HomeAndhra PradeshYS Jagan: 3, 4వ తేదీల్లో సీఎం జగన్‌ ఎన్నికల సభలు జరిగే ప్రాంతాలు ఇవీ..

YS Jagan: 3, 4వ తేదీల్లో సీఎం జగన్‌ ఎన్నికల సభలు జరిగే ప్రాంతాలు ఇవీ..

YS Jagan: సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతంగా కొనసాగిస్తున్నారు. భారీ ఎండల్లోనూ అశేష జనవాహిని తరలి వస్తున్నారు. ఇవాళ మే 2న సీఎం జగన్‌ ప్రచారానికి విరామం ప్రకటించారు. అనంతరం రేపు ఎల్లుండి రోజుకు మూడు సభల చొప్పున సీఎం జగన్‌ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేపు పర్యటించే మూడు ప్రాంతాల వివరాలను వైయస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ వెల్లడించారు.

ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచార సభల మే 3 వ తేదీ షెడ్యూల్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 3వ తేదీన ఎన్నికల ప్రచారాన్ని మూడు నియోజకవర్గాల్లో నిర్వహిస్తారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు నరసాపురం పార్లమెంట్ పరుధిలోని నరసాపురంలో స్టీమెర్ సెంటర్ లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు.

అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు సెంటర్ లో జరిగే సభ లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ని కనిగిరి లో పామురు బస్ స్టాండ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్‌ పాల్గొంటారు. పాల్గొంటారు.

ఈనెల 4న నిర్వహించే సభలు ఇవీ..

ఈనెల 4వ తేదీన శనివారం రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించనున్నారు. తొలుత 4న ఉదయం 10 గంటలకు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం జగన్‌ పాల్గొంటారు. ఇక్కడ చాలా ఏళ్ల తర్వాత తొలిసారి బాలయ్య నియోజకవర్గంలో సీఎం జగన్‌ ఎన్నికల సభ నిర్వహిస్తుండటం విశేషం. అనంతరం మధ్యాహ్నం నిర్వహించే సభలో పలమనేరులో ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక సాయంత్రం 4 గంటలకు నిర్వహించే సభ నెల్లూరులో ఉంటుందని తెలుస్తోంది. ఇక మే 5వ తేదీన విరామం ప్రకటించే అవకాశాలున్నాయి.

ఇవీ చదవండి: YS Jagan in Bobbili: పేదవాడి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలివి.. బొబ్బిలిలో సీఎం జగన్
YS Jagan in Payakaraopeta: బాబుకు ఓటేస్తే కొండ చిలువ నోట్లో తలకాయపెట్టడమే.. పాయకరావుపేటలో సీఎం జగన్
YS Jagan in Eluru: పేదలు పేదలు అని మాట్లాడుతుంటే పెత్తందార్లకు నచ్చటం లేదు.. ఏలూరులో సీఎం జగన్
YS Jagan in Tanguturu: బాబుది బోగస్ రిపోర్ట్.. మీ జగన్ ఇస్తున్నది కళ్లెదుటే కనిపించే ప్రోగ్రెస్ రిపోర్ట్: టంగుటూరు సభలో సీఎం జగన్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు