YS Jagan in Kadiri: శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణం జగన్నామ స్మరణతో మార్మోగింది. వైయస్సార్ సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర కదిరి పట్టణానికి చేరుకుంది. పట్టణంలోని వీధుల్లో సీఎం జగన్ రోడ్డు షో నిర్వహించగా వేలాది మంది తరలి వచ్చారు. చీకటిపడ్డా కూడా జననేత కోసం ఎదురు చూశారు. సెల్ ఫోన్ వెలుగులు చూపుతూ సీఎం జగన్‌కు జనం మద్దతు పలికారు.
కదిరిలో జనమే జగన్.. జగనే జనం అన్నట్లు కనిపించింది. సాయంత్రం 5.45 గంటలకు కదిరిలోకి ముఖ్యమంత్రి వైయస్.జగన్ బస్సుయాత్ర ప్రవేశించింది. కదిరి పట్టణమంతా జన సునామీని తలపించింది. మేమంతా సిద్దమంటూ బస్సుయాత్రలో ముఖ్యమంత్రితో పాటు కదిరిలో జనప్రభంజనం కదం తొక్కింది.
దారిపొడవునా ముఖ్యమంత్రి జగన్ బస్సుతో పాటు కడలితరంగాల్లా జనం కదిలి వచ్చారు. గజమాలతో ముఖ్యమంత్రి జగన్‌కు ఆత్మీయ స్వాగతం లభించింది. బస్సు మీద నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ ముందుకు సాగారు. సెల్‌ఫోన్‌లో టార్చ్ వెలిగిస్తూ సీఎం జగన్ బస్సుయాత్రకు ప్రజలు సంఘీభావం తెలిపారు. రాత్రి 7.55 గంటల వరకు సుమారు రెండున్నర గంటల పాటు కదిరిలో రోడ్‌షోలో జనంలోనే ముఖ్యమంత్రి జగన్ ఉన్నారు.
మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా కదిరికి చేరుకోగానే ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో వైయస్సార్‌సీపీ తరఫున గెలిచిన ఆయన.. ఆ తర్వాత టీడీపీలోకి జంప్ అయ్యారు. ఆయనకు ఇస్తానన్న మంత్రి పదవి, నగదు ఇతర సదుపాయాలు కల్పించకుండా చంద్రబాబు మొండిచేయి చూపారు. ఇప్పుడు టీడీపీలో టికెట్ కూడా దక్కలేదు. దీంతో చేసేది లేక రాజకీయ జీవితం ముగింపు పలకలేక చాంద్ బాషా వైయస్సార్ సీపీ గూటికి చేరారు. మరోవైపు కదిరిలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.
6వ రోజు షెడ్యూల్ ఇదీ..
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ రేపు ఉదయం 9 గంటలకు చీకటిమనిపల్లె రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరుతారు. ములకలచెరువు, పెదపాలెం మీదగా వేపురికోట, బుర్రకాయలకోట క్రాస్, గొల్లపల్లి, అంగళ్లు చేరుకుంటారు. అంగళ్లు దాటిన తరువాత భోజన విరామం తీసుకుంటారు. అనంతరం సాయంత్రం 3.30 గంటలకి మదనపల్లె చేరుకుని టిప్పు సుల్తాన్ గ్రౌండ్ దగ్గర బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం నిమ్మనపల్లి క్రాస్, బోయకొండ క్రాస్, చౌడేపల్లి, సోమల మీదుగా అమ్మగారిపల్లె శివారులో రాత్రి బస చేస్తారు.
ఇవీ చదవండి: Bus Yatra: వైయస్ జగన్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం.. రెండు రోజుల షెడ్యూల్ ఇదీ..
PM Modi at Chilakaluripeta: ప్రధాని మోదీ సుతిమెత్తని విమర్శలు.. ఏపీలో జగన్ పార్టీ, కాంగ్రెస్ వేర్వేరు కాదని కామెంట్స్
YS Jagan vs All: పిక్చర్ క్లియర్.. ఒక్క జగన్ వర్సెస్ టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్..!
YS Jagan vs All: పిక్చర్ క్లియర్.. ఒక్క జగన్ వర్సెస్ టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్..!
