MS Dhoni Six: అతి త్వరలో ఐపీఎల్ మ్యాచుల సందడి మనం చూడబోతున్నాం. క్రీడాకారులందరూ ఐపీఎల్‌కు సన్నద్ధమవుతున్నారు. క్రికెట్ స్టేడియంలలో ప్రాక్టీస్ చేస్తున్నారు. అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న క్రికెట్ సందడి మొదలు కానుండటంతో అందరిలోనూ ఉత్కంఠ పెరిగింది.
ఈనెల 22వ తేదీన తొలి మ్యాచ్ చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. అయితే, సీనియర్ క్రికెటర్ ఎంఎస్ ధోని (MS Dhoni Six) చెన్నై స్టేడియంలో ప్రాక్టీస్‌లో భాగంగా విరుచుకుపడ్డాడు. భారీ సిక్సర్లు బాదుతూ ఓ రేంజ్‌లో ప్రిపేర్ అవుతున్నాడు.
సింహం ఐపీఎల్‌కు సిద్ధమవుతోందంటూ అభిమానులు కేరింతలు పెడుతున్నారు. ఇవాళ ప్రాక్టీస్‌లో భాగంగా ధోని సిక్సర్లు బాదిన తీరును కొందరు అభిమానులు వీడియో తీసుకున్నారు. అవి కాస్తా సోషల్ మీడియాలో వదలడంతో వైరల్‌గా మారాయి. తలా అభిమానులు వాటిని చూస్తూ మురిసిపోతున్నారు. సింహం మళ్లీ కప్పు గెలవడానికి వస్తోందంటూ హోరెత్తిస్తున్నారు.
చెపాక్‌లో ధోని సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. తనదైన స్టైల్‌లో భారీ షాట్లతో ధోని విరుచుకుపడుతున్న వీడియోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. స్పిన్నర్, ఫాస్ట్ బౌలర్లనే తేడా లేకుండా ధోని భారీ సిక్స్‌లు కొడుతూ తన ఫాం ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సీఎస్‌కే సోషల్ మీడియాలో సైతం పంచుకుంది.
ధోని సిక్సర్ల వీడియోలు చూసిన అభిమానులు తలైవా ఈజ్ బ్యాక్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సీజన్‌లో బౌలర్లకు చుక్కలే అంటూ చెబుతున్నారు. ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు 5 సార్లు ఐపీఎల్ టైటిల్స్ గెలుచుకుంది. 2010, 2011, 2018, 2021,203 లో మిస్టర్ కూల్ సీఎస్కేకి కప్‌లను అందించాడు.
వీడియో ఈ లింక్‌లోకి వెళ్లి చూసేయండి..
https://x.com/TeluguMSDians/status/1768897269263384681?s=20
ఇవీ చదవండి: MS Dhoni Jersey: ధోనికి బీసీసీఐ గౌరవం.. నంబర్ 7 జెర్సీకి వీడ్కోలు
MS Dhoni Cutout: నందిగామలో 77 అడుగుల ధోని కటౌట్.. మహేంద్రుడి బర్త్‌డే స్పెషల్
MS Dhoni Kohli Remuneration: ధోనీ, విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకొనే ఆటగాడు ఎవరో తెలుసా?
