Motor Accidents Claims: రహదారి ప్రమాదాల క్లెయిమ్ లు పరిష్కారంలో లీగల్ పెరస్పెక్టివ్, బెస్ట్ ప్రాక్టీసులకు సంబంధించి సుప్రీం కోర్టు గోహర్ మహ్మద్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ, ఇతరుల విషయంలో ఇచ్చిన తీర్పుపై స్టేకు హోల్టర్లకు అవగాహన కల్పించేందుకు నిన్న కీలక సమావేశం జరిగింది. ఏపీలోని అమరావతి కరకట్ట రోడ్డులో మంతెన సత్యనారాయణ ఆశ్రమాన్నిఆనుకుని ఉన్న చిగురు చిలడ్రన్స్ విలేజ్ లో వర్కు షాపు ఏర్పాటు చేశారు. ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అధారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి.శేషసాయి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిచారు. ముందుగా వర్కు షాపును జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. (Motor Accidents Claims)
ఈ సందర్భంగా జస్టిస్ శేషసాయి మాట్లాడుతూ వివిధ రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వివిధ క్లెయిమ్ లను సకాలంలో ఏవిధంగా పరిష్కరించాలనే దానిపై సుప్రీమ్ కోర్టు స్పష్టమైన తీర్పును ఇచ్చిందని దీనిపై సంబందిత స్టేకు హోల్డర్లు పూర్తిగా అవగాహన పెంపుదించు కోవాల్సిన ఆవశ్యత ఉందని జస్టిస్ శేషసాయి పేర్కొన్నారు.ఇక్కడ ఈవర్కు షాపును నిర్వహించేందుకు చిగురు చిల్డ్రన్స్ విలేజిని ఎంపిక చేసి వర్కు షాపులో రిసోర్సు పర్సన్లుగా ఎపి లీగల్ సర్వీసెస్ అధారిటీ సభ్య కార్యదర్శి ఎం.బబిత,ఎపి జూడీషియల్ ఎకాడమీ డైరెక్టర్ ఎ.హరి హరనాధ శర్మ తదితరులు పాల్గోవడం ఆనందదాయకమని జస్టిస్ శేషసాయి పేర్కొన్నారు.అంతకు ముందు చిగురు చిల్డన్స్ విలేజ్ లోని చిన్నారులకు జస్టిస్ శేషసాయి చాక్లెట్లను పంపిణీ చేశారు.
ఈవర్కు షాపు ప్రధాన ఉద్దేశ్యం రోడ్డు ప్రమాదాల క్లెయిమ్ లకు సంబంధించి సుప్రీం కోర్టు గోహర్ మహమ్మద్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరియు ఇతరులపై జారీ చేసిన ఆదేశాలలోని మార్గదర్శకాలపై పోలీస్,రోడ్డు రవాణా సంస్థ,వివిధ బీమా కంపెనీలు,జిల్లా కోర్టుల్లోని పరిపాలనాధికారులకు అవగాహన పెంపొందించే లక్ష్యంతో నిర్వహించారు.ప్రారంభ కార్యక్రమం అనంతరం టెక్నికల్ సెషన్ లో ఇందుకు సంబంధించిన అంశాలపై రిసోర్సు పర్సన్లు అవగాహన కల్చించడం జరిగింది.
ఈవర్కుషాపులో ఎపి లీగల్ సర్వీసెస్ అధారిటీ సభ్య కార్యదర్శి ఎం.బబిత,ఎపి జూడీషియల్ ఎకాడమీ డైరెక్టర్ ఎ.హరిహరనాధశర్మ, ఎన్ఐసీ ఈ-ధార్ ప్రాజెక్టు అధికారి రత్న ప్రకాశ్, బజాజ్ అలయెన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ టి.సోమరాజు, ఏపీ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ బి.నరేశ్ పాల్గొన్నారు. జిల్లాల నుంచి పోలీస్, రావాణా శాఖల అధికారులు, జిల్లా కోర్టుల పరిపాలనాధికారులు, బీమా కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ChatGPT: ఛాట్ జీపీటీతో గూగుల్‌కు ముప్పు తప్పదా? ఛాట్ జీపీటీ అంటే ఏంటి?
