HomeAndhra PradeshJagananna Thodu: జగనన్న తోడు నిధుల విడుదల.. చిరు వ్యాపారులకు తోడుగా ఉన్నామన్న సీఎం జగన్‌

Jagananna Thodu: జగనన్న తోడు నిధుల విడుదల.. చిరు వ్యాపారులకు తోడుగా ఉన్నామన్న సీఎం జగన్‌

Jagananna Thodu: ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధితో జీవిస్తూ, మరో ఒకరిద్దరికి సైతం ఉపాధి కల్పిస్తున్న చిరువ్యాపారులు అధిక వడ్డీల బారిన పడకుండా వారికి అండగా నిలబడుతూ, వారి ఇంట ముందుగానే పండగ సంతోషాలు వెల్లివిరిసేలా వరుసగా 8వ విడత జగనన్న తోడు కార్యక్రమం ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. (Jagananna Thodu)

పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ, ఒక్కొక్కరికి రూ. 10,000, అంతకు పైగా… 3,95,000 చిరు వ్యాపారులకు రూ. 417.94 కోట్ల వడ్డీలేని కొత్త రుణాలు, మొత్తం 16,73,576 మంది లబ్ధిదారుల్లో ఈ విడతలో చెల్లించాల్సిన 5.81లక్షల మంది లబ్ధిదారులకు రూ.13.64 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్ కలిపి మొత్తం రూ. 431.58 కోట్లను సీఎం జగన్‌ బటన్‌ నొక్కి విడుదల చేశారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారిని వారి కాళ్లమీద వారిని నిలబెడుతూ.. ఒక్కొక్కరికి ఏటా రూ.10,000 రుణం సున్నా వడ్డీకే అందిస్తూ, రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించినవారికి ఆ రూ.10,000 కు అదనంగా ఏడాదికి మరో రూ.1,000 చొప్పున జోడిస్తూ రూ.13,000 వరకు వడ్డీలేని రుణం అందిస్తోంది ఏపీ ప్రభుత్వం.

నేడు అందిస్తున్న వడ్డీ రీయింబర్స్ మెంట్ రూ. 13.64 కోట్లతో కలిపి సకాలంలో రుణాలు చెల్లించిన 15.87 లక్షల లబ్ధిదారులకు ఇప్పటివరకు మన ప్రభుత్వం తిరిగి చెల్లించిన వడ్డీ రూ.88.33 కోట్లు.. నేడు అందిస్తున్న రూ.417.94 కోట్ల రుణంతో కలిపి ఇప్పటివరకు చిరువ్యాపారాలు చేసుకునే 16,73,576 మంది లబ్ధిదారులకు అందించిన వడ్డీ లేని రుణాలు రూ. 3,373.73 కోట్లు.

సకాలంలో రుణాలు చెల్లించిన మీ తరపున వడ్డీని భరించనున్న జగనన్న ప్రభుత్వం.. లబ్దిదారులు బ్యాంకులకు కట్టిన వడ్డీ మొత్తాన్ని ప్రతి ఆరు నెలలకోసారి నేరుగా ఆ లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా తిరిగి చెల్లిస్తున్న జగనన్న ప్రభుత్వం..

వీరందరికీ “జగనన్న తోడు..”

* 10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్నవారు…
* తోపుడు బండ్ల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాలు అమ్ముకుని జీవించే వారు, రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించేవారు.. సైకిల్, మోటార్ సైకిల్, ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసుకునేవారు..
* గంపలు, బుట్టలతో వస్తువులు అమ్మేవారు… చేనేత మరియు సాంప్రదాయ చేతివృత్తుల కళాకారులు..
* చిరువ్యాపారులను ఆదుకోవడంలో దేశానికే ఆదర్శంగా ఏపీ..

* “జగనన్న తోడు” ద్వారా పూర్తి వడ్డీ రాయితీ (7.32% నుండి 15.85% వరకు) కల్పించిన జగనన్న ప్రభుత్వం..
* దేశవ్యాప్తంగా “పీఎం స్వనిధి” ద్వారా 58,65,827 మంది చిరు వ్యాపారులకు రుణాలు అందిస్తే, ఆంధ్రప్రదేశ్ లో ఏకంగా 16,73,576 మందికి “జగనన్న తోడు” ద్వారా వడ్డీ లేని రుణాలు.. దేశవ్యాప్తంగా “పిఎం స్వనిధి” క్రింద ఇప్పటివరకు చిరు వ్యాపారులకు ఇచ్చిన రుణాలు రూ.10,220.47 కోట్లు అయితే మన రాష్ట్రంలో “జగనన్న తోడు” ద్వారా అందించిన రుణాలే అక్షరాల రూ.3,373.73 కోట్లు..

* దేశవ్యాప్తంగా “పిఎం స్వనిధి” క్రింద చిరు వ్యాపారులకు రీయింబర్స్ చేసిన వడ్డీ రూ. 138.49 కోట్లుగా ఉంటే “జగనన్న తోడు” ద్వారా రీయింబర్స్ చేసిన వడ్డీ రూ.88.33కోట్లు..

read also: CEC Press meet: ఏపీలో ఎన్నికల నిర్వహణపై సిద్ధమవుతున్నాం.. విజయవాడలో సీఈసీ కీలక ప్రెస్‌మీట్‌

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు