Jagananna Thodu Scheme: అధిక వడ్డీల రక్కసి కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్న చిరు వ్యాపారులకు ’జగనన్న తోడు‘ శ్రీరామరక్షగా నిలుస్తోంది. ఏటా చిరు వ్యాపారులకు సున్నా వడ్డీకే రూ.10,000 అందిస్తోంది ప్రభుత్వం. వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ లబ్ధిదారుల కుటుంబాల్లో సంతోషాలు నింపుతోంది. 95 శాతానికిపైగా రికవరీ శాతంతో ఈ పథకం విజయవంతమైంది. (Jagananna Thodu Scheme)
ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధితో జీవిస్తున్న వారిని ఏపీ ప్రభుత్వం ఆదుకుంటోంది. వారు వ్యాపారం చేసుకోవడంతోపాటు మరికొంత మందికి ఉపాధి కల్పిస్తున్న చిరువ్యాపారులకు తోడుగా నిలుస్తోంది. జగనన్న తోడు పథకం ద్వారా ఇప్పటి వరకు వరుసగా 8 విడతల్లో సాయం అందజేసింది. చిరు వ్యాపారుల ఉపాధికి తిరుగులేని ఊతం ఇస్తోంది.
6 నెలలకోసారి వడ్డీ జమ
సకాలంలో రుణాలు చెల్లించిన లబ్ధిదారుల తరఫున వడ్డీని ప్రభుత్వమే భరిస్తోంది. లబ్దిదారులు బ్యాంకులకు కట్టిన వడ్డీ మొత్తాన్ని ప్రతి ఆరు నెలలకోసారి నేరుగా ఆ లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా తిరిగి చెల్లిస్తూ చిరువ్యాపారుల్లో ఆత్మస్థైర్యం నింపుతోంది.
ఎంత రుణం అందుతుంది?
రూ.10,000
సకాలంలో చెల్లించిన వారికి ఏటా రూ.1,000 పెంపు
ఇలా రూ.13,000 వరకు వడ్డీలేని రుణం
ఎవరెవరికి అందిస్తారు?
* 10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్నవారు.
* తోపుడు బండ్ల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాలు అమ్ముకుని జీవించే వారు.
* రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించేవారు.
* సైకిల్, మోటార్ సైకిల్, ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసుకునేవారు.
* గంపలు, బుట్టలతో వస్తువులు అమ్మేవారు.
* చేనేత, సంప్రదాయ చేతివృత్తుల కళాకారులు.
ఇప్పటి వరకు అందించిన సాయం
* మొత్తం లబ్ధిదారులు: 16,73,576 మంది
* అందించిన వడ్డీలేని రుణాలు: రూ.3,373.73 కోట్లు
* సకాలంలో రుణాలు చెల్లించిన 15.87 లక్షల మందికి తిరిగి చెల్లించిన వడ్డీ: రూ.88.33 కోట్లు
దేశానికే ఆదర్శం ఏపీ
* జగనన్న తోడు ద్వారా పూర్తి వడ్డీ రాయితీ (7.32% నుంచి 15.85% వరకు) కల్పించిన జగనన్న ప్రభుత్వం
* దేశవ్యాప్తంగా పీఎం స్వనిధి ద్వారా 58,65,827 మంది చిరు వ్యాపారులకు రుణాలు అందిస్తే, ఏపీలో ఏకంగా 16,73,576 మందికి జగనన్న తోడు ద్వారా వడ్డీ లేని రుణాలు.
* దేశవ్యాప్తంగా పీఎం స్వనిధి కింద ఇప్పటివరకు చిరు వ్యాపారులకు ఇచ్చిన రుణాలు రూ.10,220.47 కోట్లు. మన రాష్ట్రంలో జగనన్న తోడు ద్వారా అందించిన రుణాలు రూ.3,373.73 కోట్లు.
* దేశవ్యాప్తంగా పీఎం స్వనిధి కింద చిరు వ్యాపారులకు రీయింబర్స్ చేసిన వడ్డీ రూ.138.49 కోట్లు. జగనన్న తోడు ద్వారా రీయింబర్స్ చేసిన వడ్డీ రూ.88.33కోట్లు.
ఇదీ చదవండి: Jagananna Thodu: జగనన్న తోడు నిధుల విడుదల.. చిరు వ్యాపారులకు తోడుగా ఉన్నామన్న సీఎం జగన్
