Tirumala News 10-04-2024: తిరుమలలో భక్తుల సంఖ్య తగ్గింది. ఎండ వేడిమి బాగా ఉండటం, స్కూళ్లలో పిల్లలకు పరీక్షలు ఉండటం వల్ల తిరుమల కొండకు వచ్చే భక్తుల సంఖ్య బాగా తగ్గింది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనానికి భక్తులను సిబ్బంది వదులుతున్నారు.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఎప్పుడూ భక్తులతో కనిపించేది ఇప్పుడు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నిన్న నేరుగా శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం కలిగింది. నిన్న శ్రీవారిని 55,756 మంది భక్తులు దర్శనం చేసుకుని తరించారు. తలనీలాలను 17,866 మంది భక్తులు శ్రీవారికి కళ్యాణకట్ట వద్ద సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ.2.71 కోట్లు చేకూరిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
ఈనెల 17న శ్రీవారి ఆలయంలో శ్రీరామ నవమి ఆస్థానం
ఈనెల 17న శ్రీవారి ఆలయంలో శ్రీరామ నవమి ఆస్థానం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈనెల 18న శ్రీరామ పట్టాభిషేకం ఆగమోక్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 21వ తేదీ నుంచి 3 రోజుల పాటు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు చేపడతారు. మూడు రోజుల పాటు ఆర్జిత సేవలను టీటీడీ అధికారులు రద్దు చేయనున్నారు. ఈనెల 22న స్వర్ణరథంపై శ్రీదేవి భూదేవి సమేతుడై మలయప్ప స్వామి భక్తులకు దర్శనం ఇస్తారు.
ఇవీ చదవండి: PM Modi at Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
Lord Venkateswara: శ్రీవేంకటేశ్వర స్వామివారు ఎవరిని ఇష్టపడతారు? స్వామి గురించి రహస్యం ఇదిగో..!
Devotional Tip: శ్రీనివాస ఐశ్వర్య మహామంత్రం.. ఎన్ని అప్పులున్నా ఈ మంత్రాన్ని పుస్తకంలో రాసుకొని చదవండి.. సకల శుభప్రదం!
