HomeAndhra PradeshVolunteers Andhra Pradesh: వాలంటీర్లకు పెరిగిన గౌరవం.. ప్రోత్సాహమిస్తూ సీఎం జగన్‌ చిరు సత్కారాలు..

Volunteers Andhra Pradesh: వాలంటీర్లకు పెరిగిన గౌరవం.. ప్రోత్సాహమిస్తూ సీఎం జగన్‌ చిరు సత్కారాలు..

Volunteers Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ వ్యవస్థకు మరింత గౌరవం పెరిగింది. ఇప్పటికే కరోనా లాంటి కఠోర సమయాల్లో విశిష్ట సేవలందించడంతోపాటు ప్రతి నెలా ఒకటో తేదీన ఉదయాన్నే పెన్షన్ల పంపిణీ విజయవంతంగా కొనసాగిస్తున్నారు వాలంటీర్లు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా మంచి నమ్మకం ఏర్పరచుకున్నారు. లంచాలు, వివక్షకు తావులేకుండా ప్రభుత్వ సేవలందిస్తున్న నిస్వార్ధ సేవా సైనికులైన వాలంటీర్లను అభినందిస్తూ, ఇదే స్పూర్తితో నిరంతరం వారు సేవలు కొనసాగించేలా ప్రోత్సహిస్తూ సీఎం జగన్‌ వారికి చిరు సత్కారం అందిస్తున్నారు. Volunteers Andhra Pradesh

ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న సేవా వజ్ర అవార్డుల ప్రదానం.. రాష్ట్రవ్యాప్తంగా 7 రోజులపాటు జరిగే ఈ పురస్కారాల ప్రదాన కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా, ఫిరంగిపురంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ మోహన్‌రెడ్డి రేపు లాంఛనంగా ప్రారంభిస్తున్నారు.

పేదలకు మంచి చేసే యజ్ఞంలో వాలంటీర్ల సేవలు చిరకాలం కొనసాగేలా వారిని మరింతగా ప్రోత్సహిస్తూ, ఇప్పటివరకు ఇస్తున్న నగదు పురస్కారాల మొత్తాన్ని మరింత పెంచి అందిస్తోంది జగన్‌ సర్కార్.

* సేవా వజ్ర కింద రూ.30,000 ఇస్తుండగా తాజాగా అది మరింత పెంచి రూ.45,000గా చేశారు.
* సేవా రత్న కింద రూ.20,000 ఇస్తుండగా, దాన్ని పెంచి రూ.30,000 చేశారు.
* సేవా మిత్ర కింద రూ.10,000 ఇప్పటి వరకు ఇస్తుండగా తాజాగా దాన్ని పెంచి రూ.15,000గా చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 2,55,464 మందికి మొత్తంగా రూ.392.05 కోట్ల నగదు పురస్కారాలు.. అందజేస్తున్నారు. దీంతో పాటు, వైఎస్సార్ పెన్షన్ కానుక, ఆసరా తదితర పథకాల లబ్దిదారుల మనోభావాలను అత్యుత్తమంగా సేకరించి, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా ఎంపిక చేసిన 997 మంది వాలంటీర్లకు ప్రత్యేకంగా నగదు బహుమతులు ఇవ్వనున్నారు. ఒక్కో వాలంటీర్ కు మండల, పట్టణ, మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో రూ. 15 వేలు, నియోజకవర్గ స్థాయిలో రూ.20 వేలు, జిల్లా స్థాయిలో రూ. 25 వేల చొప్పున మొత్తం రూ. 1.61 కోట్ల నగదు బహుమతుల ప్రదానం చేస్తారు.

వాలంటీర్లు ఏం చేస్తున్నారు..?

పేదల పక్షాన నిలబడి వారి ముఖాల్లో చిరునవ్వులు కలకాలం నిలిచేలా వాలంటీర్లు పునరంకితమవుతున్నారు. లంచాలకు, వివక్షకు తావు లేకుండా డెలివరీ మెకానిజంలో భాగమయ్యారు. పారదర్శకంగా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులకు తోడుగా ఉంటూ, సహాయకారిగా వ్యవహరిస్తున్నారు. తమ పరిధిలోని 50/100 కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. గ్రామ/వార్డు సచివాలయాలకు, ప్రజలకు మధ్య మంచి సంధానకర్తలుగా వ్యవహరిస్తున్నారు. కోడి కూయకముందే ఇంటి తలుపు తట్టి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి మరీ ఠంచన్గా పింఛన్లు ప్రతి నెలా ఒకటో తారీఖునే అందిస్తున్నారు.

పెన్షన్లతో పాటు రేషన్ డెలివరీ, బియ్యం కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఇళ్ళ పట్టాలతో సహా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్దిదారులందరికీ గ్రామ, వార్డు సచివాలయాల సహకారంతో నిర్దిష్ట కాల పరిమితిలో అందేందుకు కృషి చేస్తున్నారు. వరదలు, విపత్తులు, ప్రమాదాల సహాయ కార్యక్రమాలలో పాల్గొని ప్రజలను ఆదుకోవడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, ‘దిశ’ వంటి ముఖ్యమైన చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

జగనన్న సంక్షేమ సంక్షేమ క్యాలెండర్ అనుసరించి, ఎప్పుడు ఏ పథకం అమలవుతుందో ప్రజల దగ్గరకు వెళ్లి వివరించి అవసరమైతే దగ్గరుండి దరఖాస్తు చేయించే సేవా సైనికులవుతున్నారు.

కనీసం సంవత్సర కాలంగా నిరంతరాయంగా సేవలందిస్తున్న వాలంటీర్లకు, వారు అందించిన సేవల ఆధారంగా 3 కేటగిరీల్లో పురస్కారాలు అందిస్తోంది జగన్‌ సర్కార్.

సేవా వజ్ర
* సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్ తో పాటు రూ. 45,000 నగదు బహుమతి…
* ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన మొదటి ఐదుగురు వాలంటీర్లకు 175 నియోజకవర్గాలలో 875 మంది వాలంటీర్లకు సేవా వజ్ర పురస్కారాల ప్రధానం

సేవా రత్న
* సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్ తో పాటు రూ. 30,000 నగదు బహుమతి..
* ప్రతి మండలం/మున్సిపాలిటీ పరిధిలో 5 మంది చొప్పున, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 10 మంది చొప్పున టాప్ 1 ర్యాంకు సాధించిన వాలంటీర్లకు…మొత్తంగా 4,150 మందికి “సేవా రత్న” పురస్కారాల ప్రదానం…

సేవా మిత్ర
* సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్ తో పాటు రూ.15,000 నగదు బహుమతి..
* రాష్ట్రవ్యాప్తంగా ఏడాది పాటు ఎటువంటి ఫిర్యాదులు, వివాదాలు లేకుండా పని చేసిన 2,50,439 మంది వాలంటీర్లకు.. “సేవామిత్ర” పురస్కారాల ప్రదానం..

Read also: CM Jagan at Nethanna Nestham: వాలంటీర్ల గురించి వీళ్లా మాట్లాడేది..? పవన్‌ నుంచి లోకేష్‌, బాలయ్య వరకు దుమ్ము దులిపేసిన జగన్‌
Justice for Geethanjali: గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్‌
YS Jagan vs All: పిక్చర్‌ క్లియర్‌.. ఒక్క జగన్‌ వర్సెస్‌ టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌..!
Veligonda Project: ఇది దేవుడి స్క్రిప్టే.. వెలిగొండను జాతికి అంకితం చేయడంపై వైయస్సార్‌ను గుర్తు చేసుకున్న సీఎం జగన్‌

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు