YS Jagan Siddham: ఏలూరు జిల్లా దెందులూరులో వైయస్సార్ సీపీ సిద్ధం సభ జన సునామీని తలపించింది. లక్షలాది మంది జనసందోహంతో సభాప్రాంగణం కిక్కిరిసింది. సిద్ధమా అంటూ సీఎం జగన్ చేసిన ప్రసంగం ఉర్రూతలూగించింది. మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేనా అని జగన్ శ్రేణులను అడగ్గా.. సిద్ధం.. అంటూ దిక్కులు పిక్కటిల్లేలా ప్రతిధ్వనించింది. (YS Jagan Siddham) సీఎం జగన్ ఏమన్నారంటే..
* ఇంటింటి చరిత్రను, పేదింటి భవిష్యత్‌ను మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు, మన పార్టీని మరోసారి గెలిపించుకొనేందుకు మీరంతా కూడా సిద్ధమేనా?
* పేదల భవిష్యత్‌ను, పేదల్ని కాటేసే ఎల్లో వైరస్ మీద, కనిపిస్తున్న కరోనా లాంటి ఆ దుష్ట చతుష్టయం మీద యుద్ధానికి, ఓ మహాసంగ్రామానికి, నా కుటుంబ సభ్యులైన నా ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, నా ప్రతిసోదరుడు, నా ప్రతి స్నేహితుడు, నా ప్రతి అవ్వా, నా ప్రతి తాతా, మీరంతా కూడా సిద్ధమేనా?
* మన కర్మ ఏమిటంటే మన రాష్ట్రంలో రామాయణం, మహాభారతం ఈ రెండింటిలోనూ ఉన్న విలన్లంతా కూడా ఓ చంద్రబాబు రూపేణా, ఓ ఈనాడు రూపేణా, ఓ ఆంధ్రజ్యోతి రూపేణా, ఓ టీవీ5 రూపేణా, ఓ దత్తపుత్రుడి రూపేణా, ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు కోవర్టులు.. ఇంత మంది తోడేళ్లందరూ కూడా ఏకమై మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకొని రెడీగా ఉన్నారు.
* కానీ ఈ సీను వారి వైపు నుంచి చూస్తే ఎలా కనిపిస్తుందంటే.. జగన్ ఒంటరి వాడులా కనిపిస్తాడు.
* ఇంత మంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరి వాడి మాదిరిగా కనిపిస్తాడు.
* నిజం ఏమిటి అంటే ఇక్కడ కనిపిస్తున్నది నిజం. ఇదీ అసలు సీను.
* ఇన్ని లక్షల హృదయాల్లో కోట్ల మంది హృదయాల్లో మీ జగన్ మీ గుండెల్లో మీరు స్థానం ఇచ్చి మీ ఇంటి బిడ్డగా మీ జగన్ మీ గుండెల్లో ఉండటం.. ఇదీ నిజం.
* జగన్ ఏనాడూ ఒంటరి కాదు. వారికి ఉన్న సైన్యం వారి పొత్తులైతే, వారి ఎల్లో పత్రికలైతే, వారి ఎల్లో టీవీలైతే.. నాకున్న తోడేమిటో తెలుసా? నాతోడు, నా ధైర్యం, నా బలం, పైనున్న దేవుడు నాకున్న బలం. ఇది నాయకుడి నమ్మకం నుంచి పుట్టి వచ్చిన సైన్యం.
* ఒక నాయకుడిని ప్రజలు నమ్మారంటే ఏ రకంగా ఉంటుంది వాళ్ల ప్రేమ అనేందుకు ఇదే నిదర్శనం.
* జరగబోయే ఎన్నికల రణక్షేత్రంలో కృష్ణావతారంలో కృష్ణుడి పాత్ర పోషిస్తూ మీరు, మీకు తోడు అర్జునుడిని నేను.. మనందరి ప్రభుత్వం చేసిన మంచి మన అస్త్రాలుగా.. కౌరవ సైన్యం మీద మనమంతా కూడా పడతాం.. అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.
