HomeNationalHand Transplantation: హ్యాండ్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేసిన వ్యక్తి ఇప్పుడెలా ఉన్నాడు?

Hand Transplantation: హ్యాండ్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేసిన వ్యక్తి ఇప్పుడెలా ఉన్నాడు?

Hand Transplantation: అవయవదానం అన్నింటికంటే మిన్న అని మనం చదువుకుంటూ ఉంటాం. చనిపోతూ మరికొంత మందికి ప్రాణదానం చేయడం మామూలు విషయం కాదు. ఓ మహిళ చేతులను పురుషుడికి అతికించిన వార్త మనం చూసే ఉంటాం. అవయవదానంతో రెండు చేతులను వైద్యులు అతడికి అమర్చారు.

అవయదానంలో ఇప్పటివరకు కళ్లు, కిడ్నీ, గుండె దానాల గురించి విన్నాం, చూశాం. ఇప్పుడు ఏకంగా రెండు చేతులు కోల్పోయిన ఓ వ్యక్తికి శస్త్రచికిత్స చేసి ఆ చేతులను అతికించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని శ్రీ గంగారామ్‌ ఆస్పత్రి వైద్యబృందం ఈ రికార్డును ఇటీవల సృష్టించింది.

ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి (45) పెయింటర్‌ వృత్తి చేసేవాడు. 2020లో జరిగిన రైలు ప్రమాదంలో ఆయన తన రెండు చేతులను కోల్పోవాల్సి వచ్చింది. అయితే, తన చేతులను తిరిగి పొందేందుకు ఇటీవల వైద్యుల వద్దకు వెళ్లాడు. బ్రెయిన్‌ డెడ్‌తో మరణించిన మహిళ చేతులను ఇతడికి సెట్‌ చేసేలా వైద్యులు ప్రణాళిక రచించారు. ఆ మేరకు విజయవంతంగా రెండు చేతులనూ ఇతడికి అమర్చారు.

ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, చేతులను, వేళ్లను కదిలించగలుగుతున్నాడని వైద్యులు పేర్కొన్నారు. దీంతో మళ్లీ అతడి జీవితంలో కొత్త ఆశలు రేకెత్తాయి. ఈ ఆపరేషన్‌ను 12 గంటల పాటు శ్రమించి పూర్తి చేశారు వైద్యులు. మరోవైపు.. ఆమె అవయవాలతో మరో ముగ్గురికి సైతం కొత్త జీవితం లభించింది.

చనిపోతూ నలుగురికి ఉపయోగపడటం ఆమె జన్మకు సార్థకత చేకూరిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. గతంలో కూడా ఈ తరహా శస్త్రచికిత్సలు జరిగాయి. ఎడమ చేతిని కోల్పోయిన వ్యక్తికి హరియాణాలోని అమృత ఆసుపత్రిలో సర్జరీ చేసి అవయవాన్ని అతికించిన ఘటన జరిగింది.

ఇవీ చదవండి: Sleep: మనిషికి నిద్ర ఎలా ఉపయోగపడుతుంది? ఆరోగ్యంపై ప్రభావం ఎలా ఉంటుందంటే..
Wax gourd: బూడిద గుమ్మడికాయతో మీ ఆరోగ్యం పదిలం.. ప్రయోజనాలు ఇవీ..!
Sitting on Chair: రోజూ ఎక్కువ సమయం కుర్చీలోనే కూర్చుంటున్నారా? శారీరక ఆరోగ్య ప్రమాదాలు!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు