Jagan Siddham: రాష్ట్రంలో ప్రజలందరికీ మంచి పాలన అందించామని, ప్రతి ఇంటికీ మంచి చేయగలిగామని సీఎం జగన్ అన్నారు. ఏలూరు సిద్ధం సభలో ఆయన ప్రసంగించారు. గతంలో తెలుగుదేశం పార్టీ తమ కార్యకర్తలతో లంచాలు, పక్షపాతంతో కొద్దిమందికి మాత్రమే అన్న వివక్షతో జన్మభూమి కమిటీల ద్వారా సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసిందన్నారు. మనందరి ప్రభుత్వం మన చదువుకున్న పిల్లలతో తీసుకొచ్చిన మనదైన వాలంటీర్ వ్యవస్థ, ఇంటింటికీ వెళ్లి పని చేస్తున్న మన పార్టీకి దన్నుగా, ప్రజల మన్ననలు పొందుతూ మనతోపాటు పని చేస్తున్నారని తెలిపారు. (Jagan Siddham) జగన్ ఇంకా ఏమన్నారంటే..
* ఎవరూ గెలవనన్ని పదవులు, ఏ రాజకీయ పార్టీ ఇవ్వనన్ని అవకాశాలు ఇచ్చిన పార్టీ మన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.
* మంచి పాలన అందించాం. ప్రతి ఇంటికీ మంచి చేయగలిగాం. ఎక్కడా వివక్ష, లంచాలు లేకుండా గొప్ప పాలన ఇవ్వగలం అని చూపించాం.
* ఈరోజు నేను గర్వంగా చెబుతున్నా. ఇక్కడున్న ఎవరైనా ఏ పదవికైనా పోటీ చేయగలిగితే ఎప్పుడూ చూడని విధంగా గెలిపించే కార్యక్రమం జరుగుతుంది.
* భవిష్యత్ లో ఇంతకంటే గొప్పగా మన వారికి పదవులిచ్చే పార్టీ మనది. ఎంతో భవిష్యత్ ఉన్న పార్టీ.
* వ్యక్తిగతంగా ఒక్క విషయం చెబుతున్నా. పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటాం. ప్రజా సేవలో ఉన్న ప్రతి ఒక్కరికీ మీ అన్న, మీ తమ్ముడు సలహా ఇచ్చేది ఒక్కటే. గొప్పగా సేవ చేయండి. గొప్పగా మంచి చేయండి.
* మరో రెండు మెట్లు ఎక్కించే బాధ్యత నాదీ అని తెలియజేస్తున్నా.
* వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కు 175 ఎమ్మెల్యేలు మన టార్గెట్. 25 ఎంపీలకు 25 ఎంపీలు మన టార్గెట్.
* పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు. మనకు ఒక్క ఎంపీగానీ, ఒక్క ఎమ్మెల్యేగానీ తగ్గడానికి వీలే లేదు అని తెలియజేస్తున్నా.
* ఈ లక్ష్యాన్ని చేరుకొనేలా గడపగడపకూ వెళ్లి ప్రతి ఒక్కరితో ఓటు వేయించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా..?
* సంక్షేమ పథకాల రద్దుకు జరిగే కుట్రల మీద యుద్ధానికి మీరంతా సిద్ధమేనా..?
* సమర భేరి ఖల్లుమంది. ఎన్నికల శంఖం మోగుతోంది. బాబు కుట్రలు, కుతంత్రాలను చిత్తు చేసేందుకు మనకున్న అస్త్రం.. మీ జేబులో ఉన్న మీ సెల్ ఫోన్.
* ఈ సెల్ ఫోన్ తో సోషల్ మీడియా పరంగా సిద్ధంగా ఉన్నారా అని అందరినీ అడుగుతున్నా.
* మనకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు తోడుగా ఉండకపోవచ్చు. మనకు తోడు పైన దేవుడు, మంచి జరిగిన ఇంట్లో ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మ, అన్నదమ్ముడు, అవ్వాతాత మనకు తోడు.
* రాబోయే 60 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రజాక్షేత్రంలో పోరాడటానికి ప్రతి ఒక్కరూ సిద్ధమని దిక్కులు పిక్కటిల్లేలా చెప్పండి. సిద్ధమా.. అని అడుగుతున్నా.
* దేవుడి దయ ప్రజలందరి చల్లని దీవెనలతో మరో 3 నెలల్లో మనందరి ప్రభుత్వం ఇంతకు మించిన ఉత్సాహంతో కొలువుదీరుతుందని చెబుతున్నా.
read also: Jagan on CBN Chandramukhi: చంద్రముఖి బెడద శాశ్వతంగా మీకు ఉండదు.. బాబుపై జగన్ పంచ్‌లు అదుర్స్..
