HomeAndhra PradeshJagan Siddam: మీ జగన్‌ 57 నెలల పరిపాలనలో 2.13 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు..

Jagan Siddam: మీ జగన్‌ 57 నెలల పరిపాలనలో 2.13 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు..

Jagan Siddam: మీ జగన్‌ 57 నెలల పరిపాలనలో 2.13 లక్షల ఉద్యోగాలిచ్చాడని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తెలిపారు. రాప్తాడు సిద్ధం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఏకంగా రూ.2.55 లక్షల కోట్లు.. నేరుగా మీ జగన్‌ బటన్‌ నొక్కుతున్నాడు.. నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పోతున్నాయన్నారు. ఇందులో 75 శాతం నానానా అని పిలుచుకొని నా వర్గాలకే ఇచ్చాను అని చెప్పుకొనేదానికి సంతోషపడుతున్నానన్నారు. Jagan Siddam

* ప్రతి అడుగులోనూ ముఖ్యమంత్రిగా నేనుంటూ అణగారిన వర్గాల మీద నేను చూపిస్తున్న ప్రేమ.. ప్రతి మాటకూ ముందు నా.. నా.. నా.. అంటూ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా నిరుపేద వర్గాలంటూ గుండెల నిండా ఆప్యాయతతో చరిత్రలో చూడని విధంగా నామినేషన్‌ పనులు, కాంట్రాక్టుల్లో 50 శాతం చట్టం చేసి మరీ ఇస్తున్నది ఎవరంటే మీ జగన్‌ అని చెప్పి ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.

* నిరుద్యోగులకు ఈ 57 నెలల్లో.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలుంటే ఈ 57 నెలల పాలనలోనే ఏకంగా 2 లక్షల 13 వేల ఉద్యోగాలు ఇచ్చాడని చెప్పండి.

* ఆ ఉద్యోగాల్లో 80 శాతం నేను నానానా అని పిలుచుకొనే నా ఎస్సీలు, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలు, నా నిరుపేద వర్గాలకు వచ్చాయంటే అది జరిగింది, ఇంతటి సామాజిక న్యాయం కనిపిస్తున్నంది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని చెప్పండి.

* దాదాపు 35 లక్షల ఎకరాల మీద సర్వ హక్కులు అనుభవదారులకు, గిరిజనులకు, రైతన్నలకు, నిరుపేదలకు ఇచ్చినది ఎవరంటే మీ జగన్‌.
* అందులో అత్యధికం పేద సామాజికవర్గాలకు చెందినవే అని తెలిసి వారికి మేలు చేసింది ఎవరంటే మీ జగన్‌. ఇచ్చింది ఎవరంటే మన వైయస్సార్‌సీపీ పార్టీ.

* ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎన్నికైన పదవుల నుంచి మంత్రిమండలి వరకు, డిప్యూటీ సీఎంలు, రాజ్యసభ, శాసనసభాపతి వరకు, మండలి చైర్మన్, వైస్‌ చైర్మన్‌ పదవులు ఇచ్చింది ఎవరంటే మీ జగన్‌. వచ్చింది ఎప్పుడంటే మన వైయస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.

* మనందరి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అండగా ఈ వర్గాలన్నీ కదిలి రావాలని, స్టార్‌ క్యాంపెయినర్లుగా నిలవాలని, బాబుకు ఓటేయడం అంటే సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఓటేయడం అని, డీబీటీకి వ్యతిరేకంగా ఓటు వేయడం అని ప్రతి ఒక్కరికీ ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాల్సిన అవసరం ఉంది.

* గతంలో చంద్రబాబు పాలన చూశారు. ఇంకా చాలా మంది పాలన చూశారు. చాలా రాష్ట్రాల్లో చూస్తున్నారు. ఎవరైనా మేనిఫెస్టోను మన మాదిరిగా, ఒక బైబిల్‌గా, ఒక ఖురాన్‌గా, భగవద్గీతగా భావించి 99 శాతం అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తున్నది మీ జగన్‌. ఒక్క వైయస్సార్‌ సీపీ మాత్రమే ఆ చిత్తశుద్ధి చూపిస్తోంది.

* ఫస్ట్‌ చాన్స్‌ ఇస్తేనే మీ జగన్‌ ఇంత గొప్పగా అన్ని వర్గాలనూ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నాడు. మరి మూడుసార్లు సీఎంగా, 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేయలేకపోయాడని ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికీ వెళ్లి అడగండి.

* అయ్యా బాబూ.. ప్రజలు నీకు ఎందుకు ఓటు వేయాలి?జగన్‌ మార్క్‌ ప్రతి గ్రామంలో కనిపిస్తున్నప్పుడు, ప్రతి పేద ఇంట్లో, ప్రతి సామాజికవర్గంలో, ప్రతి ప్రాంతంలో కనిపిస్తున్నప్పుడు ఎందుకు బాబుకు ఓటు వేయాలని అడుగుతున్నా.

read also: Siddham Rapthadu: ఫ్యాన్‌ ఎప్పుడూ ఇంట్లో.. సైకిల్‌ బయటే.. తాగేసిన టీ గ్లాస్‌ సింక్‌లోనే ఉండాలి

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు