HomeAndhra PradeshSiddham Rapthadu: ఫ్యాన్‌ ఎప్పుడూ ఇంట్లో.. సైకిల్‌ బయటే.. తాగేసిన టీ గ్లాస్‌ సింక్‌లోనే ఉండాలి

Siddham Rapthadu: ఫ్యాన్‌ ఎప్పుడూ ఇంట్లో.. సైకిల్‌ బయటే.. తాగేసిన టీ గ్లాస్‌ సింక్‌లోనే ఉండాలి

Siddham Rapthadu: అవ్వాతాతల చిరునవ్వుల మధ్య వాళ్లందరికీ ఓ మాట చెప్పండి.. ఫ్యాన్‌ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి. సైకిల్‌ ఎప్పుడూ బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాసు ఎప్పుడూ సింక్‌లోనే ఉండాలి. అక్కచెల్లెమ్మలకు మీరంతా ప్రతి ఒక్కరూ అర్థమయ్యేలా చెప్పండి.. అని సీఎం జగన్‌ అన్నారు. రాప్తాడు సిద్ధం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. Siddham Rapthadu

* మన పార్టీ పేరు చెబితే మీ జగన్‌ పేరు చెబితే గవర్నమెంట్‌ బడులకు వెళ్లే పిల్లలకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఇంగ్లీషు మీడియం, విద్యాకానుక, గోరుముద్ద, బాగుపడుతున్న స్కూళ్లు, మొదటిసారి వారి పుస్తకాలకు బైజూస్‌ కంటెంట్‌ అనుసంధానం, టెక్స్ట్‌ బుక్కుల్లో బైలింగ్వల్‌ టెక్స్‌ట్‌ బుక్స్, ట్యాబులు, క్లాసు రూముల్లో 6వ తరగతి పైబడిన క్లాసు రూముల్లో డిజిటల్‌ బోధనతో ఐఎఫ్‌పీ ప్యానల్స్‌తో కనిపిస్తున్నాయి.

* మొదటిసారి సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్ట్‌, టోఫెల్‌ సైతం బోధన చేయడం జరుగుతోంది.
* సీబీఎస్‌ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం సాగుతోంది.

* పెద్ద చదువులు చదువుతున్న వారికి ఏ క్వార్టర్‌లో ఉన్న ఫీజులు ఆ క్వార్టర్‌ అయిపోయిన వెంటనే పూర్తి ఫీజు రీయింబర్ష్‌మెంట్ వేస్తూ విద్యా దీవెన, వసతి దీవెన, జాబ్‌ ఓరియెంటెడ్‌గా కరిక్యులమ్‌లో మార్పులు, ఆన్లైన్‌ వర్టికల్స్‌ చదువులతో అనుసంధానం.. ఇవన్నీ కూడా ఆ పిల్లలకు ఆ తల్లిదండ్రులకు వాళ్ల ఇంటికి వెళ్లిప్పుడు అడగండి. ఇంతకు ముందుకు ఇప్పటికి తేడా ఎంతలా ఉందో గమనించాలని అడగండి.

* తల్లిదండ్రులు, పిల్లల్ని ఇవన్నీ కొనసాగాలంటే ఆ పిల్లలు అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడాలంటే, పెత్తందార్లతో పోటీ పడే పరిస్థితి జరగాలంటే అది చేయగలిగింది కేవలం మీ అన్న ముఖ్యమంత్రి అయితేనే జరుగుతుందని చెప్పండి.

* ఒకటో తరగతిలో ఉన్న పేదింటి పాప, పేదింటి బాబు.. మరో 10-15 సంవత్సరాల్లో అంతర్జాతీయ చదువులతో, పెత్తందార్ల పిల్లలకన్నా మించిపోయి ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడుతూ పేద పిల్లలకు వేరే దేశాల్లో గొప్ప ఉద్యోగాలు రావాలంటే ఇటువంటి విప్లవాత్మక మార్పులు కొనసాగాలంటే కేవలం మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుందని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.

* ఫ్యాన్‌ గుర్తుకు ఓటేయడమంటే వారి పిల్లల్ని ఇంటర్నేషనల్‌ స్థాయిలో నిలబెట్టే ప్రభుత్వానికి ఓటేయడం, సైకిల్‌కు ఓటేయడం అంటే గవర్నమెంట్‌ బడుల్లో ఇంగ్లీషు మీడియం రద్దుకు ఓటేస్తున్నాం అని గుర్తుపెట్టుకోవాలని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.
* ఇవన్నీ కొనసాగాలంటే స్టార్‌ క్యాంపెయినర్లుగా మారి మరో వంద మందికి చెప్పి ఫ్యాన్‌ గుర్తుకు ఓటేయాలని చెప్పండి.

* జగన్‌ పేరు చెబితే, వైయస్సార్‌ సీపీ పేరు చెబితే అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులకు మా జగన్‌, మా పెన్షన్‌ అందరికీ ఇచ్చాడు, వెయ్యి నుంచి రూ.3 వేలు చేశాడు, వాలంటీర్‌ ద్వారా ఆదివారమైనా సెలవైనా ఒకటో తేదీ సూర్యోదయానికి కంటే ముందే చిక్కటి చిరునవ్వుతో మా చేతిలో పెడుతున్నాడు, ఇది కేవలం మీ జగన్‌ ఉంటేనే కొనసాగుతుందని చెప్పండి.

* పెన్షన్‌ కొనసాగాలన్నా, భవిష్యత్‌లో పెరగాలన్నా, కొందరికే మళ్లీ పెన్షన్లు ఇచ్చే రోజులు రాకూడదన్నా, లంచాల జన్మభూమి కమిటీలు కాటేయకూడదన్నా, ఇంటికొచ్చిపోయే వాలంటీర్‌ వ్యవస్థ కొనసాగాలన్నా వైయస్సార్‌సీపీ ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం మాత్రమే ఆ పని చేయగలదని, ఫ్యాన్‌ గుర్తుకు ఓటేస్తేనే ఇవన్నీ జరుగుతాయని ఇంటింటికీ వెళ్లి చెప్పాల్సిన అవసరం ఉంది.

read also: Anantapur Siddham Sabha: రైతన్నకు భరోసా ఇచ్చింది ఎవరంటే మీ జగన్‌.. మన వైయస్సార్‌ సీపీ మాత్రమే!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు