HomeNationalCEC Press Meet: జూన్ 16తో ముగియనున్న లోక్‌సభ గడువు.. ఈలోగానే ఎన్నికల ప్రక్రియ పూర్తి:...

CEC Press Meet: జూన్ 16తో ముగియనున్న లోక్‌సభ గడువు.. ఈలోగానే ఎన్నికల ప్రక్రియ పూర్తి: ఈసీ

CEC Press Meet: లోక్ సభ గడువు జూన్ 16వ తేదీతో ముగుస్తోందని, ఈలోగానే ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పూర్తి చేస్తామని ఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఎన్నికల నిర్వహణ పై అన్ని రాష్ట్రాల్లో సమీక్షలు నిర్వహించామని వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వివరాలు వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియలో కోటి 50 లక్షల మంది సిబ్బంది పాల్గొంటారన్నారు. కశ్మీర్ లో కూడా ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. దేశ వ్యాప్తంగా 55 లక్షల ఈవీఎం లను ఉపయోగిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా 97 కోట్ల ఓటర్లు ఉన్నారని ఈసీ వెల్లడించారు.

* 10 లక్షల 50 వేల పోలింగ్ కేంద్రాలు
* కోటి 82 లక్షల మంది కొత్త ఓటర్లు
* మహిళ ఓటర్ల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది
* పురుషుల కంటే మహిళ ఓటర్ల సంఖ్య 1.89 శాతం అధికం

* పురుష ఓటర్ల కంటే 12 రాష్ట్రాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు
* పురుష ఓటర్లు 49.7 కోట్లు, మహిళా ఓటర్లు 47.1 కోట్లు
* ట్రాన్స్ జెండర్ ఓటర్లు 48 వేలు ,దివ్యాంగ ఓటర్లు 88.4 లక్షలు
* యువ ఓటర్లే మాకు బ్రాండ్ అంబాసిడర్లు సీఈసీ రాజీవ్ కుమార్

* 85 ఏళ్లు దాటిన వారి ఓట్ ఫ్రమ్ హోమ్
* ఈడీ సహకారంతో అన్ని రాష్ట్రాల్లో నిఘా పెంచాం
* హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
* ఎన్నికల సందర్భంగా ప్రలోభాలకు గురిచేసే వారిపై ప్రత్యేక నిఘా

* ప్రతి వెయ్యి మంది పురుషులకు 948 మంది మహిళా ఓటర్లు
* 18- 19 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లు 21 లక్షల మంది
* వందేళ్లు దాటిన ఓటర్లు 2 లక్షల 18 వేల మంది
* టీవీ, సోషల్ మీడియా ప్రకటనలపై నిరంతర పర్యవేక్షణ

* కానుకలు, ప్రలోభాలను అడ్డుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు
* బ్యాంక్ లావాదేవీలపై ప్రత్యేక నిఘా
* ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్
* ఈసీకి వచ్చే ఫిర్యాదులపై వేగంగా విచారణ : సీఈసీ రాజీవ్ కుమార్

ఇవీ చదవండి:AP Elections: ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవీ..
General Elections India: దేశవ్యాప్తంగా మోగిన ఎన్నికల నగారా.. ఏపీలో మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్
YSRCP Candidates Final List: సామాజిక న్యాయం చేతల్లో చేసి చూపించాం: ముఖ్యమంత్రి జగన్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు