HomeLife StyleFoods: క్యాన్సర్‌ ముప్పు నుంచి ఇలా బయట పడండి.. క్యాన్సర్‌ను దూరం చేసే ఆహారాలు ఇవీ..

Foods: క్యాన్సర్‌ ముప్పు నుంచి ఇలా బయట పడండి.. క్యాన్సర్‌ను దూరం చేసే ఆహారాలు ఇవీ..

Foods: మనం తీసుకొనే కొన్ని రకాల ఆహారాలతో క్యాన్సర్‌ ప్రమాదం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇలాంటి ముప్పు మనకు తెలియకుండానే జరుగుతుంటుంది. అయితే, ఎలాంటి ఆహారాలు తీసుకుంటే క్యాన్సర్‌ ప్రమాదం వస్తుంది? ఎలాంటి ఫుడ్స్‌ తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ ప్రమాదం దూరవమతుందనే విషయాలపై అందరూ అవగాహన పెంచుకోవాలి. ప్రత్యేకించి క్యాన్సర్‌ ముప్పు నుంచి బయట పడాలంటే, రాకుండా నివారించాలంటే కొన్ని రకాల ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

క్యాన్సర్‌ ముప్పును తగ్గించే ఆహారాలు

1. క్యాన్సర్‌ ముప్పును దీటుగా ఎదుర్కోవాలంటే ప్రత్యేకంగా కొన్ని రకాల ఆహారాలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

2. క్యాన్సర్ ప్రమాదాన్ని అణచివేయడంలో, తగ్గించడంలో సాయపడే కూరగాయలను తప్పకుండా నిత్యం వంటల్లో భాగం చేసుకోవాలి.

3. ఇవి అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఆరోగ్యకరమైన కణాల పెరుగుదలను ఎంకరేజ్‌ చేస్తాయి.

4. బ్రకొలీ అనేవి సల్ఫోరాఫేన్‌తో కూడిన క్రూసిఫెరస్ కూరగాయలుగా చెబుతారు. అత్యంత శక్తిమంతమైన యాంటీ క్యాన్సర్ లక్షణాలను ఇవి కలిగి ఉంటాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.

5. సల్ఫోరాఫేన్ రొమ్ము క్యాన్సర్ కణాల పరిమాణాన్ని 75 శాతం వరకు అణచివేస్తుందని అనేక అధ్యయనాల్లోనూ తేలిన మాట వాస్తవం.

6. కూరగాయల్లో కెరొటీనాయిడ్స్, విటమిన్ సీ, గ్లూకోసినోలెట్స్, ఫోలేట్, డైటరీ ఫైబర్, ఫ్లేవనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభ్యమవుతాయి. ఇవన్నీ వాస్కులర్ వ్యాధులను తగ్గించడంలో సాయపడతాయి.

7. టమాటాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో లైకోపీన్‌ పదార్థం ఉంటుంది. అందుకే దానికి ఎరుపు రంగు వస్తుంది. యాంటీ క్యాన్సర్ లక్షణాలు టమాటాల్లో అధికంగా ఉంటాయి.

8. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం అధికంగా ఉంటుంది. క్యాన్సర్ కణాలను నాశనం చేసే శక్తి వీటికి ఉంటుందని ఇటీవలి కాలంలో పలు అధ్యయనాల్లో కూడా వెల్లడైంది.

9. ఫైబర్, ప్రోటీన్లతో కూడిన బీన్స్ కూడా కోలోరెక్టల్ క్యాన్సర్ నుంచి మనల్ని కాపాడుతుందని అధ్యయనాలు స్పష్టీకరిస్తున్నాయి.

10. బచ్చలి కూర వంటి ఆకుకూరల్లో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్, లుటిన్, విటమిన్ సీ లభ్యమవుతాయి. ఇది క్యాన్సర్ కణాలని అభివృద్ధి చేయకుండా రక్షణగా నిలుస్తుంది.

ఇవీ చదవండి: Eye health: కంటి ఆరోగ్యానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..
Kakara Kaya: చేదైన ఆహారం.. పోషక గుణాల్లో తియ్యదనం.. కాకర కాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవీ..
Cluster Beans: గోరుచిక్కుడుతో అద్భుత ప్రయోజనాలు.. కండరాల ఎదుగుదలకు చక్కటి ఆహారం
Cashew: జీడిపప్పు ఆహారంలో భాగం చేస్తున్నారా? ఆరోగ్యం మీ సొంతం.. జీడిపప్పు వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవీ..
Best Veg Food: శాకాహారంలో బెస్ట్‌ ఫుడ్‌ ఐటమ్స్‌ ఏవి? మంచి ప్రోటీన్స్‌ కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు