HomeAndhra PradeshVolunteers Meeting: జన్మభూమి కమిటీలు, మన వాలంటీర్లు.. తేడా గమనించండి.. : సీఎం జగన్‌

Volunteers Meeting: జన్మభూమి కమిటీలు, మన వాలంటీర్లు.. తేడా గమనించండి.. : సీఎం జగన్‌

Volunteers Meeting: గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు, వారి పార్టీ కార్యకర్తలు, వారి పార్టీ అభిమానులు ఏం చేశారు, అందించారు అనేది చూడాలని, అలాగే మన వాలంటీర్లు ఏం చేశారన్నది గమనించాలని సీఎం జగన్‌ కోరారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వాలంటీర్లకు అభినందన సభ నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ.. 2019 జూన్ వరకు పరిస్థితి ఏమిటి? ప్రజలకు అందిస్తామన్న మార్పు చూస్తే ప్రతి సేవకూ, ప్రతి స్కీముకూ అప్పట్లో ప్రతి పేదవాడూ ఇచ్చుకోవాల్సింది లంచం. లంచం. లంచం. అని గుర్తు చేశారు. Volunteers Meeting

* ఏ సేవ కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ వారాల తరబడి, నెలల తరబడి తిరగాల్సిన దుస్థితి.
* మండల స్థాయి, జిల్లా స్థాయికి కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితి. జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తే తప్ప అడుగులు ముందుకు పడవు.
* పెన్షన్ తీసుకోవాలన్నా కదల్లేని స్థితిలో ఉన్న వికలాంగ సోదరులు, అక్కచెల్లెమ్మలు పెన్షన్ అందుకోవాలన్నా, ఎండనక, వాననక పెద్ద పెద్ద చాంతాడంత క్యూల్లో వెయిట్ చేయాల్సిన పరిస్థితి.

* జన్మభూమి కమిటీల దుర్మార్గం వల్ల అర్హులైన పెన్షన్ దరఖాస్తు కావాలన్నా లంచం, రేషన్ కార్డు కావాలన్నా లంచం, ఇంటి మంజూరు కావాలన్నా లంచం, సబ్సిడీ మీద ఇచ్చే లోను కావాలన్నా లంచం. అందరికీ ఇస్తారంటే అదీ లేదు. ఇచ్చేది అరకొర. అదీ వివక్షతో.
* చివరకు మరుగుదొడ్లు కావాలన్నా జన్మభూమి కమిటీల పాలన, చంద్రబాబు పరిపాలన ఎక్కడ చూసినా లంచం. లంచం. లంచం.

* జన్మభూమి కమిటీల నుంచి మొదలు పెడితే చంద్రబాబు నాయుడు దాకా ఇదే కార్యక్రమం.
* ఒకవైపున లంచం తీసుకోవడం, మరోవైపున కులం, మతం, వర్గం, పార్టీ అని ఇవన్నీ చూసుకొని మనుషులను విభజించి పాలించారు.
* కాబట్టే వారు అర్హులకు కూడా ఎగ్గొట్టిన పరిస్థితులు కనిపించాయి.
* పెన్షన్లే తీసుకోండి. మీ బిడ్డ ప్రభుత్వంలో మీ అన్న ప్రభుత్వంలో 66 లక్షల మందికి రూ.3 వేల పెన్షన్ ఇస్తున్నాం.

* ఆనాడు చంద్రబాబు పాలనలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారు. అది కూడా ఎన్నికలకు 2 నెలల ముందు కేవలం ముష్టి వేసినట్లు వెయ్యి మాత్రమే ఇచ్చేవారు.
* వారి వివక్ష వల్ల లక్షల మందికి పెన్షన్లు అందకుండా పోయాయి.

* బాబు పాలనలో స్కీములు లేవు. బటన్లు లేవు. మంచి చేయాలన్న తపన ఆ చంద్రబాబుకు అంతకన్నా లేదు. కాబట్టి లబ్ధిదారులందరినీ పారదర్శకంగా ఎంపిక చేయడానికి, వారికి మంచి పౌర సేవలు అందించడానికి గ్రామంలో సచివాలయ వ్యవస్థ, దానికి అనుసంధానంగా వాలంటీర్ వ్యవస్థ అవసరం అని ఏరోజూ దోచుకోవడానికి పంచుకోవడానికి అలవాటు పడ్డ టీడీపీ ఏనాడూ భావించలేదు.
* వాళ్లకు పేదవాడికి మంచి జరగాలి, భవిష్యత్ బాగుండాలి, పిల్లలు బాగుండాలి, చిక్కటి చిరునవ్వులు కనపడాలనే తపన, తాపత్రయం లేదు.

* చంద్రబాబు, ఆయన జన్మభూమి కమిటీలు ఓ గంజాయి మొక్క అయితే, మన సచివాలయాలు, అందుకు అనుసంధానమైన మన వాలంటీర్ వ్యవస్థ ఓ తులసి మొక్క.
* చంద్రబాబు పరిపాలన ఓ విష వృక్షమైతే, మన పరిపాలన ఓ కల్పవృక్షం.

* ఇంత గొప్ప కార్యక్రమంలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే ఇంత గొప్ప కార్యక్రమంలో నా వారిగా, నా తమ్ముళ్లుగా, నా చెల్లెమ్మలుగా, కేవలం గౌరవ వేతనం మాత్రమే తీసుకుంటూ మన ప్రభుత్వ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించిన మీ సేవా భావానికి, మీ అన్న సెల్యూట్ చేస్తున్నాడు.

*వాలంటీర్లను రాష్ట్ర వ్యాప్తంగా అభినందించే ఈ కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభిస్తున్నా.
* మరో వారం రోజులపాటు ప్రతి మండలంలో ఓ ఉత్సవ వేడుకగా మనందరి ప్రభుత్వం జరిపిస్తుంది.
* వరుసగా నాలుగో ఏడాది చేస్తున్న ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు ఇస్తున్న నగదు బహుమతిని 50 శాతం పెంచాం.

* ఎందుకీ బహుమతి మొత్తాన్ని పెంచామో అందరికీ తెలుసు.
* మీరంతా గత ప్రభుత్వ లంచాల వ్యవస్థను, బద్ధలు కొట్టి నిజాయితీని నిలబెట్టుకున్న మీ విధానాన్ని, నా విధానాన్ని ఎజెండాగా తీసుకొని అడుగులు వేస్తూ త్రికరణ శుద్ధితో ఎవరైనా 2019కి ముందు మన ప్రభుత్వం రాక ముందు లంచాలు లేని వ్యవస్థ సాధ్యమేనా అంటే లేదు.. సాధ్యమే అని చెప్పి చూపించినందుకు.. ఈ నాలుగేళ్లుగా చేసి చూపించినందుకు ఈ బహుమతి మొత్తాన్ని పెంచాం.

* సేవా వజ్రాలకు రూ.45 వేలు, సేవా రత్నాలకు 30 వేలు, సేవా మిత్రలకు రూ.15వేలు ఇస్తున్నాం.
* ప్రతి నియోజకవర్గం నుంచి 5గురు చొప్పున 875మంది వాలంటీర్లకు సేవా వజ్ర అవార్డులతో సత్కరిస్తున్నాం.
* ప్రతి మండలం, మున్సిపాలిటీ పరిధి నుంచి కనీసం 5 మంది, కార్పొరేషన్ పరిధి నుంచి 10 మంది చొప్పున 4150 మంది వాలంటీర్లకు సేవా రత్న అవార్డులతో గౌరవిస్తున్నాం.
* ఏడాదిగా సేవలందించిన 2,50,439 మంది నా వాలంటీర్ చెల్లెమ్మలకు, తమ్ముళ్లకు సేవా మిత్ర అవార్డులతో సన్మానిస్తున్నాం.

*వీరిని అభినందిస్తూ వారికి నగదు బహుమతిగా 392 కోట్లు నా తమ్ముళ్లు, చెల్లెమ్మలకు ఇవ్వడానికి మీ అన్న సంతోషపడుతున్నాడు.
* దేశ చరిత్రలో మరే రాష్ట్రంలో అయినా కూడా ఇలాంటి లంచాలు లేని వివక్ష లేని వ్యవస్థను ఎక్కడైనా మీరు చూశారా? ప్రతి ఇంట్లోనూ వెళ్లి అడగండి. ప్రతి అన్నదమ్ముడు, అక్కచెల్లెమ్మలు, రైతన్నకు చెప్పండి.
* ఇలా లంచం లేని వ్యవస్థను ప్రోత్సహించే వ్యవస్థలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా అని అడగండి.

* మీ అన్న నేరుగా బటన్ నొక్కడం, నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్లిపోవడం. లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఏకంగా ఈ 58 నెలల పాలనలో మీ అన్న ప్రభుత్వం అక్షరాలా ఇప్పటి దాకా రూ.2.55 లక్షల కోట్లు నేరుగా జమ చేయగలిగాం. ఇది ఒక విప్లవం కాదా?

* ఇక ఈ 2.55 లక్షల కోట్లకు నాన్ డీబీటీ పథకాలు.. ఇళ్ల పట్టాలు, సంపూర్ణ పోషణ, గోరుముద్ద, ట్యాబులు, విద్యాకానుక.. ఇలాంటి కార్యక్రమాల కోసం మరో 1.07 లక్షల కోట్లు ఇచ్చాం.
* ఇంటి స్థలాలకు సంబంధించి మార్కెట్ విలువ తీసుకుంటే ఇది 1.76 లక్షల కోట్లు అవుతుంది.
* ఇంత సొమ్ము పేదల చేతుల్లోకి నేరుగా ఈరోజు కనిపిస్తోంది.

* కోవిడ్ లాంటి సంక్షోభాలను కూడా ఎదుర్కోగలిగాం. కేంద్రం నుంచి తగ్గిన ఆదాయాలను తట్టకోగలిగాం.
* లంచాలు లేని వ్యవస్థను తీసుకురాగలిగాం కాబట్టే ఇది సాధ్యమైంది.
* అదే రాష్ట్రం, అదే బడ్జెట్ అప్పులు కూడా తెచ్చింది అప్పటి గ్రోత్ రేటు కన్నా మన ప్రభుత్వంలో తక్కువ.
* మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే.
* ఈరోజు ప్రజల చేతుల్లో ఇన్ని లక్షల కోట్లు కనిపిస్తున్నాయి. గతంలో కనిపించలేదంటే కారణం ఏంటన్నది ఆలోచన చేయాలి. ప్రతి ఇంటికీ వెళ్లి ఆలోచన చేయమని చెప్పాలి.

read also: Phirangipuram CM jagan: ప్రజలకు అలసిపోకుండా సేవ చేశాం.. నా వాలంటీర్ల సైన్యం అంటూ సీఎం జగన్‌ భావోద్వేగం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు