HomeAndhra PradeshSiddam Sabha: జగన్‌కు ప్రజాబలం లేదని నమ్మితే పొత్తులెందుకు బాబూ...? సీఎం జగన్‌ సూటి ప్రశ్న

Siddam Sabha: జగన్‌కు ప్రజాబలం లేదని నమ్మితే పొత్తులెందుకు బాబూ…? సీఎం జగన్‌ సూటి ప్రశ్న

Siddam Sabha: జగన్‌ తన పాలనలో ప్రజలకు మంచి చేయలేదని చెప్పి చంద్రబాబు నిజంగా నమ్మితే, జగన్‌కు ప్రజాబలం లేదని చంద్రబాబు నమ్మితే మరి చంద్రబాబుకు పొత్తులెందుకు? అని సీఎం జగన్‌ ప్రశ్నించారు. రాప్తాడు సిద్ధం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నిజంగా నువ్వు జగన్‌ మంచి చేయలేదని అనుకుంటే మేనిఫెస్టోలో చెప్పినవి చెయ్యలేదని అనుకుంటే, ప్రజా బలం లేదనుకుంటే ఇంత మందితో ఇన్ని పొత్తులు ఎందుకయ్యా చంద్రబాబూ అని జగన్‌ ప్రశ్నించారు. Siddam Sabha:

* తన నడక కోసం అటో కర్రా, ఇటో కర్ర ఎందుకయ్యా చంద్రబాబూ?
* తన సైకిల్‌ తోయడానికి నీకొక ప్యాకేజీ స్టార్‌ ఎందుకయ్యా?

* మీకు కూడా తెలుసు.. జగన్‌ ప్రతి ఇంటికీ మంచి చేశాడు కాబట్టి, వైయస్సార్‌సీపీ చేసిన మంచి ప్రతి ఇంట్లోనూ బతికి ఉందని తెలుసు.
* ప్రతి గ్రామానికి, ప్రతి సామాజికవర్గానికి, ప్రతి పేదవాడూ జగన్‌ను, వైయస్సార్‌సీపీని గుండెల్లో పెట్టుకున్నాడు కాబట్టే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

*125సార్లు ఈ 57 నెలల్లో బటన్లు ప్రజల కోసం నేను నొక్కాను. ఏకంగా 2.55 లక్షల కోట్లు నేరుగా బటన్లు నొక్కి నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు వెళ్లింది.

* ఇంత మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి మద్దతుగా ఈ పాలనకు కొనసాగింపుగా ప్రతి కుటుంబం ప్రతి ఒక్కరూ మంచి భవిష్యత్‌ కోసం రెండు బటన్లు నొక్కాలని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు.
* ఫ్యాన్‌ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్‌ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద శాశ్వతంగా ఉండదు.

* పొరపాటు చేశారంటే చంద్రముఖి మళ్లీ సైకిలెక్కుతుంది. టీ గ్లాస్‌ పట్టుకొని మీ ఇంటికొస్తుంది. పేదల రక్తం తాగేందుకు లకలకా అంటూ మీ ఇంటి తలుపులు తడుతుందని ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ చెప్పండి.

* మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని, మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా, మీరే సైనికులుగా నిలబడండి అని ప్రతి ఇంటికీ వెళ్లి నిబద్ధతతో మనం సిద్ధం అంటుంటే, మరోవంక బాబు పేదల ఇంటికిగానీ, పేదల సామాజికవర్గాలకు గానీ, గ్రామాలకుగానీ, రాష్ట్రానికి గానీ ఏం చేశాడో చెప్పుకొనేందుకు ఒక్కటీ కనిపించని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నాడు.

* అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు తానూ పోస్టర్లు వేయిస్తాడు. సంసిద్ధం, మేమూ సిద్ధం అని వేయిస్తాడు. ప్రజలకు మంచి చేయకుండా దేనికయ్యా సంసిద్ధం? ఎందుకు సంసిద్ధం? ఎవరితో యుద్ధం?

* పెత్తందార్ల తరఫున చంద్రబాబు సంసిద్ధం అంటున్నాడంటే ఎవరితోనయ్యా నువ్వు యుద్ధం చేస్తున్నావు?
* దుష్ట చతుష్టయం బాణాలకు బలి కావడానికి, తలవంచడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు. ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు కృష్ణుడి రూపంలో ఉన్న ఇంత మంది.. ఇన్ని లక్షల గుండెలు, కోట్ల గుండెలు ప్రతి పేదవాడి ఇంట్లో తోడుగా ఉండే గుండెలు.
* ప్రజలే అండగా ప్రజలతోనే పొత్తుగా పోరాటానికి మీ బిడ్డ సిద్ధం. మరి మిమ్మల్ని అడుగుతున్నా. మీరంతా సిద్ధమేనా?

read also : Jagan Siddam: మీ జగన్‌ 57 నెలల పరిపాలనలో 2.13 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు