Find My Device: మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారికి తమ ఫోన్‌ను వెతుక్కోవడం చాలా కష్టతరమైన టాస్క్. ఆండ్రాయిడ్ ఫోన్ పోతే కనిపెట్టేందుకు ఫైండ్ మై డివైజ్ (Find My Device) సౌకర్యం ఉంది. అయితే, ఇంటర్నెట్ సౌకర్యం, నెట్‌వర్క్ లేకపోతే డివైజ్‌ను కనిపెట్టడం కష్టం. అయితే, ఇలాంటి సమస్యకు చెక్ పెడుతూ గూగుల్ (Google) కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. Find My Device ఫెసిలిటీని అప్‌గ్రేడ్ చేసినట్లు వెల్లడించింది.
అప్‌గ్రేడ్ చేసిన Find My Device ఎంపికలో స్మార్ట్ ఫోన్‌లో డేటా కనెక్టివిటీ లేకున్నా సరే.. ఫోన్‌ను పట్టేయొచ్చు. యాపిల్ సంస్థ తన ఐఫోన్ యూజర్ల కోసం చాలా కాలం కిందటే ‘ఫైండ్ మై నెట్‌వర్క్’ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆ మాదిరిగానే ఫైండ్ మై ఫోన్ ఎంపికను గూగుల్ తాజాగా ఆధునీకరించింది. ఇప్పటికి అమెరికా, కెనడా దేశాల్లో ఈ ఫెసిలిటీని అందుబాటులోకి తెచ్చింది. త్వరలో వరల్డ్ వైడ్‌గా దీన్ని ఆండ్రాయిడ్ యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకురానుంది.
తాజాగా అప్‌గ్రేడ్ చేసిన ఫీచర్ ఆండ్రాయిడ్ 9 లేదా, అనంతర వర్షన్ ఫోన్లకే సపోర్టు చేసేలా తయారు చేస్తున్నారట. మే నెలలో రిలీజ్ కానున్న గూగుల్‌కు చెందిన పిక్సెల్ 8, 8 ప్రో ఫోన్లలో ఈ ఫెసిలిటీ మరింత మెరుగ్గా పనిచేస్తుందని తెలుస్తోంది. ఒకవేళ పిక్సెల్ ఫోన్ ఆఫ్‌లో ఉన్నా, బ్యాటరీ పూర్తిగా అయిపోయినా సరే ఈ ఫోన్లలో ఉండే హార్డ్‌వేర్ సాయంతో సులువుగా గుర్తించే వీలుందని గూగుల్ వెల్లడించింది.
కేవలం మీ స్మార్ట్ ఫోన్లు మాత్రమే కాదు.. స్మార్ట్‌వాచీలు, ఇయర్ బడ్స్‌నూ ఆఫ్‌లైన్‌లో ఉంటే గుర్తించే వీలుంటుందని గూగుల్ తెలిపింది. నిజానికి ఈ ఫీచర్‌ని నిరుడే తీసుకురావాలని గూగుల్ కసరత్తు చేసింది. కానీ ఈ ఫీచర్‌ను దుర్వినియోగం చేస్తారనే భయంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇక గూగుల్ ఈ ఏడాది వచ్చే నెలలో పిక్సెల్ 8ఏ (Google Pixel 8a)ను తీసుకురానున్న సంగతి తెలిసిందే. వీటికి సంబంధించిన కొన్ని ఫొటోలు సైతం లీకయ్యాయి. ఈ మొబైల్ టెన్సర్ జీ3 ప్రాసెసర్‌తో వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇవీ చదవండి: Mobile Phone: స్మార్ట్ ఫోన్ వినియోగదారులు సగటున రోజుకు 80 సార్లు చెక్ చేస్తున్నారట!!
5G Smartphone: రూ.15,000 లోపు బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు ఇవే..
Google Pay: మీ ఫోన్ పోయిందా? పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే ఎలా వాడాలంటే..!
