YS Jagan Election Campaign: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మరో కీలక ఘట్టానికి తెర తీయనున్నారు. ఇప్పటికే సిద్ధం సభల పేరిట నాలుగు భారీ సభలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సీఎం జగన్.. ఎన్నికల ప్రచారంలో అందరికంటే ముందున్నారు. అనంతరం ఎన్నికల తేదీలు ఖరారు కాగానే రాష్ట్ర వ్యాప్తంగా 22 రోజులపాటు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర నిర్వహించారు. తాజాగా ఇవాళ పులివెందుల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జగన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పులివెందులలో భారీ బహిరంగ సభ నిర్వహించారు సీఎం జగన్.
తాజాగా మరో ప్రచార అంకానికి సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. ఈనెల 28వ తేదీ నుంచి వరుసగా సభలు నిర్వహించేలా ప్లాన్ చేశారు. ఈ రెండు రోజులపాటు మేనిఫెస్టో, ఇతర పార్టీ వ్యవహారాలను సీఎం జగన్ చక్కబెట్టనున్నారు. 28వ తేదీ నుంచి రోజూ మూడు ప్రాంతాల్లో మూడు సభలు నిర్వహించేలా పార్టీ కార్యాచరణ సిద్ధం చేసింది.
28వ తేదీ నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు. మొదట అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి ప్రచార సభలు ప్రారభించనున్నారు. ప్రతిరోజు 3 ప్రచార సభల్లో సీఎం జగన్ పాల్గొంటారు. రోజూ ఒక సభ ఉదయం 10 గంటలకు, రెండో సభ మధ్యాహ్నం 12.30 గంటలకు, మూడో సభ సాయంత్రం 3 గంటలకు జరుగుతాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
తొలి నాలుగు రోజుల షెడ్యూల్ ఇదీ..
* 28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరులో నిర్వహించే సభల్లో సీఎం పాల్గొంటారు.
* 29న చోడవరం, పి.గన్నవరం, పొన్నూరులో సభలు ఉంటాయి.
* 30న కొండెపి, మైదుకూరు, పీలేరులో సీఎం జగన్ ప్రచారం నిర్వహిస్తారు.
* మే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో సీఎం జగన్ ప్రచార సభలు నిర్వహిస్తారు.
ఇవీ చదవండి: YS Jagan in Pulivendula: కుటుంబానికి దోచిపెట్టడానికి సీఎం కాలేదు.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు!
Botcha Satyanarayana: నాకు తండ్రిలాంటి వాడు.. సీఎం జగన్ వ్యాఖ్యలతో మంత్రి బొత్స భావోద్వేగం!
YS Jagan in Vizianagaram: డ్రీమ్స్ మీవి, స్కీమ్స్ మీ జగన్‌వి.. విజయనగరం సభలో సీఎం జగన్
