HomeAndhra PradeshPerni Nani: కూటమి కకావికలం.. మోదీ, పవన్‌ ఫొటోలు ఏవీ?: పేర్ని నాని విమర్శలు

Perni Nani: కూటమి కకావికలం.. మోదీ, పవన్‌ ఫొటోలు ఏవీ?: పేర్ని నాని విమర్శలు

Perni Nani: కూటమి నేతలు మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని మచిలీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు. మచిలీపట్నంలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి మేనిఫెస్టో లో మోదీ ఫోటో మాయమైందన్నారు. చంద్రబాబు, పవన్ హామీలకు బీజేపీ మద్దతు లేదని ఈ ఉదంతం స్పష్టం చేస్తోందన్నారు.

ఎన్నికలు దగ్గరకు వచ్చాక మేనిఫెస్టో లో పవన్ ఫోటో కూడా మాయం చేశారని తెలిపారు. సూపర్ సిక్స్ లో రూ.4 వేల పెన్షన్ హామీ కూడా మాయమైందని చెప్పారు. కూటమి మేనిఫెస్టో లో మోదీ, పవన్ ఫోటోలు మాయమయ్యాయని పేర్ని నాని గుర్తు చేశారు. 1999 లో కూడా చంద్రబాబు దగా మేనిఫెస్టో రిలీజ్ చేశాడని తెలిపారు.

చంద్రబాబు 25 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు.. ఇవ్వలేదని రాష్ట్రంలో యువత అందరికీ తెలిసిందన్నారు. ఇళ్ల స్థలాలు ఇస్తానన్నాడు .. ఎంత మందికి ఇచ్చాడు ? అని పేర్ని నాని ప్రశ్నలు గుప్పించారు. మహిళా రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తానన్నాడు … ఏం చేశాడు ? అని నిలదీశారు. మహిళా బ్యాంకులు ఏర్పాటు చేస్తానన్నాడని గుర్తుచేశారు.

1994 నుంచే మేనిఫెస్టో లో ప్రకటించిన హామీలు తీసేయడం చంద్రబాబుకు అలవాటుగా మార్చుకున్నాడని పేర్ని నాని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు దగాకోరు తస్మాత్ జాగ్రత్త.. అంటూ ప్రజలను హెచ్చరించారు. కొడుకు కోసం మోసపూరిత హామీలు ఇస్తున్నాడని అందరూ జాగ్రత్తపడాలన్నారు. అనారోగ్యంతో ఉన్న వృద్ధులు బ్యాంకులకు వెళ్లే పరిస్థితి చంద్రబాబు తీసుకొచ్చాడంటూ పేర్ని నాని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి Perni Nani: పదేళ్లయినా నా కోసం బతుకుదామనే ఆలోచనతో పోటీ చేయడం లేదు: పేర్ని నాని
Perni Nani: చంద్రబాబు ఏనాడూ సచివాలయం గుమ్మం తొక్కలేదు: పేర్ని నాని
Perni Nani: వాలంటీర్ల సేవల నిలిపివేతకు కుట్ర చేసింది బాబే: పేర్ని నాని
Perni Nani Comments: మోదీజీ.. వెనుక నుంచి చంద్రబాబు రాకుండా చూసుకోండి: పేర్ని నాని
Perni Nani on Kollu Ravindra: బందరులో పేర్ని నాని వర్సెస్‌ కొల్లు రవీంద్ర.. సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయ వేడి!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు