HomeAndhra PradeshMaternal Child Care: మాతా శిశు సంరక్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెరుగైన ఫలితాలు

Maternal Child Care: మాతా శిశు సంరక్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెరుగైన ఫలితాలు

Maternal Child Care: మాతా, శిశు సంరక్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మెరుగైన ఫలితాల్ని సాధించిందని ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ తెలిపారు. విజయవాడలో ఏపీ నేషనల్ హెల్త్ మిషన్, నూరా హెల్త్ సంయుక్తంగా ‘కేర్ కంపేనియన్ ప్రోగ్రాం’ పేరిట‌ నిర్వహించిన శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. జిల్లాకు నలుగురు చొప్పున 26 జిల్లాల మెడికల్ ఆఫీసర్లకు రెండు రోజుల పాటు మాస్ట‌ర్ ట్ర‌యిన‌ర్లుగా శిక్షణ ఇస్తారు. Maternal Child Care

ఐదు అంశాలపై రూపొందించిన ఫ్లిప్ చార్టుల్ని నివాస్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణలో మౌలిక వసతుల కల్పన, సమగ్ర శిక్షణ విషయంలో ఏపీ ముందంజలో ఉందన్నారు. మాతా శిశు ఆరోగ్య పరిరక్షణలో కూడా ఆంధ్ర ప్రదేశ్ ముందు నిలిచిందన్నారు. రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన వైద్యాధికారులు క్షేత్ర స్థాయిలో సిహెచ్వోలు/ఎఎన్ ఎంలకు ఉపయోగపడేలా జిల్లా స్థాయిలో శిక్ష‌ణివ్వాలని నివాస్ సూచించారు.

గ‌ర్భిణిలు ప్ర‌స‌వానికి ముందు, త‌ర్వాత తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, సాంక్ర‌మిక వ్యాధులు, చంటి పిల్ల‌లు, కిషోర బాలిక‌ల‌ ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ త‌దిత‌ర అంశాల‌పై ఈ శిక్ష‌ణ‌ ఉంటుందన్నారు. శిక్ష‌ణా కార్య‌క్ర‌మాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుని క్షేత్ర‌స్థాయిలో మెరుగైన ఫ‌లితాల్ని సాధించాలన్నారు. ప్ర‌జారోగ్య ప‌రిర‌క్ష‌ణ‌లో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చిత్త‌శుద్ధితో భాగ‌స్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర స్థాయిలో ఎలాంటి కార్య‌క్ర‌మాల్ని చేప‌ట్టినా కింది స్థాయి వ‌ర‌కూ చేరుకోగ‌లిగితేనే వాటికి సార్ధ‌క‌త చేకూరుతుందన్నారు.

కేర్ కంపానియన్ ప్రోగ్రామ్ శిక్షణతో, ఆరోగ్య సంరక్షణ ప్రదాతల ద్వారా పౌరులకు సాధారణ అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. గర్భిణిలు, సంరక్షకుల (కుటుంబ సభ్యులు) నిరీక్షణ సమయాన్ని ఉపయోగించడం ద్వారా లక్షణాలు, సాధ్యమయ్యే సమస్యలు, స్టాఫ్ నర్సులకు శిక్షణ ఇవ్వడం, వెయిటింగ్ హాల్‌లను తరగతి గదులుగా మార్చడం ద్వారా వాటిని ఎలా పరిష్కరించాలనే దానిపై వారికి సలహా ఇవ్వడానికి ఓపి సమయాన్ని ఉపయోగించుకోవడం అనే అంశాలతో సిపిపిని రూపొందించబడిందని ఆయన వివరించారు.

ఈ కార్యక్రమం వారి కోలుకునే వ్యవధిలో వారితో పాటు సంరక్షకులు, తల్లులకు, శిక్షణ మరియు అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ కాన్సెప్ట్‌ను మొదట ఎంసిహెచ్ విభాగంలో ప్రవేశపెట్టారని, తరువాత రాష్ట్రవ్యాప్తంగా 260 ఆసుపత్రులలో విస్తరించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతీయ ఆరోగ్య మిషన్ మరియు సమాజంలోని వివిధ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి నూరా హెల్త్ నుండి సాంకేతిక మద్దతుతో పాటు ఈ ప్రోగ్రాం విస్తరణకు ప్రణాళికను రూపొందించామన్నారు.

read also: Lalitha Sahasranamam: లలితా సహస్రనామ పారాయణంతో సకలపాప హరణం.. తప్పక పారాయణం చేయండి!
Marta: ఆ మహిళ వయసు 39.. పిల్లలు 19 మంది.. ప్రతి పిల్లాడికీ తండ్రులు వేర్వేరు వ్యక్తులే!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు