్రం కండీషన్స్ అప్లై అంటూ పథకాల్లో కోత పెట్టాడు.
చంద్రబాబు చెప్పే సూపర్ సిక్స్ అనేవి అమలు చేయడు. రైతులు, పేదల ఎదుగుదలకు సీఎం జగన్ కట్టుబడి ఉన్నారు. వెసులుబాటు ఉంటే సీఎం జగన్ మరిన్ని పథకాలు అమలు చేస్తారు. పేదల కోసం సీఎం జగన్ ఏమాత్రం వెనుకాడరు. ఆర్ధిక వ్యవస్థ పుంజుకుని మరింత ఆదాయం పెరిగితే మరిన్ని పథకాలు అమలు చేస్తాం. చంద్రబాబు వల్ల పెన్షన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇప్పుడు మళ్లీ పెన్షన్ రూ. 40 వేలు ఇస్తానని అబద్దపు హామీ ఇస్తున్నాడు. టీడీపీ ఏజెంట్ నిమ్మగడ్డ తో కలిసి ఇంటింటికి పెన్షన్లు అందకుండా చేశాడు. కొన్ని వర్గాల వారికి 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తానంటున్నాడు? చంద్రబాబుకు ఓటు వేయడమంటే చీకటి రోజులు మళ్లీ తెచ్చుకోవడమే. చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే జీవితాలతో చెలగాటమాడతాడు. మళ్లీ జన్మభూమి కమిటీలు, పాత వ్యవస్థను తీసుకొస్తాడు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెచ్చింది. చంద్రబాబు సాధ్యం కానీ మేనిఫెస్టో కు బీజేపీ మద్దతు లేదు. అసలు బీజేపీ గుర్తును వాడుకోవడానికి అనుమతించలేదు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను అమలు చేయాలంటే సమగ్ర భూసర్వే జరగాలి. వాస్తవాలకు విరుద్ధంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. బీజేపీ తో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై ఎందుకు ప్రశ్నించడం లేదు? రాజకీయాల్లో ఉండటానికి చంద్రబాబుకు అర్హత లేదు.” అని సజ్జల కామెంట్ చేశారు.
ఇవీ చదవండి Sajjala on CBN: వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు కుట్రపూరితంగా మాట్లాడుతున్నారు : సజ్జల రామకృష్ణారెడ్డి
Sajjala on TDP activities: మోసం చేయడంలో కొత్త టెక్నిక్ టీడీపీకి తెలుసు : సజ్జల రామకృష్ణా రెడ్డి
YS Jagan in Bobbili: పేదవాడి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలివి.. బొబ్బిలిలో సీఎం జగన్
YS Jagan in Payakaraopeta: బాబుకు ఓటేస్తే కొండ చిలువ నోట్లో తలకాయపెట్టడమే.. పాయకరావుపేటలో సీఎం జగన్
YS Jagan in Tanguturu: బాబుది బోగస్ రిపోర్ట్.. మీ జగన్ ఇస్తున్నది కళ్లెదుటే కనిపించే ప్రోగ్రెస్ రిపోర్ట్: టంగుటూరు సభలో సీఎం జగన్
