Attack on YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై దాడి కేసు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగు చూశాయి. ప్రత్యక్ష సాక్షుల సమాచారంతో సీఎం జగన్ పై దాడి చేసిన నిందితుడిని గుర్తించామని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. కాల్ డేటా, సీసీ టీవీ ఫుటేజ్ లో కూడా నిందితుడి కదలికలు స్పాట్ లో ఉన్నట్లు నిర్ధారణ చేశామన్నారు.
తమకు వచ్చిన సమాచారంతో అన్ని ఆధారాలు సేకరించి నిందితుడ్ని అరెస్టు చేశామని తెలిపారు. 17వ తేదిన నిందితుడిని రాజరాజేశ్వరి పేటలో అరెస్టు చేసి సెల్ ఫోన్ సీజ్ చేశామని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు కేసులో ఏ2 ప్రోద్బలంతో కుట్ర చేసి దాడికి పాల్పడినట్టు గుర్తించామన్నారు. సీఎం వైఎస్ జగన్ హత్య చేసేందుకు పదునైన రాయితో దాడి చేశాడని రిమాండ్ రిపోర్టులో తెలిపారు.
దాడి వెనుక సీఎం జగన్ ను చంపాలన్న ఉద్ధేశం ఉందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సీఎం జగన్ హత్యకు కుట్ర పన్నారని, అందుకే రాయితో దాడి చేసి హత్య చేసేందుకు ప్లాన్ చేశారని అందులో మెన్షన్ చేశారు. జగన్ను చంపాలనే సున్నితమైన తలభాగంపై దాడి చేశాడని రిమార్డ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు.
కీలక విషయాలు వెల్లడి
ఒకసారి రాయి తగలకపోవడంతో రెండోసారి మిస్ కాకుండా నిందితుడు సతీష్ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. డాబా కోట్ల సెంటర్ లో దాడి చేసేందుకు ప్రయత్నం చేసినట్లు తేలింది. రాయి తీసినా పోలీసులు, తోపులాటతో అక్కడి నుంచి సతీష్ వెళ్లిపోయాడు. వివేకానంద స్కూల్ పక్కనున్న దగ్గరకు వెళ్లి రాయితో సీఎం జగన్పై దాడికి పాల్పడ్డాడు.
దాడి చేసిన వెంటనే పట్టుకున్నా.. వదిలించుకుని నిందితుడు సతీష్ పారిపోయాడని తెలుస్తోంది. సీఎం జగన్ పై దాడి చేయాలని.. డబ్బులిస్తానని సతీష్ కు టీడీపీ నేత దుర్గారావు చెప్పినట్లు తెలుస్తోంది. టీడీపీ బీసీ సెల్ కార్యదర్శిగా దుర్గారావు ఉన్నారు. రాయి దాడి తర్వాత డబ్బుల కోసం దుర్గారావుకు సతీష్ ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒకసారి మాట్లాడి ఆ తర్వాత రెండోసారి ఫోన్ కట్ చేసి దుర్గారావు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడని గుర్తించారు.
ఇవీ చదవండి: YS Viveka Case: వైఎస్ వివేకా హత్య కేసుపై కడప కోర్టు కీలక ఉత్తర్వులు.. ఎవరూ మాట్లాడొద్దని ఆదేశం
YS Jagan in Guntur: 2014లో ఇంటింటికీ పంపిన పాంప్లెట్లో ఒక్క హామీ అయినా చంద్రబాబు నెరవేర్చారా?
YS Jagan with Pensioners: చంద్రబాబు 40 ఏళ్ల అనుభవంలో ఏనాడైనా ఇంటికే పెన్షన్ ఇచ్చాడా?: సీఎం జగన్ సూటి ప్రశ్న
