HomeAndhra PradeshPenamaluru TDP: పెనమలూరు టీడీపీలో భగభగలు.. బయటివారికి టికెట్‌ ఇస్తే నేను చేతగానివాడినా?: బోడె ప్రసాద్‌

Penamaluru TDP: పెనమలూరు టీడీపీలో భగభగలు.. బయటివారికి టికెట్‌ ఇస్తే నేను చేతగానివాడినా?: బోడె ప్రసాద్‌

Penamaluru TDP: పెనమలూరు టీడీపీ టికెట్‌ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు ఇవ్వలేమని పార్టీ అధిష్టానం స్పష్టం చేయడంతో పార్టీలో లుకలుకలు బహిర్గతమయ్యాయి. ముందు నుంచి ఓటమిపాలైనా ప్రజల్లో తిరుగుతూ తాను పార్టీని ఓ స్థాయికి తీసుకొచ్చానని బోడె ప్రసాద్‌ వాపోయారు. ఏడాదికి రూ.కోటి చొప్పున ఖర్చు చేసుకున్నానని, తాను ఏ తప్పూ చేయలేదని చెప్పారు. Penamaluru TDP

ప్రజలు ఏం కోరుకుంటున్నారో పార్టీకి తెలుసని బోడె ప్రసాద్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు ఏం చెబితే అది చేశానన్నారు. ఎవరో ఇక్కడికి వచ్చి పోటీ చేస్తానంటే ఒప్పుకునేది లేదని కుండబద్ధలు కొట్టారు. నాలుగున్నరేళ్లుగా ప్రజల్లోనే తిరిగానన్నారు. కరోనా సమయంలో కూడా ఖాళీగా లేకుండా పనిచేశానన్నారు. 175 నియోజకవర్గాల్లో కేవలం నాకే అన్యాయం జరిగిందని వాపోయారు.

పార్టీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశానని, సొంత డబ్బుతో పార్టీ కార్యక్రమాలు జరిపించానని బోడె గుర్తు చేశారు. చంద్రబాబు, లోకేష్ ను ద్వేషించడం లేదని, న్యాయం చేస్తారని నమ్మకంతో ఉన్నానన్నారు. చంద్రబాబు ఫొటో పట్టుకుని ఎన్నికలకు వెళ్తానని కుండబద్ధలు కొట్టారు. సర్వేలన్నీ తనకే అనుకూలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. చంద్రబాబు అపాయింట్‌మెంట్ కోసం ట్రై చేస్తున్నానన్నారు. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, సర్వేలను కాదని ఓడిపోయే అభ్యర్థిని తీసుకొస్తున్నారంటూ మండిపడ్డారు.

ప్రజలనే న్యాయం కోరతానని, తనకు ఎవరూ గాడ్ ఫాదర్‌లు లేరని బోడె ప్రసాద్‌ వాపోయారు. పోరాటం చేసి ఈ స్థాయికి వచ్చానంటూ బోడె ప్రసాద్‌ తెలిపారు. పార్టీని గెలిపించుకోవడానికి రాజీలేని పోరాటం చేస్తానన్నారు. తాను ఏ నియోజకవర్గానికీ వెళ్లనని, సొంత నియోజకవర్గంలోనే ఉంటానన్నారు.

ఎవరో వచ్చి ఇక్కడ పోటీ చేస్తానంటే తాను చేతకానివాడినా? అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ బహిష్కరించినా చంద్రబాబు ఫొటోతోనే తిరుగుతానంటూ బోడె ప్రసాద్‌ తెలిపారు. టీడీపీ రెండో లిస్టులోనూ చాలా మంది సీనియర్లు, పార్టీని నమ్ముకున్న వారికి అధిష్టానం మొండిచేయి చూపింది.

ఇవీ చదవండి: No Re poll: జీరో వయలెన్స్‌, నో రీపోల్.. ఇవే వచ్చే ఎన్నికల్లో ప్రధాన అంశాలు..
Summer care: వేసవిలో ఈ ఫ్రూట్స్‌ తీసుకుంటున్నారా? తప్పక చెక్‌ చేసుకోండి!
TDP MP Candidates: టీడీపీ ఎంపీ అభ్యర్థులుగా వైసీపీ సిట్టింగ్‌ ఎంపీలు! తుది దశకు చేరిన కసరత్తు!
Penamaluru: పెనమలూరులో గెలిచేది ఆ పార్టీ అభ్యర్థేనా? సామాజిక సమీకరణాల్లో పైచేయి ఎవరిది?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు