HomeAndhra PradeshYS Jagan Rapthadu: జరుగుతున్న మంచి కొనసాగాలంటే మళ్లీ జగన్‌నే గెలిపించుకుందామని చెప్పండి..

YS Jagan Rapthadu: జరుగుతున్న మంచి కొనసాగాలంటే మళ్లీ జగన్‌నే గెలిపించుకుందామని చెప్పండి..

YS Jagan Rapthadu: ప్రతి అవ్వా, ప్రతి తాతా, వికలాంగ సోదరుడు, అక్కచెల్లెమ్మ బయటకొచ్చి వంద మందికి చెప్పి జరుగుతున్న మంచి కొనసాగాలంటే కేవలం మీ అన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే జరుగుతుందని ప్రతి ఇంటికీ చెప్పాల్సిన అవసరం ఉంది… అని సీఎం జగన్‌ అన్నారు. రాప్తాడు సిద్ధం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. YS Jagan Rapthadu

* మీ జగన్‌, వైయస్సార్‌సీపీ పేరు చెబితే ఈరోజు గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ విస్తరించిన ఆరోగ్యశ్రీ కనిపిస్తుంది. 104, 108 వాహనాలు కొత్తగా కనిపిస్తాయి. ఆరోగ్య ఆసరా, విలేజ్‌ క్లినిక్‌,ఫ్యామిలీ డాక్టర్‌, ఆరోగ్య సురక్షతో జల్లెడ పడుతూ ఎవరికి బాగోలేకపోయినా మందులు ఇంటికి ఇచ్చిపోయే గొప్ప వ్యవస్థ కనిపిస్తుంది.

* కోవిడ్‌ కష్టకాలంలో కూడా అందించిన సేవలు గుర్తుకొస్తాయి.
* పేదలు వైద్యం కోసం అప్పులపాలు కాకూడదన్నా, గడపగడపకూ వైద్యం అందించే పరిస్థితి కొనసాగాలన్నా, ఇంతకు మించిన మంచి ఆ కుటుంబాలకు జరగాలన్నా మనందరి ప్రభుత్వానికి ఆ పేదలను అండగా దండగా నిలబడాలని, వారే స్టార్‌ క్యాంపెయినర్లుగా మారాలని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.

* 2019లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలోని ఏ గ్రామమైనా ఆ గ్రామానికి వెళ్లి అక్కడ నిల్చుంటే ఓ విలేజ్‌ సెక్రటేరియట్‌ కనిపిస్తుంది. 10 మంది శాశ్వత ఉద్యోగాలు చేస్తున్న మన పిల్లలు కనిపిస్తారు.

* నాలుగడుగులు ముందుకేస్తే ఆర్బీకే కనిపిస్తుంది. మరో నాలుగు అడుగులు వేస్తే విలేజ్‌ క్లినిక్, కడుతున్న డిజిటల్‌ లైబ్రరీలు కనిపిస్తాయి. నాడునేడుతో రూపు మారిన బడులు, హాస్పిటల్స్‌ కనిపిస్తాయి. ప్రతి 50-60 ఇళ్లకు చేయి పట్టుకొని నడిపించే ఓ మంచి వాలంటీర్‌ వ్యవస్థ ఒక్క రూపాయి కూడా లంచం అడగకుండా వివక్ష చూపకుండా మంచి చేస్తున్న వ్యవస్థ కనిపిస్తుంది.

* ఇవన్నీ కూడా ఎప్పుడు జరిగాయి అంటే.. అది ఈ 57 నెలల్లో మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే జరిగాయి అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాల్సిన అవసరం ఉంది.

* ఈరోజు వివక్ష లేకుండా, లంచం లేకుండా మీ బిడ్డ, మీ అన్న అక్షరాలా 125 సార్లు బటన్‌ నొక్కాడు. ఏకంగా 2.55 లక్షల కోట్లు పంపిన మాట వాస్తవం కాదా అని ప్రతి అక్కను, చెల్లెమ్మను అడగండి.

* కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామంలో ఆగినా, ఏ సామాజికవర్గాన్ని చూసినా 14 సంవత్సరాలు సీఎంగా చేసిన చంద్రబాబు మార్క్‌, అభివృద్ధి ఎక్కడా కనిపించదు. ప్రతి ఇంట్లోనూ, గ్రామంలోనూ కనిపించేది మీ జగన్‌ మార్క్‌, వైయస్సార్‌ సీపీ మార్క్‌ అభివృద్ధి.

* ప్రజలు మనకు ఫస్ట్‌ టైమ్‌ ఆశీర్వదిస్తేనే దేవుడి దయతో ఇంత మంచిచేయగలిగాం. ఇక ప్రజలు సెకండ్‌ టైమ్‌, థర్డ్‌ టైమ్‌, ఫోర్త్‌ టైమ్‌ ఆశీర్వదిస్తే ఇక ఎంత మంచి జరుగుతుందని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.

read also: Siddham Rapthadu: ఫ్యాన్‌ ఎప్పుడూ ఇంట్లో.. సైకిల్‌ బయటే.. తాగేసిన టీ గ్లాస్‌ సింక్‌లోనే ఉండాలి

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు