HomeTelanganaMLC Kavitha: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌.. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కీలక పరిణామం

MLC Kavitha: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌.. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కీలక పరిణామం

MLC Kavitha: మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కుమార్తె, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ-ED) అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇవాళ సాయంత్రం కవితను ఈడీ అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కవిత నివాసంలో జాయింట్‌ డైరెక్టర్‌ నేతృత్వంలోని ఎనిమిది మంది అధికారులు తనిఖీలు చేశారు.

అనంతరం ఆమెను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. అరెస్టుపై 14 పేజీల మెమోను ఈడీ వెలువరించింది. ఎమ్మెల్సీ కవితతో (MLC Kavitha) పాటు ఆమె భర్త అనిల్‌కు కూడా సమాచారం ఇచ్చామని, మనీలాండరింగ్‌ చట్టం సెక్షన్‌ 3 కింద ఆమె నేరానికి పాల్పడ్డారని ఈడీ తెలిపింది. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు కవితను తరలిస్తుండగా పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు చేరుకున్నారు. వారికి అభివాదం చేసుకుంటూ కవిత ఈడీ అధికారుల వెంట వెళ్లారు. ఏ ప్రాతిపదికన అరెస్టు చేస్తారంటూ కవిత ప్రశ్నించారు. ఇలాంటి అణచివేతలు తమకు కొత్తేం కాదని, న్యాయపరంగా పోరాటం చేస్తామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలంతా ధైర్యంగా ఉండాలని చెప్పారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కవితను తీసుకెళ్లిన ఈడీ అధికారులు

మరోవైపు ఈడీ అధికారులతో వాగ్వాదం చేసినందుకు మాజీ మంత్రి కేటీఆర్‌పై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేటీఆర్‌పై బంజారాహిల్స్ పీఎస్‌లో ఈడీ అధికారి భానుప్రియ ఫిర్యాదు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత అరెస్టు సమయంలో తమ విధులకు ఆటంకం కలిగించారని కేటీఆర్‌పై ఈడీ అధికారి ఫిర్యాదు చేశారు.కవితకు అండగా నిలిచేందుకు మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీ బయల్దేరి వెళ్లారు.

మరోవైపు అరెస్ట్ ప్రొసీజర్ కు సంబంధించి ఈడీ అధికారులు పంచనామా తయారు చేశారు. మధ్యాహ్నం 1:45 నుంచి సా.6:40 వరకు సెర్చ్ చేసినట్టు ఈడీ అధికారులు పేర్కొన్నారు. సా. 5:20కి కవితను అరెస్ట్ చేసినట్లు పంచనామాలో తెలిపారు. PMLA యాక్ట్ సెక్షన్ 19 కింద అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సా.6 గంటలకు 20 మంది అనుమతి లేకుండా లోపలికి వచ్చారని పేర్కొన్నారు. అనుమతి లేకుండా లోపలికి వచ్చి గొడవపడ్డారని, లాఠీఛార్జ్ మధ్య కవిత అరెస్ట్ జరిగినట్లు ఈడీ పేర్కొంది. కవితను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసి పోలీసులు రూట్ క్లియర్ చేశారు.

ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా ఈడీ ఆఫీస్ కు కవిత చేరుకున్నారు. రాత్రికి ఈడీ కార్యాలయంలోనే కవిత ఉంటారు. రేపు ఉదయం కవితకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. మరోవైపు రేపు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. అప్రజాస్వామిక చర్యలకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళనలు చేపడుతుందని, దుర్మార్గపు చర్యలను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటామంటూ బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ఇక ఢిల్లీ ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించారు. భద్రత కట్టుదిట్టం చేశారు. ఎవరైనా 144 సెక్షన్ ఉల్లంగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

నేరం చేయనప్పుడు కవితకు భయమెందుకంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈడీ విచారణకు కవిత సహకరించాలని సూచించారు. ఇన్నాళ్లు కవిత తప్పించుకు తిరిగారని, అందుకే ఈడీ ఆమె ఇంటికి వెళ్లిందంటూ కిషన్ రెడ్డి కామెంట్ చేశారు.

కవిత అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం: హరీష్ రావు

కేసులు, అరెస్టులు మాకు కొత్తేమీ కాదంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు తెలిపారు. కవిత అక్రమ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. కవిత అరెస్ట్ రాజకీయ కుట్రలో భాగమేనని కామెంట్‌ చేశారు. రేపు నోటిఫికేషన్ ఉండగా ఇవాళ అరెస్ట్ కుట్రపూరితంగానే జరిగిందని ఆరోపించారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యగా హరీష్ రావు అభివర్ణించారు.

ఇవీ చదవండి: Penamaluru TDP: పెనమలూరు టీడీపీలో భగభగలు.. బయటివారికి టికెట్‌ ఇస్తే నేను చేతగానివాడినా?: బోడె ప్రసాద్‌
Revanth Reddy on YS Jagan: జగన్‌కు మైలేజీ పెంచుతున్న రేవంత్‌రెడ్డి.. ఏపీ ప్రాజెక్టులకు నీరు తరలిస్తున్నారంటూ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు