TDP in Rajyasabha: రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతయ్యింది. ఇప్పటి వరకు ఉన్న సభ్యుల గడువు తీరిపోయింది. రాజ్యసభలో పూర్తిగా టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా వైయస్సార్ సీపీ అవతరించింది. బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ తర్వాత స్థానం వైయస్సార్ సీపీదే కావడం విశేషం. .
రాజ్యసభ సీట్లలో వైయస్సార్ సీపీ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో 11 రాజ్యసభ స్థానాలనూ అధికార పార్టీ గెలుచుకుంది. ఏపీ నుంచి రాజ్యసభలో వైయస్సార్ సీపీకి సంపూర్ణ ప్రాతినిధ్యం లభించింది. రేపు రాజ్యసభ సభ్యులుగా వైవీ సుబ్బారెడ్డి, గొల్లబాబూరావు, మేడా రఘునాధ్ రెడ్డి ప్రమాణం చేయనున్నారు.
ఇవీ చదవండి: YSRCP Rajyasabha: రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్లు దాఖలు చేసిన YSRCP అభ్యర్థులు
YSRCP Rajyasabha Candidates: వైయస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులుగా గొల్లబాబూరావు, మేడా రఘునాథరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి
AP BJP News: ఏపీ బీజేపీలో టీడీపీ ముద్ర.. కేండేట్ల ఎంపికలో అన్యాయంపై కేంద్ర పెద్దలకు ఫిర్యాదుల వెల్లువ!
