HomeAndhra PradeshLaw University Kurnool: నేషనల్ లా యూనివర్సిటీకి శంకుస్థాపన.. న్యాయ రాజధానికి మరో మకుటం!

Law University Kurnool: నేషనల్ లా యూనివర్సిటీకి శంకుస్థాపన.. న్యాయ రాజధానికి మరో మకుటం!

Law University Kurnool: న్యాయ రాజధాని కర్నూలు నగరానికి మరో మకుటం రాబోతోంది. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి సీఎం జగన్‌, న్యాయమూర్తులు పలువురు నిన్న శంకుస్థాపన చేశారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురం సమీపంలోని జగన్నాథగట్టు వద్ద 150 ఎకరాల విస్తీర్ణంలో రూ.1011 కోట్ల వ్యయంతో నేషనల్‌ లా యూనివర్సిటీని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడారు. Law University Kurnool

సీఎం జగన్ ఏమన్నారంటే..

* ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ హైకోర్టు రెస్టింగ్ న్యాయమూర్తులకు, ఇతర కోర్టుల న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, న్యాయ విభాగం సిబ్బందికి, ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు.
* ఈరోజు మన రాష్ట్రంలో, మన రాయలసీమలో, అందులోనూ కర్నూలులో నేషనల్ లా యూనివర్సిటీకి మనం శంకుస్థాపన చేస్తున్నాం.

* ఈ కార్యక్రమం ఎంత భవిష్యత్ ఉన్న కార్యక్రమం, ఈ ప్రాంతానికి, మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి అంటే.. మన ముఖ్య ఉద్దేశం ఎప్పుడూ కూడా డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ అనేది మనం మొదటి నుంచి కూడా చెబుతున్న ముఖ్య ఉద్దేశం.
* ఇందులో భాగంగా శ్రీబాగ్ ఒడంబడిక నుంచి రాయలసీమ ప్రాంతాలకు 1937లో 87 సంవత్సరాల కిందట కుదిరిన ఆ శ్రీబాగ్ ఒప్పందంలో భాగంగా ఈ ప్రాంత ప్రజలకు సహేతుకమైన న్యాయం జరిగేట్టుగా అప్పటి నుంచి ఈ ప్రాంతంలో ప్రజలు కూడా ఎప్పటి నుంచో దీని కోసం వేచి చూస్తున్నారు.

* ఇక్కడే హైకోర్టు పెడతామని ఆరోజుల్లోనే శ్రీబాగ్ ఒడంబడికలో భాగంగా జరిగిన ఆ ఒప్పందం మేరకు ఇక్కడకు రావాలి, హైదరాబాద్ ను రాజధానిగా చేస్తూ, అప్పటి దాకా రాజధానిగా ఉన్న కర్నూలును ఆ స్టేటస్ పోతున్న కారణంగా ఇక్కడ హైకోర్టు పెడతాము అని ఆరోజు చెప్పిన మాటకు అడుగులు ముందుకు పడే కార్యక్రమాలు జరుగుతున్నాయి.

* ఇందులో భాగంగానే ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేస్తున్న నేషనల్ లా యూనివర్సిటీ. ఈ నేషనల్ లా యూనివర్సిటీ అన్నది ఇక్కడ రావడం, ఈ నేషనల్ లా యూనివర్సిటీ రాబోయే రోజుల్లో ఒక మంచి హైకోర్టు భవనాన్ని కూడా ఇక్కడే హౌస్ చేయగలిగిన కెపాసిటీతో ఉన్న వ్యవస్థ కూడా అవుతుంది.
* ఈ కార్యక్రమం అడుగులు వేగంగా ముందుకు పడాలని, దీని కోసం రూ.1000 కోట్లు మంజూరు చేయడం జరుగుతోంది.

* ఇక్కడ ఇదే యూనివర్సిటీతోపాటు న్యాయ విభాగాలైన స్టేట్ కన్జ్యూమర్స్ డిస్ప్యూట్ అండ్ రిడ్రసల్ కమిషన్‌ను, ఏపీ లీగల్ మెట్రాలజీ కమిషన్‌ను, ఏపీ లేబర్ కమిషన్‌ను, ఏపీ వ్యాట్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను, ఏపీ వక్ఫ్ బోర్డును, ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త కార్యాలయాలను, అదేరకంగా ఎన్‌హెచ్‌ఆర్సీ కార్యాలయాలు కూడా ఇదే మన కర్నూలులో ఏర్పాటు కానున్నాయని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నా.

* దాదాపు 150 ఎకరాల సువిశాలమైన ఈ స్థలంలో ఇవన్నీ కూడా రాబోతున్న మంచి ఘడియలను దేవుడు ఆశీర్వదించి ఈ కార్యక్రమం జరిగిస్తున్నాడని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను.
* దీని వల్ల ఈ ప్రాంతానికి మరింత మంచి జరగాలని రాబోయే రోజుల్లో అని ఆకాంక్షిస్తున్నా. అని సీఎం జగన్‌ తెలిపారు.

ఇవీ చదవండి: Congress Guarantees: మహిళా న్యాయ గ్యారంటీ కింద కాంగ్రెస్‌ 5 హామీలు
Pithapuram: పిఠాపురంలో మంటపెట్టిన పవన్‌ కల్యాణ్‌ ప్రకటన.. వర్మ వర్గం అగ్గిమీద గుగ్గిలం..!
Penamaluru TDP: పెనమలూరు టీడీపీలో భగభగలు.. బయటివారికి టికెట్‌ ఇస్తే నేను చేతగానివాడినా?: బోడె ప్రసాద్‌
CM Jagan Ready to Elections: ఎన్నికల సమరానికి సీఎం జగన్‌ సిద్ధం.. 18 నుంచి ప్రచార సమర భేరి!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు