Anantapur Siddham Sabha: రైతులకు అండగా నిలిచింది మీ జగన్.. వైయస్సార్ సీపీ పార్టీ మాత్రమేనని సీఎం జగన్ అన్నారు. రాప్తాడు సిద్ధం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మనకు, మన వైయస్సార్‌సీపీకి, ప్రజలు 2019లో ఒక్కసారి అధికారం ఇస్తేనే రైతులకు అదనంగా ఇంతకు ముందు చూడని విధంగా ఒక రైతన్నకు రైతు భరోసా తీసుకొచ్చి ఇచ్చామన్నారు. Anantapur Siddham Sabha
* గ్రామాల్లో రైతన్నకు చేయి పట్టుకొని నడిపించే ఆర్బీకే వ్యవస్థను తీసుకొచ్చి రైతన్నకు తోడుగా నిలిచాం.
* పగటిపూటే రైతన్నకు 9 గంటల ఉచిత విద్యుత్ తీసుకొచ్చాం.
* ఏ సీజన్‌లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే రైతన్నకు ఇన్‌పుట్‌సబ్సిడీ ఇవ్వటం మొదలు పెట్టింది మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాతే.
* ఉచిత పంటల బీమా ఇస్తున్నది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే.
* గతంలో ఏ రైతన్న చూడని విప్లవాత్మక మార్పులు ఇవీ.
* ఈ పథకాలన్నీ ప్రతి రైతన్నకూ కొనసాగాలన్నా, రైతుల్ని పీడించే బాబు మార్క్ దళారీ వ్యవస్థ మళ్లీ రాకూడదన్నా ప్రతి రైతన్న స్టార్ క్యాంపెయినర్లుగా ముందుకు వచ్చి ఇంకో వంద మందికి చెప్పాల్సిన అవసరం ఉంది.
* విందు భోజనం పెడతానని, బిర్యానీ పెడతానని మోసపూరిత ఆశ చూపించి చంద్రబాబు ఇప్పుడు మనం పెడుతున్న అన్నాన్ని, గిన్నెను లాక్కోవడానికి అడుగులు వేస్తున్నాడు.
* గతంలో ఇదే పెద్దమనిషి చంద్రబాబు బేషరతుగా చేస్తానన్న 87612 కోట్ల రుణ మాఫీని ఓ మోసంలా ఎలా మార్చాడో ప్రతి రైతన్నకూ గుర్తు చేయాల్సిన అవసరం మన ప్రతి కార్యకర్తకూ ఉంది.
* 2019లో సీఎం అయిన మీ జగన్ పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు గతంలో ఎప్పుడూ జరగని విధంగా అమ్మ ఒడి, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 31 లక్షల ఇళ్లపట్టాలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణం.. అక్కచెల్లెమ్మల ఫోన్లలో దిశ యాప్, మహిళా పోలీస్.. ఇవన్నీ గతంలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే జరుగుతున్నాయి.
* ఇవన్నీ ప్రతి ఒక్కచెల్లెమ్మలకు కొనసాగాలంటే మహిళా సాధికారత కోసం జగనన్న ప్రభుత్వానికి అండగా ఉండాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని, మరో వంద మందితో ఓటు వేయించాల్సిన బాధ్యత ఉందని చెప్పాల్సిన బాధ్యత ఇక్కడున్న ప్రతి ఒక్కరిపై ఉంది.
