YS Jagan on Development: భీమిలి బహిరంగ సభలో సీఎం జగన్ అభివృద్ధి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. మరి మీ జగన్ ఏం చేశాడంటే.. ఈ 56 నెలల్లో ఆ ప్రతి గ్రామంలో కూడా ఎన్నెన్నో మార్పులు కనిపిస్తాయి.. ప్రతి గ్రామంలో వచ్చిన గ్రామసచివాలయం కనిపిస్తుంది.. అందులో 540కిపైగా పౌర సేవలు అందులో దాదాపు 10 మంది మన పిల్లలే శాశ్వత ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తారు.. అని వ్యాఖ్యానించారు. (YS Jagan on Development)
* శాశ్వత వ్యవస్థను మన గ్రామాలకు తీసుకొచ్చింది ఈ 56 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.
* ఎక్కడా కరప్షన్ లేకుండా, లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఇంటింటికీ 1వ తేదీన ఉదయాన్నే పెన్షన్ అయినా, పౌర సేవలైనా లేకపోతే ఏ పథకమైనా మన గడపకే వచ్చి చిరునవ్వుతో అందించే మనలో భాగమైన ఓ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చింది కూడా ఈ 56 నెలల్లోనే. మీ బిడ్డ పాలనలోనే అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.
* అదే గ్రామంలో రైతన్నలను చేయిపట్టుకొని నడిపించే ఒక ఆర్బీకే వ్యవస్థ కనిపించేది, అది వచ్చింది కూడా మీ బిడ్డ పాలనలోనే అని ప్రతి రైతన్న ఇంటికీ వెళ్లి చెప్పండి.
* అదే గ్రామంలో మరో 4 అడుగులు అటువైపున వేస్తే విలేజ్ క్లినిక్. ఫ్యామిలీ డాక్టర్.. ఇంటింటికీ జల్లెడ పడుతూ పేదవాడికి తోడుగా ఉండేందుకు ఆరోగ్య సురక్ష కార్యక్రమం.. ఇటువంటివన్నీ గ్రామానికి వచ్చింది మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.
* నిరుపేదలు చదువుకొనే గవర్నమెంట్ బడికి నాడునేడుతో మంచి రోజులు వచ్చి చదువుకొనే పిల్లలకు ఇంగ్లీషు మీడియంతో మొదలు ట్యాబులు, ఐఎఫ్‌పీలు, బైలింగువల్ బుక్స్ వచ్చింది కూడా మీ బిడ్డ పాలనలోనే అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.
* అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు, సచివాలయంలో మహిళా పోలీస్ గ్రామంలోనే కనిపిస్తుంది.
* ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో ఫోన్. ప్రతి ఫోన్ లో దిశ యాప్ కనిపిస్తుంది. మహిళా పోలీసు గానీ, దిశ యాప్ గానీ ఏ అక్కచెల్లెమ్మకు అపాయం సంభవించినా కేవలం ఒక బటన్ నొక్కిన వెంటనే ఫోన్ 5 సార్లు ఊపిన వెంటనే 10 నిమిషాల్లోనే అక్కచెల్లెమ్మ దగ్గరికి పోలీసు సోదరుడు వచ్చే వ్యవస్థ వచ్చింది కూడా ఈ 56 నెలల్లోనే అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.
* ఇవన్నీ కూడా మన గ్రామానికి వచ్చిన బ్రాడ్ బ్యాండ్. బ్రాండ్ బ్యాండ్ సేవలు, కడుతున్న డిజిటల్ లైబ్రరీలు కట్టే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది.
* ఇవన్నీ ప్రతి గ్రామంలో మనందరి ప్రభుత్వంలో ఈ 56 నెలల్లోనే చేసిన గొప్పమార్పులుగా ప్రతి ఒక్కరికీ కనిపిస్తాయి. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామాన్ని తీసుకున్నా కనిపిస్తాయి.
* ఇలాంటి ఆలోచనలు, మార్పులు తీసుకురావాలని, కరప్షన్ వివక్ష లేకుండా ప్రతి పేదవాడికీ చేయి పట్టుకొని నడిపించాలనే ఆలోచనలు, రైతన్నకు, అక్కచెల్లెమ్మలకు అవ్వాతాతలకు అండగా నిలబడాలనే ఆలోచనలు మూడుసార్లు సీఎంగా 14 ఏళ్లు పాలించిన చంద్రబాబుకు ఏనాడూ కూడా కనీసం మనసుకు కూడా రాలేదు.
* కారణం.. వాళ్లు పెత్తందార్లు కాబట్టి. పల్లె అంటు బాబు దృష్టిలో తమ పెత్తందార్ల పొలాల్లో పని చేసే పనిమనుషులు ఆయన దృష్టిలో పొట్టపోసుకోవడం కోసం ఉండే జనావాసం ఆ పల్లె అని ఆయన నమ్మకం.
* ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఏ గ్రామం, పల్లె కూడా బాగుపడదు. ప్రజలు, పేదవాడు బాగుపడాలి, గొప్పగా చదవాలి, భవిష్యత్ మారాలన్న తాపత్రయం పెత్తందార్లకు లేదు.
* రైతు సంక్షేమాన్ని చూస్తే మనమెక్కడ, చంద్రబాబు ఎక్కడ? ఆలోచన చేయాలి.
* రుణ మాఫీ చేస్తానని నిలువునా ముంచినది చంద్రబాబు. 87612 కోట్లు రైతులు బ్యాంకులకు కట్టొద్దని పిలుపునిచ్చాడు. మొట్ట మొదటి సంతకంతో రుణమాఫీ అని వాగ్దానం చేశాడు. మేనిఫెస్టోలో పెట్టాడు. నిలువునా ముంచినది చంద్రబాబు అయితే, ఈరోజు రైతు భరోసా అంటే గుర్తుకొచ్చేది మీ జగన్.
* ఆర్బీకే అంటే జగన్. సకాలంలో విత్తనమైనా ఎరువులైనా, ఇన్ పుట్ సబ్సిడీ అయినా సకాలంలో అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీజగన్.
* పగటిపూటే ఉచిత విద్యుత్, ఉచిత బీమా, సున్నా వడ్డీ అయినా అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగన్.
* ఆక్వా రైతులకు కరెంటు సబ్సిడీ అయినా అందుతోందంటే గుర్తుకొచ్చేది మీ జగన్.
* ఏ పొలంలోకి వెళ్లినా కూడా చంద్రబాబు చెప్పుకొనేందుకు ఏముంది? చంద్రబాబు మార్క్ ఎక్కడుంది? ఎక్కడ చూసినా కూడా కనిపించేది వైయస్సార్ సీపీ.
* ప్రజల వైద్యం, ఆరోగ్యం విషయానికి వస్తే.. ఒక 104 చూసినా, 3257 ప్రొసీజర్ల తీరు చూసినా, ఆరోగ్య ఆసరా చూసినా, విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ జల్లెడ పడుతూ నిర్వహిస్తున్న ఆరోగ్య సురక్ష, 17 కొత్త మెడికల్ కాలేజీలు, వైద్య రంగంలోనే 53 వేల కొత్త నియామకాలు.
* నాడునేడుతో బాగుపడుతున్న ఆస్పత్రులు. ఇలా ఏది తీసుకున్నా కనిపించేది.. ఒక వైయస్సార్, ఒక జగన్. ఒక వైయస్సార్ సీపీ మార్క్ కనిపిస్తుంది.
* 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఈయన మార్క్ ఎక్కడ ఉంది? ఎక్కడ చూసినా కూడా కనిపించేది వైయస్సార్ సీపీ, జగన్ మార్క్ కనిపిస్తోంది.
* ఏ గవర్నమెంట్ బడిని తీసుకున్నా మొత్తంగా విద్యా రంగాన్ని తీసుకున్నా, నాడునేడు, ఇంగ్లీషు మీడియం, సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్కులు, బైజూస్ కంటెంట్, గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ట్యాబులు, ఏకంగా క్లాసు రూముల్లో ఐఎఫ్ పీలు, గోరుముద్ద, పిల్లలకు బడి తెరిచే సరికే విద్యాకానుక, పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తూ జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, విదేశాల్లోని టాప్ యూనివర్సిటీలతో ఆన్ లైన్ వర్టికల్స్ ద్వారా డిగ్రీల అనుసంధానం.
* జాబ్ ఓరియెంటెడ్ కరిక్యులమ్ లో మార్పులు, ఇంటర్న్ షిప్ తో డిగ్రీలో చేర్చడం.
* ఏది తీసుకున్నా విద్యారంగంలో మీ ఇష్టం. ఏది తీసుకున్నా ఎక్కడ కనిపిస్తోంది చంద్రబాబు నాయుడు మార్క్?
* ఎక్కడ చూసినా కూడా కనిపించేది వైయస్సార్ సీపీ, జగన్ మార్క్ కనిపిస్తోంది ప్రతి చోటా.
ఇదీ చదవండి: YS Jagan Bheemili Meeting: వైయస్ జగన్ విశ్వరూపం.. కురుక్షేత్ర సంగ్రామంలో అభిమన్యుడిని కాను.. అర్జునుడిని..
YS Jagan Bus Yatra: జనం మధ్యలోకి జగన్.. బస్సు యాత్రతో వైయస్సార్ సీపీలో జోష్!!
CM Jagan Ready to Elections: ఎన్నికల సమరానికి సీఎం జగన్ సిద్ధం.. 18 నుంచి ప్రచార సమర భేరి!
CM Jagan Help to Doctor Couple: డబ్బుదేముంది లేబ్బా.. ముందు ప్రాణం నిలబడనీ..!
