Poverty in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో పేదరికంపై పేదలు గెలుస్తున్నారు. వైయస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలతో బడుగు, బలహీన వర్గాలకు తిరుగులేని ఆర్థిక స్వావలంబన చేకూరుతోంది. మహిళా సాధికారతతో పేదరికం క్రమేపీ తగ్గుముఖం పట్టింది. 2015-16లో 11.77 శాతం ఉన్న పేదరికం.. 2023లో ఏకంగా 4.19 శాతానికి తగ్గిపోయింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ తాజా నివేదికలో వెల్లడించింది. వైయస్సార్ ఆసరా, చేయూత, సున్నావడ్డీ, జగనన్న పాలవెల్లువ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, నేతన్న నేస్తం, జగనన్న తోడు.. ఇలా అనేక రకాలుగా పేదవారికి సాయం అందిస్తుండడంతో పేదలు తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు. (Poverty in Andhra Pradesh)
ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట ఉండి అవసరమైన సదుపాయాలు అందుబాటులోకి తీసుకురాగలిగిన రోజే పేదరికాన్ని జయించినట్లు అవుతుంది. ఏపీలో సరిగ్గా ఇదే జరుగుతోంది. సీఎం వైయస్ జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి పేదరికంపై యుద్ధం ప్రకటించారు. నిరుపేదల కోసం సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పేదరికం కారణంగా ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదని అండగా నిలుస్తున్నారు.
రాష్ట్రంలో ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యంపై భరోసా ఇస్తున్నారు సీఎం జగన్. నవరత్నాలతో పేదలకు అండగా నిలిచారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ నాలుగున్నరేళ్లలో ఏకంగా రూ.4.21 లక్షల కోట్లను సీఎం జగన్ పేదలకు అందించారు. రాష్ట్రంలో పేదలు గడిచిన నాలుగున్నరేళ్లలో 1.87 శాతం తగ్గారు. పేదరికం ఇప్పుడు 4.19 శాతానికి మాత్రమే పరిమితమయింది.
పేదరికం ఇలా తగ్గింది..
* జగనన్న ప్రభుత్వం నవరత్నాలతో 2019–21లో 6.06 శాతంగా ఉన్న పేదరికాన్ని 2022–23 నాటికి 4.19 శాతానికి తగ్గించింది.
* అమ్మ ఒడితో రూ.15,000 ఏటా అందిస్తోంది. తల్లిదండ్రులంతా పిల్లల్ని స్కూళ్లకు పంపుతున్నారు. గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్‌రేషియో ఏకంగా 100 శాతానికి చేరింది.
* వైయస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ పథకాల ద్వారా పౌష్టికాహారం అందుతోంది.
* శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గింది.
* మనబడి నాడు-నేడు ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పిల్లల హాజరు శాతం పెరిగింది.
* పిల్లలకు గోరుముద్ద ద్వారా రోజుకో మెనూతో మధ్యాహ్న భోజనం పెడుతుండడంతో తల్లిదండ్రులకు భారం తగ్గింది.
* రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై ఆహార ధాన్యాలు అందిస్తోంది.
* పారిశుద్ధ్యంతో పాటు ఉచిత విద్య, ఆరోగ్యం, పోషకాహారాలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం.
* ప్రజల జీవన నాణ్యతలో గణనీయమైన ప్రగతి నమోదు.
* వైయస్సార్ చేయూత, వైయస్సార్ ఆసరా, వైయస్సార్ సున్నా వడ్డీ ద్వారా వడ్డీ భారం లేకుండా రుణాలు అందజేత.
* పేద అక్క చెల్లెమ్మల కుటుంబాలను పేదరికం నుంచి బయటపడేసేందుకు మార్గం సుగమం.
* పేద, మధ్యతరగతి ప్రజలకు వైయస్సార్ ఆరోగ్య శ్రీ సేవల పరిమితి రూ.25 లక్షలకు పెంపు.
* నవరత్నాలు –పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్రంలో 31.91 లక్షల మంది పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్థలాల పంపిణీ. 22 లక్షల ఇళ్ల నిర్మాణం.
ఆసరా సంకల్పం నెరవేరింది..
మహిళలు ఆర్థికంగా నిలబడితే కుటుంబాలు బాగుపడతాయి. తద్వారా ఊళ్లు అభివృద్ధి అవుతాయి. రాష్ట్రం ఉన్నత స్థాయికి ఎదుగుతుంది. ఇదే సిద్ధాంతాన్ని నమ్మిన ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి.. మహిళలకు ఆసరా కల్పించేందుకు పూనుకున్నారు. 2014 ఏప్రిల్ 11వ తేదీ నాటికి బ్యాంకులకు బకాయిపడిన మొత్తాన్ని వారు సక్రమంగా చెల్లిస్తే 4 విడతల్లో ఆసరా ద్వారా వాపసు ఇస్తామని మాట ఇచ్చారు. హామీని నెరవేర్చారు.
ఇదీ చదవండి: Jagananna Thodu Scheme: చిరు వ్యాపారులకు ’జగనన్న తోడు‘.. దేశంలోనే రికార్డులు సృష్టిస్తున్న పథకం
