HomeAndhra PradeshYS Jagan fires on Chandrababu: ఇచ్చేది లేదు.. సచ్చేది లేదు.. చంద్రబాబుపై సీఎం జగన్‌...

YS Jagan fires on Chandrababu: ఇచ్చేది లేదు.. సచ్చేది లేదు.. చంద్రబాబుపై సీఎం జగన్‌ పంచ్‌లు..

YS Jagan fires on Chandrababu: చంద్రబాబు మేనిఫెస్టోపై సీఎం జగన్‌ సెటైర్లు వేశారు. చంద్రబాబు మేనిఫెస్టోలో చెబితే అది ఇచ్చేది లేదు.. సచ్చేది లేదంటూ కామెంట్స్‌ చేశారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వాలంటీర్లకు అభినందన సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు. YS Jagan fires on Chandrababu

* చంద్రబాబు హైదరాబాద్ లో ఇంట్లో కూర్చుంటాడు. కాలు బయట పెట్టకుండా వేరే రాష్ట్రాల్లో ఇచ్చిన మేనిఫెస్టోలు తెప్పించుకుంటాడు. ఏ హామీలు బాగా పని చేశాయి? వాళ్ల హామీలన్నీ తీసుకొని ఒక కిచడీ చేసి ఒక మేనిఫెస్టో రూపంలో తీసుకొస్తాడు.
* మన మేనిఫెస్టో ప్రజల కష్టాల నుంచి, వారి కష్టాలను చూసి పుట్టింది. వారి కష్టాలకు సమాధానం వెతుకుతూ పుట్టింది.
* చంద్రబాబు మేనిఫెస్టో హైదరాబాద్ లో పుట్టింది.
* ఆ హామీలన్నీ నిజంగా అమలు చేసే అవకాశం నిజంగా చేయగలుగుతామా అనే ఆలోచన కూడా ఈ మనిషికి చంద్రబాబుకు ఉండదు. మోసాలకు దిగాడు.

* ఎలాగూ ఇచ్చేది లేదు కాబట్టి, చేసేది మోసమే కాబట్టి అబద్ధాలు ఆడటంలో భావదారిద్ర్యం ఎందుకని.. నమ్మిన వాడు మునుగుతాడు, నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడని చంద్రబాబు అడుగులు పడుతున్నాయి.
* ఎలాగూ ప్రజలు అధికారం ఇవ్వరని నమ్మకంతో బాబు తన మార్క్ గ్యాంబ్లింగ్ మొదలు పెట్టాడు.
* జగన్ మాదిరిగా బటన్ నొక్కితే రాష్ట్రం శ్రీలంక అవుతుందని మొన్నటిదాకా అన్నాడు.

* ఇప్పుడు ఆరు వాగ్దానాలంటూ మేనిఫెస్టో చెబుతున్నాడు. ప్రజల్ని మోసం చేసేందుకు.
* ఇది శ్యాంపుల్ మాత్రమే.. ఈ ఆరుకు ఇంకో ఆరు జమ అవుతాయంటున్నాడు.
* ఒకవైపున మీ బిడ్డ ఇంత కష్టపడితే ఎప్పుడూ జరగని విధంగా చేస్తే మీ బిడ్డ సంవత్సరానికి రూ.70 వేల కోట్లు ఖర్చు చేయగలుగుతున్నాడు.
* రూ.2.55 లక్షల డీబీటీగా అక్కచెల్లెమ్మల చేతుల్లో పెడుతూ,నాన్ డీబీటీగా 1.07 లక్షల కోట్లు వేసుకున్నా 3.55 లక్షల కోట్లు ఐదేళ్ల కింద లెక్కేసుకుంటే చాలా కష్టపడి ఖర్చు చేయగలుగుతున్నాం.

read also: Volunteers Meeting: జన్మభూమి కమిటీలు, మన వాలంటీర్లు.. తేడా గమనించండి.. : సీఎం జగన్‌
Justice for Geethanjali: గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్‌
Veligonda Project: ఇది దేవుడి స్క్రిప్టే.. వెలిగొండను జాతికి అంకితం చేయడంపై వైయస్సార్‌ను గుర్తు చేసుకున్న సీఎం జగన్‌
Vision Vishakha: రాష్ట్రాభివృద్ధికి విజన్‌ విశాఖ.. పారిశ్రామికవేత్తలతో సీఎం జగన్‌ నేడు కీలక భేటీ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు