Pemmasani: టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. ఎందుకంటే.. ఆయన ఆస్తుల వివరాలు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనడమే ఇందుకు కారణం. తన ఆస్తుల వివరాలను గుంటూరు లోక్ సభ టీడీపీ కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు.
ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తుల వివరాలను ఆయన ప్రకటించారు. పెమ్మసాని చంద్రశేఖర్ ఆస్తుల విలువ రూ.5,700 కోట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. పెమ్మసాని చరాస్తుల విలువ రూ.2,316 కోట్లుగా పేర్కొన్నారు. పెమ్మసాని భార్య శ్రీరత్నకు రూ.2,289 కోట్ల చరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. పెమ్మసాని, శ్రీరత్నకు చెరో రూ.1,200 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయని వెల్లడించారు. పెమ్మసాని, శ్రీరత్నకు చెరో రూ.519 కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు.
పెమ్మసాని చంద్రశేఖర్ కు రూ.6.11 కోట్ల విలువైన 4 కార్లు ఉన్నాయట. పెమ్మసాని, శ్రీరత్నకు బ్యాంకు ఖాతాల్లో చెరో రూ.5.9 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. పెమ్మసాని కుటుంబానికి 6.86 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయట. పెమ్మసానికి గుంటూరు జిల్లాలో రూ.2.67 కోట్ల విలువైన సాగు భూములు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. పెమ్మసాని భార్య పేరిట కృష్ణా జిల్లాలో రూ.2.33 కోట్ల విలువైన సాగు భూమి ఉందని పేర్కొన్నారు.
పెమ్మసానికి తెలంగాణలోనూ ఆస్తులున్నాయి. హైదరాబాద్ లో రూ.28.1 కోట్ల విలువైన భూములు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. పెమ్మసానికి అమెరికాలో రూ.6.82 కోట్ల విలువైన భూములు ఉన్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ లో 29.73 కోట్ల విలువైన వాణిజ్య భవనం, ఢిల్లీలో రూ.72 కోట్ల విలువైన భవనం, ఆయన భార్య పేరిట ఢిల్లీలో రూ.34.82 కోట్ల విలువైన భవనం ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అమెరికాలో రూ.28 కోట్ల 26 లక్షల విలువైన భవనాలు ఉన్నట్లు అఫిడవిట్‌లో పెమ్మసాని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: Ambati Rambabu: జగన్ దెబ్బకు తట్టుకునే శక్తి టీడీపీకి లేదు: మంత్రి అంబటి రాంబాబు
TDP in Rajyasabha: నేటి నుంచి రాజ్యసభలో టీడీపీ జీరో!
Vizianagaram TDP: విజయనగరం టీడీపీ ఎంపీ అభ్యర్థికి షాక్.. ఐదుగురు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థుల ఝలక్!
