HomeAndhra PradeshPerni Nani: చంద్రబాబు ఏనాడూ సచివాలయం గుమ్మం తొక్కలేదు: పేర్ని నాని

Perni Nani: చంద్రబాబు ఏనాడూ సచివాలయం గుమ్మం తొక్కలేదు: పేర్ని నాని

Perni Nani: చంద్రబాబు ఏనాడూ సచివాలయం గుమ్మం తొక్కలేదని మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. ఏపీలో పెన్షన్ల పంపిణీ నేటి నుంచి జరుగుతున్న సంగతి తెలిసిందే. వాలంటీర్ల సేవలకు ఈసీ బ్రేక్ వేసిన నేపథ్యంలో.. సచివాలయ వ్యవస్థ ద్వారా సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లను పంపిణీ చేస్తోంది జగన్ సర్కార్. పెన్షన్ల పంపిణీని అడ్డుకున్నది చంద్రబాబేనని, నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఈసీకి ఫిర్యాదు చేయించిన ఫలితమే అవ్వాతాతల కష్టాలకు కారణమని వైయస్సార్ సీపీ ఆరోపిస్తోంది. తాడేపల్లి వైయస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ పేర్ని నాని ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే..

’’ఒకటో తేదీనే పెన్షన్లు ఇచ్చిన ఘన చరిత్ర సీఎం జగన్‌ది. చంద్రబాబు దొంగ నాటకాలు ఆడుతున్నారు. చంద్రబాబుకు పేదలపై ప్రేమ ఇప్పుడొచ్చిందా ? రైతు రుణమాఫీ చేస్తామని మీరు అప్పుడు ఎగ్గొట్టారు. 2019 ఎన్నికల సమయంలో రైతుకు జన్మభూమి కమిటీ ద్వారా డబ్బులు పంచుతున్నా మేం అడ్డుకోలేదు. జన్మభూమి కమిటీల ద్వారా టీడీపీ కార్యకర్తలకు పంచుకున్నారు.

పసుపు – కుంకుమ పేరుతో డబ్బులు వేసినా ఆపాలని మేం ఈసీకి ఫిర్యాదు చేయలేదు. ఈసీ దగ్గర పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయాలని ఇప్పుడు చెబుతున్నారు. నిన్నటిదాకా ఏం మాట్లాడారు ? .. ఇప్పుడేమంటారు ? మేం ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఇన్నాళ్లు ఆరోపించారు. లక్షా 60 వేల మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారని మీరు ఇప్పుడు చెబుతున్నారు.

మరి ఈ సచివాలయ ఉద్యోగులంతా ఎక్కడి నుంచి వచ్చారు ? ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్న పాపపు నోళ్లతోనే లక్షా 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పాల్సి వచ్చింది. జగన్ సీఎం అయ్యాక 2 లక్షల మందికి పైగా ఉద్యోగాలిచ్చారు. జగన్ ప్రభుత్వంలోనే యువతకు లంచాలు లేకుండా ఉద్యోగాలు వచ్చాయి. చంద్రబాబు సిగ్గు లేకుండా జగన్ ప్రభుత్వం పై నిందలు వేస్తున్నారు. ఐదేళ్ల పరిపాలన చూసి ఓటేస్తారా లేక చివరి 2 నెలలు పెన్షన్లు ఎవరిచ్చారో చూసి ఓటేస్తారా ?

చంద్రబాబు కూడా రూ.40 వేల కోట్లు ఇచ్చారు. మరి అప్పుడు జనం ఎందుకు ఓటేయలేదు ? పసుపు – కుంకుమ, రైతు నేస్తం అంటూ చంద్రబాబు ఎర వేసినా జనం నమ్మలేదు. పెన్షన్లు ఆపాలన్న దౌర్భాగ్యపు ఆలోచన ఎవరికి వచ్చింది ? ముసలివారి ఉసురు మీకు తగలదా ? వాలంటీర్లు ఇంటికెళ్లి పెన్షన్ ఇస్తే మాకు ఓటేస్తారా ? 50 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే నీకు ఇంటికెళ్లి పెన్షన్ ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా ?

58 నెలలు ఇంటికి వెళ్లి పెన్షన్లు అందించాం. 2 నెలలు పెన్షన్లు ఆపినంత మాత్రాన లబ్దిదారులకు జగన్ పై ప్రేమ తగ్గిపోతుందా ? వాలంటీర్ల వ్యవస్థ పై విషం కక్కారు. వాలంటీర్ల వ్యవస్థ దుర్మార్గమైనదైతే ప్రజలే మమ్మల్ని ఓడిస్తారు కదా ? నిన్నటిదాకా మీరు మాట్లాడిన ప్రతిమాటా విషపు మాటే.’’ అని పేర్ని నాని వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి: Perni Nani: వాలంటీర్ల సేవల నిలిపివేతకు కుట్ర చేసింది బాబే: పేర్ని నాని
Perni Nani Comments: మోదీజీ.. వెనుక నుంచి చంద్రబాబు రాకుండా చూసుకోండి: పేర్ని నాని
CM Jagan Bharosa: పెరాలసిస్‌ బాధితుడికి సీఎం జగన్ కొండంత భరోసా

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు