AP Assembly sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు అభినందనీయం అని గవర్నర్ ప్రసంగంలో తెలిపారు. ముఖ్యమంత్రికి, ప్రభుత్వ యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. సామాజిక న్యాయానికి, సమానత్వానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జగన్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. గవర్నర్ ఇంకా ఏమన్నారంటే.. (AP Assembly sessions)
* ప్రజల జీవన ప్రమాణాల మెరుగుకు కృషి చేస్తున్నాం
* నరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి
* నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది
* దేశంలోనే ఎక్కడా లేనివిధంగా విద్యా సంస్కరణలు
* పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం
AP Assembly sessions:
* సామాజిక న్యాయం దిశగా ప్రభుత్వం అడుగులు
* మనబడి నాడు-నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చాం
* విద్యా రంగం పై రూ.73,417 కోట్లు ఖర్చు చేశాం
* 1 నుంచి 10వ తరగతి వరకు జగనన్న గోరుముద్ద అమలు చేస్తున్నాం
* పిల్లలకు నాష్యమైన పౌష్టికాహారం అందిస్తున్నాం
* ఇప్పటి వరకు గోరుముద్దకు రూ.4,417 కోట్లు ఖర్చు చేశాం
* జగనన్న గోరుముద్ద కోసం ఏటా రూ.1,910 కోట్లు ఖర్చు చేస్తున్నాం
* జగనన్న విద్యా కానుక కోసం ఇప్పటి వరకు రూ.3,367 కోట్లు ఖర్చు చేశాం
* విద్యా సంస్కరణల్లో డిజిటల్ లెర్నింగ్ కీలకమైనది
* 8, 9 తరగతుల విద్యార్థులకు 9.52,925 ట్యాబ్‌లు పంపిణీ చేశాం
* వచ్చే ఏడాది జూన్ నుంచి 1వ తరగతి నుంచి ఐబీ విధానం
* ప్రతి ఏటా ఒక తరగతికి ఐబీ విధానం పెంచుకుంటూ వెళ్తాం
* మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా విద్యా బోధన
* విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం విదేశీ విద్యాదీవెన పథకం అమలు
* అత్యున్నత 50 విద్యా సంస్థల్లో గుర్తించిన 21 ఫ్యాకల్టీలలో ఏ విభాగంలోనైనా విదేశీ విద్యను అభ్యసించవచ్చు
* ఇందుకోసం రూ.1.25 కోట్లు వరకు మొత్తం ఫీజులు రీయింబర్స్ చేస్తున్నాం
* ప్రభుత్వ కృషితో స్కూళ్లలో డ్రాప్ ఔట్‌లు గణనీయంగా తగ్గాయి
* రాష్ట్ర వ్యాప్తంగా 10,132 విలేజ్ హెల్త్ క్లినిక్ లు
* 1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 177 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు
* 53 ఏరియా ఆసుపత్రులు, 9 జిల్లా ఆసుపత్రుల్లో వసతుల అభివృద్ధి
* నాడు-నేడు ద్వారా ఆసుపత్రుల్లో సౌకర్యాల మెరుగు
* ఇప్పటి వరకు 53,126 మంది వైద్య సిబ్బందిని నియమించాం
* ఫ్యామిలీ డాక్టర్ కింద 3.03 కోట్ల ఓపీ సేవలు అందించాం
* ఇప్పటి వరకు 1.3 కోట్ల గ్రామీణ రోగులకు ఇంటి వద్దే వైద్య సేవలు
* ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 మంది పారామెడికల్ సిబ్బంది నియమించాం
* ఇప్పటి వరకు 1.32 కోట్ల రోగులకు సేవలు అందించాం
* ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యం దిశగా జగనన్న ఆరోగ్య సురక్ష
* రైతులు రాష్ట్రానికి వెన్నెముక…62 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు
* 10,778 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు
* ఇప్పటి వరకు 53.53 లక్షల రైతులకు రైతు భరోసా ఇచ్చాం
* రైతు భరోసా కింద రూ.33,300 కోట్లు పంపిణీ చేశాం
* రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నాం
* 22.85 లక్షల రైతులకు రూ.1,977 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చాం
* మిచాంగ్ తుఫానులో నష్టపోయిన రైతులకు రూ.347.55 కోట్ల సాయం
* మత్స్యకార కుటుంబాలకు రూ.540 కోట్లు అందించాం
* చేపల వేటకు వెళ్లి మరణిస్తే నష్టపరిహారం 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాం
* ఫిషింగ్ బోట్లకు డీజిల్ సబ్సిడీ కోసం రూ .128.27 కోట్లు ఇచ్చాం
* ఆక్వా రైతుల విద్యుత్ ఛార్జీల రాయితీ కోసం రూ.3,186.36 కోట్లు అందించాం
* రూ.50.30 కోట్లతో 35 ఆక్వా ల్యాబ్‌ల ఏర్పాటు
* మహిళా సాధికారత, శిశువుల ఆరోగ్యం పై ప్రత్యేక కృషి
* ఏపీలో 55,607 అంగన్వాడీల కేంద్రాల ద్వారా పౌష్టికాహారం
* వైఎస్ఆర్ ఆసరా ద్వారా మహిళా గ్రూపులకు ఆర్థిక సాయం
* 78.84 లక్షల మంది మహిళలకు నాలుగేళ్లలో రూ.25,571 కోట్లు
* వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కోసం రూ.4,969.05 కోట్లు
* వైఎస్ఆర్ చేయూత ద్వారా రూ.14,129 కోట్లు పంపిణీ

* వైఎస్ఆర్ కాపునేస్తం కింద రూ.2,029 కోట్లు జమ
* వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద రూ.1,257.04 కోట్లు జమ
* వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా ఏడాదికి రూ.15 వేలు అందిస్తున్నాం
* ఐదేళ్లలో రూ.75,000 ఆర్థిక సాయం అందిస్తున్నాం
* 3,57,844 మంది అర్హుల ఖాతాల్లో రూ.2,029 కోట్లు జమ
* రూ.71 కోట్ల వ్యయంతో 500 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల కొనుగోలు
* దీని ద్వారా 3,27,289 మంది తల్లులకు లబ్ధి
* వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద 66.34 లక్షల మందికి పెన్షన్ అందిస్తున్నాం
* 2024 జనవరి 1వ తేదీ నుంచి 3 వేలు పెన్షన్ అందిస్తున్నాం
* ఏపీ అసెంబ్లీ : నెలవారీ పెన్షన్ బడ్జెట్ రూ.1,961 కోట్లు పెరిగింది
* ఆటో ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ మొబైల్ డిస్పె్న్సింగ్ ఓనర్లకు 10 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నాం
* జగనన్న చేదోడు ద్వారా దుకాణాలు, నాయిబ్రహ్మణులు, దర్జీలకు ప్రభుత్వం 10 వేల ఆర్థికసాయం అందిస్తోంది
* జగనన్న తోడు ద్వారా వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులకు రూ.10 వేల వడ్డీలేని రుణం అందిస్తున్నాం
* వైఎస్ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా ద్వారా రూ.350.89 కోట్లు అందిస్తున్నాం
* నాన్ డీబీటీ కింద 4.23 లక్షల కోట్ల సంక్షేమ ఫలాలు అందించాం
* 2023-24లో 268 కి.మీ. పొడవును 58 బీటీ రోడ్లు వేశాం
* రాష్ట్రంలో దిశ యాప్ ద్వారా 3040 కేసులు
* పేదలందరికీ ఇళ్ల పథకం కింద 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం
* ఇప్పటికే 9 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించాం
* పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి అధిక ప్రాధాన్యత
* పీడీఎఫ్ కుటుంబాలకు సానుభూతితో పునరావాసం కల్పించాం
* పోలవరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు 74.01 శాతం పూర్తి
* ఎల్ఏ అండ్ ఆర్.ఆర్ పనిలో 22.42 శాతం పూర్తి : గవర్నర్
* ఇంధన రంగంలో సబ్సిడీలు, రాయితీలను ప్రభుత్వం కల్పిస్తోంది
* రాష్ట్రంలో 19.41 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు పగటి పూట కరెంట్
* 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం
* విజయనగరం జిల్లా-భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు
* భోగాపురంలో మే 3న నిర్మాణ పనులు ప్రారంభించాం
* మరో 30 నెలల్లో ఎయిర్‌పోర్టు ప్రారంభించేందుకు సిద్ధం
* మత్స్యకారులకు సాయం కోసం 10 ఫిషింగ్ హార్బర్లు
* ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణం
* ఐటీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఐటీ పాలసీ 2021-24 ప్రవేశపెట్టాం
* ఐటీ ఫలాలు చివరి మైలురాయి వరకు చేరేలా కృషి
* 200 ఎండబ్ల్యూ డేటా సెంటర్ కోసం రూ.14,634 పెట్టుబడి
* మధురవాడలో ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ ఏర్పాటు
* పర్యాటక రంగం అభివృద్ధికి ఏపీ టూరిజం పాలసీ 2020-225
* అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడం పై ఫోకస్
* 7,290 మందికి ఉపాధి కల్పించేలా రూ.3,685 కోట్ల పెట్టుబడి
* వికేంద్రీకరణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది
* 13 కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో పరిపాలన ప్రజలకు మరింత చేరువైంది
* 2.6 లక్షల మంది వాలంటీర్ల ద్వారా ప్రజలకు నేరుగా ప్రభుత్వ సేవలు
* జగనన్న సురక్ష ద్వారా కోటి ధృవీకరణ పత్రాలను ఇంటి వద్దకే అందించాం
* 35,44,866 ఎకరాల భూమి పేదలకు పంపిణీ, హక్కులు కల్పించాం
* 20,24,709 మంది భూమిలేని నిరుపేదలకు ప్రయోజనం
read also: Jagan Siddham: మంచి పాలన అందించాం.. ప్రతి ఇంటికీ మంచి చేయగలిగాం… ఏలూరు సభలో సీఎం జగన్
