Venu swamy: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి నిత్యం సంచలన ప్రిడిక్షన్స్ చెబుతుంటారు. ముఖ్యంగా సినిమా హీరో, హీరోయిన్లకు సంబంధించిన జ్యోతిష్యం, రాజకీయ నాయకులకు సంబంధించిన ప్రిడిక్షన్లు ఈయన చెబితే కచ్చితంగా జరుగుతాయని చాలా మంది నమ్ముతారు. అంతెందుకు.. ఆయన చెప్పిన పలు విషయాలు తప్పనిసరిగా జరిగాయంటూ వీడియోలు సైతం ప్రదర్శిస్తున్నారు.
తాజాగా ఈహా యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు స్వామి పలు కీలక విషయాలు వెల్లడించారు. ఏపీలో జగనే మళ్లీ జగనే గెలవబోతున్నాడని వేణు స్వామి ఈ సందర్భంగా కుండబద్దలు కొట్టారు.
సుమారు మూడు దశాబ్దాలకుపైగా తాను జ్యోతిష్యం చెబుతున్నానని, కొన్నేళ్ల నుంచి రాజకీయ, సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాల్లో జరగబోయే వాటిని ప్రిడిక్షన్ చేసి చెబుతున్నట్లు వేణు స్వామి తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో, పొలిటికల్ ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి తాను ప్రముఖుల జీవితాలను నిశితంగా పరిశీలిస్తున్నానని, అందుకే వారి నక్షత్రాలు, జాతకాలు పూర్తి స్థాయిలో తెలుసుకుని జాతకాలు చెబుతున్నానని వెల్లడించారు.
త్వరలో కేటీఆర్ అరెస్టు..
తెలంగాణ రాజకీయాలకు సంబంధించి వేణు స్వామి స్పందిస్తూ.. 2022లోనే తాను ప్రిడిక్షన్ చేసి చెప్పానన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మొదటి స్థానం కోసం పోటీ పడుతుందని, కేసీఆర్ జీవితంలో బ్యాడ్ టైమ్ మొదలవుతుందని చెప్పానన్నారు. అలాగే కేసీఆర్, కేటీఆర్, కవిత.. ముగ్గురు కుటుంబ సభ్యులకు బ్యాడ్ టైమ్ మొదలవుతోందని చెప్పానన్నారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టు గురించి ముందే చెప్పానన్నారు. త్వరలో కేటీఆర్ కూడా అరెస్టు అవుతారని జోస్యం చెప్పారు. కేసీఆర్‌కు కష్టకాలం మొదలైందన్నారు. 30 సంవత్సరాల కిందట లైఫ్ పునరావృతమవుతోందన్నారు.
అలాగే ఏపీ రాజకీయాల గురించి వేణు స్వామి చెబుతూ.. చంద్రబాబు ప్రభుత్వ పరాజయాన్ని ఆయనకే డైరెక్టుగా చెప్పానని, తనకు వ్యతిరేకంగా ఎవరైనా చెబితే ఆయన తట్టుకోలేరని వేణు స్వామి వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం దారుణ ఓటమి పాలవుతుందని చెప్పానన్నారు. అలాగే చంద్రబాబుకు కారాగార వాసం ఉందని ఆయనకే నేరుగా చెప్పానన్నారు.
మొత్తంగా 2024 ఎన్నికల్లో మరోసారి జగనే గెలుస్తాడని, ఇందులో అనుమానం ఏదీ లేదన్నారు. జగన్ గెలిచిన తర్వాత ఇంకా 20 సంచలన అంశాలు వెల్లడిస్తానన్నారు. జగన్ గెలవడానికి తాను పూజలు చేస్తానంటూ ఇన్‌డైరెక్టుగా వేణు స్వామి చెప్పేశారు.
జూనియర్ ఎన్టీఆర్ సీఎం అవుతాడు
జూనియర్ ఎన్టీఆర్‌కు రాజయోగం ఉందని, 2030 తర్వాత కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడని వేణు స్వామి జోస్యం చెప్పారు. అలాగే రాజకీయాల్లోకి 2030 వరకు రావొద్దని జూనియర్ ఎన్టీఆర్ తల్లికి తానే చెప్పానని వేణు స్వామి తెలిపారు. అప్పటికి తెలుగుదేశం పార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్నారు. అయితే, జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టుకునే అవకాశాలున్నాయని వేణు స్వామి తెలిపారు.
పవన్ కల్యాణ్ జీవితంలో సీఎం కాలేడు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ జీవితంలో ముఖ్యమంత్రి కాలేడని, సీఎం అయ్యే యోగం ఆయనకు ఒక్క శాతం కూడా లేదని వేణు స్వామి తెలిపారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత జాతకం ప్రకారం ఇతరులు సీఎం అయ్యేందుకు సహరించడమే తప్ప.. తాను రాజయోగం అనుభవించే అవకాశం లేదని వేణు స్వామి తెలిపారు.
ఇవీ చదవండి: Andhra Pradesh: ఏపీలో ఇప్పటివరకు రూ.47.50 కోట్ల మేర పట్టివేత
Rasi Phalalu 2024 Venu swamy: వేణు స్వామి చెప్పిన సంచలనాలు.. 2024లో ఏ రాశి వారికి ఎలా ఉందంటే..!
Karthika Masam Dhanassu Rasi: కార్తీక మాసంలో ధనుస్సు రాశి ఫలితాలు.. యోగదాయకమైన కాలం.. 28న ఆ పరిహారం చేస్తే తిరుగుండదు!
