AP Polling Centers: ఏపీలో పోలింగ్ కేంద్రాలు, పరిస్థితిని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలోని 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుందన్నారు. రాష్ట్రంలో 29 ఎస్సీ, 7 ఎస్టీ రిజర్వ్ డ్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయని తెలిపారు. ఏపీలో 4 ఎస్సీ, ఒక ఎస్టీ రిజర్వ్ డ్ లోక్ సభ స్థానాలు ఉన్నాయని తెలిపారు. AP Polling Centers
* రాష్ట్రంలో మొత్తం 4.07 కోట్ల ఓటర్లు
* రాష్ట్రంలో 2 కోట్లమంది పురుష ఓటర్లు
* రాష్ట్రంలో 2.07 కోట్ల మంది మహిళా ఓటర్లు
* రాష్ట్రంలో 3,482 మంది థర్డ్ జెండర్ ఓటర్లు
* రాష్ట్రంలో 67,434 మంది సర్వీస్ ఓటర్లు
* రాష్ట్రంలో 7,603 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు
* రాష్ట్రంలో మొత్తం 46,165 పోలింగ్ కేంద్రాలు
* రాష్ట్రంలో 179 మహిళలతో నిర్వహించే పోలింగ్ స్టేషన్లు
* రాష్ట్రంలో 50 యువతతో నిర్వహించే పోలింగ్ స్టేషన్లు
* రాష్ట్రంలో మొత్తం 555 ఆదర్శ పోలింగ్ కేంద్రాలు
* దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్
* రాష్ట్రంలో మే 13న అసెంబ్లీ ఎన్నికలు
* రాష్ట్రంలో జూన్ 4న ఓట్ల లెక్కింపు
* రాష్ట్రంలో ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్
* రాష్ట్రంలో ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు
* రాష్ట్రంలో ఏప్రిల్ 26న నామినేషన్లు పరిశీలన
* రాష్ట్రంలో ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణ గడువు
* మే 13న ఒకేరోజు ఏపీలో అసెంబ్లీ, తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు
* దరఖాస్తు చేసిన వారందరికీ ఓటరు కార్డులు పంపిణీ చేస్తాం
* ఓటరు కార్డు లేకుంటే 12 గుర్తింపు కార్డులను చూపించవచ్చు
* ప్రతి పోలింగ్ కేంద్రంలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం
* రాష్ట్రంలో మొత్తం 46 వేల పోలింగ్ కేంద్రాలు
* 85 ఏళ్లు దాటిన వారికి ఇంటివద్దే ఓటు వేసే అవకాశం ఉంది
* క్రిమినల్ కేసులు ఉన్నవారు పేపర్, టీవీల్లో ప్రకటనలు ఇవ్వాలి
* క్రిమినల్ కేసులు ఉంటే ఆయా పార్టీల వెబ్ సైట్ లో వివరాలు ఉంచాలి
* సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో భద్రత పెంచుతాం
* ఎన్నికల్లో 4 లక్షల మంది ఉద్యోగులను వినియోగిస్తున్నాం
* ఈవీఎంలు, వీవీప్యాట్ లను ఇప్పటికే పరీక్ష చేశాం
* ఇప్పటి వరకు రూ.164 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం
ఇవీ చదవండి: CEC Press Meet: జూన్ 16తో ముగియనున్న లోక్‌సభ గడువు.. ఈలోగానే ఎన్నికల ప్రక్రియ పూర్తి: ఈసీ
AP Elections: ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవీ..
General Elections India: దేశవ్యాప్తంగా మోగిన ఎన్నికల నగారా.. ఏపీలో మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్
Addanki: అద్దంకిలో ఆదరించేది ఎవరిని? గెలుపు లెక్కలేంటి? హోరాహోరీ తప్పదా?