* జరగబోయే ఎన్నికల యుద్ధంలో వారి దాడి ఎవరి మీద అంటే.. మన సంక్షేమం మీద, ప్రతి ఇంటికీ మనం చేస్తున్న మంచి మీద, అభివృద్ధి మీద.
* ఎన్నికల మేనిఫెస్టోను ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి మేనిఫెస్టోలో చెప్పిన 99 శాతం హామీలు నెరవేర్చి మనందరి ప్రభుత్వం చేస్తున్న ఇంటింటి మంచి మీద, అభివృద్ధి మీద, పేద వాడి భవిష్యత్ మీద, పేదవాడి సంక్షేమం మీద గ్రామ గ్రామం అభివృద్ధి మీద, సామాజిక వర్గాల అభివృద్ధి మీద వారు దాడి చేస్తున్నారు.
* ఈరోజు మన పెత్తందార్లంతా కూడా ఎవరి మీద దాడి చేస్తున్నారో ఆలోచన చేయాలి.
* మన ప్రభుత్వం అమలు చేస్తున్న రాబోయే తరం విద్యా విధానం మీద వీరి దాడి.
* పోర్టులు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు, నాడు-నేడుతో మారుస్తున్న స్కూళ్లు, హాస్పిటళ్లు, పారిశ్రామిక అభివృద్ధి, మొత్తంగా రాష్ట్ర అభివృద్ధి మీద టీడీపీ దండ యాత్ర చేస్తోంది.
* చంద్రబాబు దుష్ట సైన్యాన్ని, వారి కుట్రల్ని, కుతంత్రాల్ని, చీల్చి, చెండాడటానికి మళ్లీ మన వైయస్సార్ సీపీ ప్రజా సైన్యం, మన కేడర్, మన లీడర్లు, మన అభిమానులు, నా కుటుంబ సభ్యులైన మీరంతా మరొక్కసారి అడుగుతున్న సిద్ధమేనా?
* మనకు ప్రతిపక్షానికి మధ్య ఉన్న తేడాను, ప్రతి కుటుంబానికి మనం చేసిన మంచిని వివరించేందుకు ఈరోజు ఈ గోదారమ్మ సీమలో నిలబడి ఉన్నా.
* ఇంటింటా మనం చేసిన అభివృద్ధి, గ్రామ గ్రామంలో తెచ్చిన మార్పు. లంచాలు, వివక్షకు తావు లేకుండా తెచ్చిన వ్యవస్థ.
* చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా జరిగిన సామాజిక న్యాయం. వీటన్నింటికీ మనందరి ప్రభుత్వమే కేరాఫ్ అడ్రస్ అని ప్రతి అభిమాని, ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసి చెప్పడానికి అన్ని అంశాలనూ పంచుకొనేందుకు, తిరుగులేని ఆత్మవిశ్వాసంతో 175కు 175 ఎమ్మెల్యేలు.. 25కు 25 ఎంపీలు గెలవాల్సిన అవసరాన్ని వివరించేందుకు మీ వాడిగా మీ ముందుకు వచ్చి నా మనసు పంచుకుంటున్నా. నా మాటలు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రతి ఒక్కరితో పంచుకోవాలి.
Read Also : YS Jagan Bheemili: దేవుడి దయతో ప్రజలే అండగా ఒంటరి పోరాటానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా..!
Ongole CM jagan Meeting: పేదల ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ పంపిణీ.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
CM Jagan Help to Doctor Couple: డబ్బుదేముంది లేబ్బా.. ముందు ప్రాణం నిలబడనీ..!
YS Jagan Siddham Sabha: చీకటి రాతల్ని, చీకటి పనుల్ని బట్టబయలు చేసేందుకు మీరంతా సిద్ధమేనా?
