Muscle Health Food: గజిబిజి జీవన శైలి కారణంగా ప్రస్తుతం చాలా మంది సరైన సమయానికి సరైన ఆహారం తీసుకోలేకపోతున్నారు. సమయానికి తినడం ఒక ఎత్తయితే, శరీరానికి ముఖ్యంగా ఎముకలకు బలాన్నిచ్చే ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. ఎముకల పటిష్టత కోసం ప్రత్యేకించి కొన్ని రకాల ఆహారం తీసుకుంటే లేటు వయసులోనూ ఎముకలు పటిష్టంగా ఉంటాయని పేర్కొంటున్నారు. Muscle Health Food
ఎముకలు దృఢంగా ఉంటేనే మనిషి వయసు మీద పడినా చలాకీగా ఉండగలుగుతాడు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఇంట్లో ఉండే వారికి త్వరగా ఎముకలు అరిగిపోతుంటాయి. ఇలాంటి నేపథ్యంలో ఎముకల బలానికి కొన్ని రకాల సూప్స్, ఆహారాలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎముకల పటుత్వం కోసం తినాల్సిన ఆహారాలపై ముఖ్యమైన బ్రీఫ్ పాయింట్స్ ఈ కథనంలో తెలుసుకుందాం.
ఎముకల బలానికి తినాల్సిన ఆహారాలు
1. మన బాడీ నిర్మాణానికి ఎముకలు అత్యంత కీలకమైనవి. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత అందరిపై ఉంది.
2. ఎముకలు బలంగా ఉండాలి అంటే కాల్షియం తీసుకోవాలి. ముఖ్యంగా మహిళలకు ఎముకల ఆరోగ్యం కీలకమైనది. ముఖ్యమైనది.
3. వయసు పైబడిన వారు తమ ఎముకలను ఆరోగ్యంగా, బలంగా ఉంచుకోవడానికి రోజుకి కనీసం 1,000 మిల్లీ గ్రాముల కాల్షియం తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
4. మన శరీరంలోకి కాల్షియం శోషణకు మెగ్నీషియం, విటమిన్ ఏ, డీ వంటి ఇతర పోషకాలు కూడా కావాల్సి వస్తాయి.
5. రోజూ 6 క్యారెట్లు, 50 గ్రాముల బచ్చలికూర వేసుకుని జ్యూస్ చేసుకుని తాగితే ఎముకలకు బలం వస్తుంది.
6. ఇది సుమారు 300 మిల్లీగ్రాముల కాల్షియంను మన శరీరానికి వచ్చేలా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు దీని ద్వారా పుష్కలంగా దొరుకుతాయి.
7. రాజ్మా, కాబూలీ చనా, బ్లాక్ దాల్, కులీట్ వంటి పప్పుల ద్వారా కూడా కాల్షియంను మన శరీరానికి అందేలా చేయొచ్చు.
8. రోజూ 2-3 టేబుల్ స్పూన్ల తెల్ల లేదా నల్ల నువ్వులు తినాలి. దీని ద్వారా కూడా కాల్షియం కావాల్సినంత దొరుకుతుంది.
9. బచ్చలికూర, కాలే, బ్రకోలి వంటి ఆకుపచ్చని ఆకు కూరల్లో ఫైబర్, విటమిన్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఎముకలకు బలం చేకూరుతుంది.
10. సిట్రస్ పండ్లు తీసుకోవడం వల్ల మజిల్ హెల్త్ మెరుగవుతుంది. పటుత్వం చేకూరుతుంది. బెర్రీలు, నారింజ, ద్రాక్షలో విటమిన్ సీ దొరుకుతుంది కాబట్టి వాటిని అప్పుడప్పుడూ తీసుకుంటూ ఉండాలి.
ఇవీ చదవండి: Muscles Health: ఎముకల బలానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
Bone Density: ఈ ఆహారాలు తింటే మీ ఎముకలు బలంగా తయారవుతాయి..
Daily Egg: రోజుకో గుడ్డు.. ఆరోగ్యానికి వెరీ గుడ్డు.. ఉడికించిన గుడ్డులో పోషకాలెన్నో తెలుసా?
Blood facts: మనిషి ఒకసారి ఎంత రక్తదానం చేయాలి? స్త్రీ, పురుషుల్లో ఎంత రక్తం ఉండాలి?
