Realme 12+ 5G: రియల్ మీ సిరీస్‌లో 5జీ ఫోన్ మరో మోడల్ ఇండియా మార్కెట్‌లోకి వచ్చింది. నిన్న రియల్ మీ 12+ 5జీ ఫోన్ విడుదల చేశారు. Realme 12+ 5G మరియు Realme 12 5G ఫీచర్లతో ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ.. మిడ్-సెగ్మెంట్‌లో తన ఉనికిని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ఫీచర్ల విషయానికి వస్తే.. Realme 12+ 5G 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తోంది. గరిష్ట బ్రైట్‌నెస్ 1,200 నిట్స్. ఇది 67W ఛార్జర్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో వచ్చింది.
Realme 12+లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఆక్టా-కోర్ చిప్‌సెట్‌తో పాటు 8GB ర్యామ్, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా Realme UI 5.0పై పనిచేస్తుంది. Realme 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్ మరియు 2 సంవత్సరాల OS అప్‌డేట్‌ని ఇస్తోంది.
Realme 12+ 5G సెగ్మెంట్ మొదటి 50MP Sony LYT-600 ప్రధాన కెమెరాను OISతో పాటు 8MP అల్ట్రావైడ్ లెన్స్, 2MP పోర్ట్రెయిట్ సెన్సార్‌తో అందించింది. ఇందులో 16MP ఫ్రంట్ కెమెరా అందుబాటులోకి తెచ్చారు.
Realme 12 5G 120Hz రిఫ్రెష్ రేటు, 950 nits గరిష్ట బ్రైట్‌నెస్‌తో 6.72 అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది కూడా 5,000mAh బ్యాటరీతో వస్తుంది. అయితే 45W ఛార్జర్ తో వస్తుంది.
Realme 12 MediaTek డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్, గరిష్టంగా 8GB RAM మరియు 128GB స్పేస్. OS మరియు అప్‌డేట్‌లు 12+ 5G మాదిరే ఉంటాయి.
ఆప్టిక్స్‌లో, Realme 12 5G 108MP మెయిన్ లెన్స్, 2MP పోర్ట్రెయిట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఇది 8MP ఫ్రంట్ కెమెరాతో వస్తోంది.
Realme 12+ 5G పయనీర్ గ్రీన్, నావిగేటర్ బీజ్ షేడ్స్, రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది: 8GB/128GB, ధర ₹20,999 మరియు 8GB/256GB ధర ₹21,999.
Realme 12 5G ట్విలైట్ పర్పుల్, ఉడ్‌ల్యాండ్ గ్రీన్ రంగులు, రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది: 6GB/128 GB ధర ₹16,999 మరియు 8GB/128GB ధర ₹17,999. Realme పోర్టల్, ఫ్లిప్‌కార్ట్, మెయిన్‌లైన్ ఛానెల్‌లలో మొదటి సేల్ ప్రారంభమైంది.
ఇవీ చదవండి: Mobile Phone: స్మార్ట్ ఫోన్ వినియోగదారులు సగటున రోజుకు 80 సార్లు చెక్ చేస్తున్నారట!!
Phone beside Bed: బెడ్ పక్కన ఫోన్ పెట్టుకుని పడుకుంటే ఎన్ని అనర్థాలో తెలుసా?
Phone Charging: మీ ఫోన్‌లో చార్జింగ్ త్వరగా అయిపోతోందా? హ్యాకింగ్ బారిన పడుతున్నారా?
Phone Hacking: ఫోన్ హ్యాకింగ్‌కు గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి.. తప్పక తెలుసుకోండి
Phone Pay: ఫోన్ పే వాడుతున్నారా? ఈ గుడ్ న్యూస్ తెలుసా? యాక్టివేట్ చేసుకోండిలా!
