HomeAndhra PradeshPithapuram: పిఠాపురంలో మంటపెట్టిన పవన్‌ కల్యాణ్‌ ప్రకటన.. వర్మ వర్గం అగ్గిమీద గుగ్గిలం..!

Pithapuram: పిఠాపురంలో మంటపెట్టిన పవన్‌ కల్యాణ్‌ ప్రకటన.. వర్మ వర్గం అగ్గిమీద గుగ్గిలం..!

Pithapuram: ఎట్టకేలకు పవన్‌ కల్యాణ్‌ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠకు తెరపడింది. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉంటానని ఇవాళ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక స్థానాల నుంచి ఆయన పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని పవన్‌ స్పష్టం చేశారు. దీనిపై కూటమి పెద్దలతో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.

ఇక పవన్‌ ప్రకటనతో పిఠాపురంలో ఇప్పటికే స్ట్రాంగ్‌గా ఉన్న వర్మ వర్గం భగ్గుమంది. పవన్‌, టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌లపై వర్మ వర్గీయులు తీవ్ర నిరసన తెలిపారు. తనకు అన్యాయం జరిగిందంటూ వర్మ సైతం తీవ్ర ఆవేదన వెళ్లగక్కారు. రేపు కార్యకర్తల సమావేశంలో విజయవాడలో పాల్గొని తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానన్నారు.

వర్మ వర్గీయులు పలువురు రోడ్లపైకొచ్చి నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్‌ ఉన్న జెండాలు, స్టిక్కర్లు పీకేశారు. పార్టీ జెండాలు, పాంప్లేట్లు, కుర్చీలు తగులబెట్టారు. పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పిఠాపురంలో పరిస్థితిని గమనించిన చంద్రబాబు.. టీడీపీ కో ఆర్డినేటర్ వర్మకు ఫోన్ చేశారు. పిఠాపురంలో జరిగిన పరిణామాలపై చంద్రబాబు ఆరా తీశారు. క్రమశిక్షణ ఉన్న కార్యకర్తలు ఎవరూ అలా చేయరని వర్మ దగ్గర ప్రస్తావించినట్లు తెలుస్తోంది. కార్యకర్తలు మీటింగ్ పెట్టుకున్నారని, ఆ సమావేశానికి వెళ్లి వస్తానని చంద్రబాబుతో వర్మ చెప్పినట్లు సమాచారం.

రెండో జాబితాలో టీడీపీ సీనియర్లకు చంద్రబాబు మొండిచేయి..

మొదటి జాబితాలో పలువరు సీనియర్ల పేర్లు రాకపోయేసరికి రెండో జాబితాలో వస్తాయని చాలా మంది ఆశతో ఎదురు చూశారు. ఇవాళ రెండో లిస్టు ప్రకటించిన టీడీపీ.. మరోసారి సీనియర్లకు మొండిచేయి చూపింది. రెండో లిస్టులో కూడా సీనియర్లకు టికెట్‌ దక్కలేదు. ఎచ్చెర్ల టికెట్ ఆశిస్తున్న మాజీమంత్రి సీనియర్ నేత కళా వెంకట్రావుకు నిరాశే మిగిలింది.

పెందుర్తి టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణదీ అదే పరిస్థితి. మైలవరం టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమా పేరు కూడా ఇందులో లేదు. సర్వేపల్లి టికెట్ ఆశిస్తున్న మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు కూడా లేకపోవడం గమనార్హం. 34 మంది లిస్టులో తమ పేర్లు లేకపోవడంతో టీడీపీ సీనియర్‌ నేతలు పలువురు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.

ఇవీ చదవండి:Penamaluru TDP: పెనమలూరు టీడీపీలో భగభగలు.. బయటివారికి టికెట్‌ నేను చేతగానివాడినా?: బోడె ప్రసాద్‌
Tadikonda: తాడికొండలో గెలిచేదెవరు? నిలిచేదెవరు? తెనాలి శ్రావణ్‌ కుమార్‌ వర్సెస్‌ మేకతోటి సుచరిత
Penamaluru: పెనమలూరులో గెలిచేది ఆ పార్టీ అభ్యర్థేనా? సామాజిక సమీకరణాల్లో పైచేయి ఎవరిది?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు