YS Jagan in Eluru: దెందులూరు సభలో సీఎం జగన్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. 14 సంవత్సరాలు సీఎంగా చేసిన చంద్రబాబు అక్కచెల్లెమ్మల ఖాతాల్లో ఏనాడైనా ఒక్క రూపాయి అయినా జమ చేశారా? అని ప్రశ్నించారు. కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని కలిగించారు. (YS Jagan in Eluru) జగన్ ఏమన్నారంటే.. (ysrcp)
* మీ గ్రామాల్లో ఇళ్లకు వెళ్లినప్పుడు ఆ ఇంట్లో అడగండి.. 1995లో సీఎం అయిన చంద్రబాబు.. 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు.. 3 సార్లు సీఎం అయిన చంద్రబాబు.. మీ ఇంటికి గానీ, మీ ఊరికి గానీ, మీ సామాజికవర్గానికి గానీ, మీ కుటుంబ భవిష్యత్ కు గానీ ఏం చేశాడు అని అడగండి.
* అదే పేద కుటుంబాన్ని అడగండి. గత 10 ఏళ్లుగా వారి బ్యాంకు అకౌంటు వివరాలను వారినే చూడమని చెప్పి అడగండి.
* చంద్రబాబు 5 సంవత్సరాలు, మీ బిడ్డ జగన్ పాలనలో 5 సంవత్సరాలు.. బ్యాంకు అకౌంటు వివరాల్లో అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో ఎంత డబ్బులు పడిందో అడగండి.
* చంద్రబాబు పాలనలో పేద కుటుంబానికి బ్యాంకు అకౌంటుకు ఇచ్చింది ఎంత అని అడగండి.
* వారిని నిలబెట్టేలా అందించిన స్కీములు చంద్రబాబు హయాంలో ఏమున్నాయి అని అడగండి.
* బాబు పాలనలో ఏనాడైనా ఒక్క రూపాయి అయినా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల బ్యాంకు ఖాతాల్లోకి ఒక్క రూపాయి అయినా వేశాడా అని అడగండి.
* 1994లో గానీ, 1999లో గానీ, 2014లో గానీ చంద్రబాబు టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చంద్రబాబు ఏనాడైనా 10 శాతం అయినా అమలు చేశాడా అని ప్రతి ఇంట్లో ఉన్న అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలను అడగండి.
* మరోవంక మీ జగన్ పాలన, మీ బిడ్డ పాలన చూడండి అని మళ్లీ అడగండి.
* ఈ 57 నెలల మీ బిడ్డ పాలనలో మీ బిడ్డ ఏం చేశాడో కొన్ని అంశాలను వివరిస్తా. ఈ తేడాను ప్రతి ఇంట్లో వివరించండి.
* కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం ఏ గ్రామమైనా తీసుకోండి. ఏ పట్టణాన్ని తీసుకున్నా ఆ గ్రామానికి వెళ్లి నాలుగు అడుగులు వేస్తే గతంలో లేనిది, మన గ్రామంలోనే ఈరోజు కనిపించేది విలేజ్ సెక్రటేరియట్. ఒక వార్డు సెక్రటేరియట్ కనిపిస్తుంది.
* ఎవరు పెట్టారంటే.. మీ జగన్. మన వైయస్సార్ సీపీ పార్టీ.
* ప్రతి గ్రామ సచివాలయంలో, ప్రతి వార్డు సచివాలయంలో కనీసం అంటే 540 రకాల సేవలు అందిస్తూ, అందులో దాదాపు 10 మంది మన పిల్లలే అక్కడే ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తారు.
* మరి ఈ వ్యవస్థ ఎవరు తీసుకొచ్చారంటే.. మీ జగన్. మన వైయస్సార్ సీపీ.
* 1వ తేదీ ఉదయాన్నే మన ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో తలుపుతట్టి ప్రతి అవ్వాతాతకు మంచి మనవడిలా, మనవరాలిలా, ప్రతి వితంతు, వికలాంగుడికీ ఏకంగా 66 లక్షల కుటుంబాలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి చేతిలో పెడుతున్న 3 వేల పెన్షన్ చూసినప్పుడు గుర్తుకొచ్చేది మీ జగన్. చేసినది మన వైయస్సార్ సీపీ.
* లంచాలు, వివక్షకు మారుపేరైన జన్మభూమి కమిటీల రోజులు.. ఆరోజుల నుంచి ఈరోజు ఏ గ్రామంలో కూడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఎవరు తెచ్చారంటే.. మీ జగన్. తెచ్చింది మన వైయస్సార్ సీపీ.
* డీబీటీ ద్వారా బటన్ నొక్కి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పంపుతున్నది ఎవరు అంటే.. మీ జగన్. చేస్తున్నది మన వైయస్సార్ సీపీ ప్రభుత్వం.
* ఈరోజు ప్రతి గ్రామంలో గవర్నమెంట్ బడి, ప్రభుత్వ ఆస్పత్రి మారటానికి నాడు-నేడు చేస్తున్నది ఎవరు అంటే.. మీ జగన్. వైయస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే.
* గవర్నమెంట్ బడిలో ఇంగ్లీషు మీడియం, సీబీఎస్ఈతో మొదలు ఐబీ వరకు ప్రయాణం అంటే గుర్తుకొచ్చేది మీ జగన్,.
* గవర్నమెంట్ బడుల్లో పిల్లలకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్కులు కనిపిస్తున్నాయంటే, ఈరోజు డిజిటల్ బోధనతో, క్లాస్ రూముల్లో ఐఎఫ్‌పీలు కనిపిస్తున్నాయంటే, బడులకు వెళ్లినప్పుడు, పిల్లల్ని చూసినప్పుడు గుర్తుకొచ్చేది మీ జగన్. చేసినది మన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీనే.
read also: YS Jagan Siddham: ఏలూరులో జన సునామీ.. సిద్ధం అంటూ వైయస్సార్ సీపీ శ్రేణుల సమరనాదం
YS Jagan Bus Yatra: జనం మధ్యలోకి జగన్.. బస్సు యాత్రతో వైయస్సార్ సీపీలో జోష్!!
CM Jagan Ready to Elections: ఎన్నికల సమరానికి సీఎం జగన్ సిద్ధం.. 18 నుంచి ప్రచార సమర భేరి!
