YS Jagan in Eluru Sabha: రాష్ట్రంలో రైతన్నను చేయిపట్టుకొని నడిపించే ఆర్బీకేను తీసుకొచ్చింది ఎవరు అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అన్నారు. ఏలూరు సిద్ధం సభలో ఆయన మాట్లాడుతూ.. రైతన్నకు రైతు భరోసా సొమ్ము అందిస్తున్నది ఎవరంటే మీ జగన్.. చేస్తున్నది, ఎప్పటి నుంచి మొదలైంది అంటే మన వైయస్సార్ సీపీ వచ్చిన తర్వాతే.. పేదలు, రైతన్నలకు మంచి చేస్తూ అసైన్డ్ భూముల మీద, 22ఏ భూముల మీద, 35 లక్షల ఎకరాల మీద శాశ్వత భూ హక్కులు ఇచ్చింది ఎవరు అంటే మీ జగన్.. జరిగింది ఎప్పుడంటే వైయస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే… అన్నారు (YS Jagan in Eluru Sabha) జగన్ ఇంకా ఏమన్నారంటే..
* నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ ఈ 57 నెలల్లోనే అందించిన రూ.2.55 లక్షల కోట్లలో 75 శాతం పైగా ఈ వర్గాలకే అందించి దేశ చరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వం చూపనంతగా ఈ పేద వర్గాల సంక్షేమం, అభివృద్ధి పట్ల, మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా ప్రేమ, అభిమానం, కమిట్‌మెంట్ చూపింది ఎవరంటే మీ జగన్. జరిగింది మంచి ఎప్పుడంటే.. మన వైయస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే.
* నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టులు, ఆలయ బోర్డులు, వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో కార్పొరేషన్ చైర్మన్లు, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం పోస్టులు చట్టం చేసి మరీ ఇచ్చింది ఎవరు అంటే మీ జగన్. జరిగింది ఎప్పుడంటే మన వైయస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే.
* కేబినెట్‌లో 68 శాతం మంత్రి పదవులు నానానానా అంటూ నేను పిలుచుకొనే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ పిలుచుకొనే నా అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు దక్కింది మీ బిడ్డ పాలనలో.
* నలుగురు డిప్యూటీ సీఎం పదవులు, శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి చైర్మన్, డిప్యూటీ చైర్ పర్సన్ మొదలు.. స్థానిక సంస్థల పదవులన్నింటిలోనూ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి నానానా అని పిలుచుకుంటూ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ వర్గాలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నది ఎప్పుడంటే మీ బిడ్డ పాలన వచ్చిన తర్వాతే.
* ఈ ప్రేమ ఉంది కాబట్టే.. రాష్ట్రంలో మొత్తం మీ బిడ్డ ప్రభుత్వం ఏర్పడనంత వరకు 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలుంటే మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.13 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు. ఇందులో 80 శాతం నానానానా అని పిలుచుకొనే నా చెల్లెమ్మలు, తమ్ముళ్లు కనిపిస్తున్నారంటే ఇది జరిగింది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే, వైయస్సార్ సీపీ పాలన వచ్చిన తర్వాతే.
* అక్కచెల్లెమ్మలకు లక్షాధికారిని చేయాలి, గూడు ఉండాలని ఏకంగా 31 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చింది ఎవరంటే మీ జగన్. అందులో 22 లక్షల ఇళ్లు కడుతున్నది ఎవరంటే మీ జగన్. మన వైయస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే.
* నా అక్కచెల్లెమ్మలను ప్రతి రంగంలో ముందడుగు వేయాలని, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ పై ఇచ్చే కాంట్రాక్టుల్లో 50 శాతం చట్టం చేసి ఇస్తున్నది ఎవరంటే మీ జగన్. మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే.
* అక్కచెల్లెమ్మలు పిల్లల్ని బడులకు పంపిస్తే చాలు అమ్మ ఒడి, పిల్లలకు తోడుగా ఉంటూ విద్యా దీవెన, వసతి దీవెన, ఓ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ.. ఓ కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, మహిళా సాధికారత, దిశ యాప్ అంటే గుర్తుకు వచ్చేది మీ జగన్. జరిగింది ఎప్పుడంటే మన వైయస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే.
read also: YS Jagan in Eluru: చంద్రబాబు 14 ఏళ్లలో బ్యాంకు ఖాతాల్లో ఒక్క రూపాయి అయినా అక్కచెల్లెమ్మలకు జమ చేశారా?
YS Jagan Bus Yatra: జనం మధ్యలోకి జగన్.. బస్సు యాత్రతో వైయస్సార్ సీపీలో జోష్!!
PM Modi at Chilakaluripeta: ప్రధాని మోదీ సుతిమెత్తని విమర్శలు.. ఏపీలో జగన్ పార్టీ, కాంగ్రెస్ వేర్వేరు కాదని కామెంట్స్
