HomeAndhra PradeshVillage Secretariat: గ్రామ సచివాలయ వ్యవస్థపై దేశవ్యాప్తంగా పలువురు డెలిగేట్స్ కితాబు

Village Secretariat: గ్రామ సచివాలయ వ్యవస్థపై దేశవ్యాప్తంగా పలువురు డెలిగేట్స్ కితాబు

Village Secretariat: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన గ్రామ సచివాలయ వ్యవస్థపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దేశ వ్యాప్తంగా సందర్శించిన పలువురు డెలిగేట్స్‌.. గ్రామ సచివాలయ వ్యవస్థ అద్భుతమంటూ కితాబిచ్చారు. ఈ నెల 18 నుండి మూడురోజులపాటు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు పంచాయితీరాజ్ కార్యశాలలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ సచివాలయ వ్యవస్థ అధ్బుతమని కితాబు ఇచ్చారని రాష్ట్ర పంచాయితీ రాజ్ కమిషనర్ సూర్యకుమారి తెలిపారు. (Village Secretariat)

రెండురోజుల పాటు పంచాయతీ రాజ్ వ్యవస్థ హేల్తీ విలేజ్, సుస్థిర అభివృద్ది లక్ష్యాల పై కార్యశాల నిర్వహణ చేపట్టి ఇతరరాష్ట్రాల తో సరిచూసి ఇంకా మన రాష్ట్రంలో ఏమైనా చేయలసినవి వున్నాయని పరిశీలనలోకి తీసుకోవడం జరుగుతుందని, మరాష్ట్రంలో అమలవుతున్న డిబిటి విధానం, పథకాలు పించన్ల డోర్ డెలివరీ వంటివి బాగున్నాయని వ్యక్తం చేశారన్నారు. అలాగే ఆతిధ్యం కూడా ఎలాటి లోటు లేదని తెలిపారని అన్నారు.

క్షేత్రస్థాయిలో పర్యటన గ్రామసచివాలయ వ్యవస్థ పరిశీలనకు 4 బృందాలుగా పర్యటించారని తెలిపారు. ఎల్లమండ్య౦ లో మహారాష్ట్ర గుజరాత్ , దాదర్ నాగర్ హవేలీ మరియు డామన్ డయ్యు , పచ్చిమ బెంగాల్ తమిళ్ నాడు , పుదుచ్చేరి డెలిగేట్స్ 53 మంది, తనపల్లి లో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ , మేఘాలయ, త్రిపుర , కర్ణాటక, సిక్కిం డెలిగేట్స్ 47 మంది, చెర్లోపల్లి ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణ డెలిగేట్స్ 48 మంది, తొండవాడ చత్తీస్గడ్, జమ్మూ కశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్తాన్, కేరళ డెలిగేట్స్ 49మంది బృందాలుగా సచివాలయ వ్యవస్థ, రైతుబరోసా కేంద్రాలు, వై ఎస్ ఆర్ విలేజ్ క్లినిక్స్ అధికారులతో, సిబ్బందితో ముఖాముఖి నిర్వహించి పనితీరు తెలుసుకున్నారు.

కమిషనర్ మరో ప్రకటనలో 15 వ ఫైనాస్స్ కమిషన్ నిధులు రూ.1000 కోట్లు నేడు విడుదల అయ్యాయని , పంచాయితీలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గతంలో విడుదల అయిన రూ.1000 కోట్లు ఇంకా 18 శాతం ఖర్చు చేయలేదని ఆలస్యం లేకుండా ఇప్పటికే శిక్షణ ఇచ్చామని సర్పంచులు, సెక్రటరీలు పంచాయితీల అభివృద్దికి వెచ్చించాలని సూచించారు.

ఇదీ చదవండి: Registrations AP: గ్రామ సచివాలయాల్లో పంచాయతీ సెక్రటరీలకు రిజిస్ట్రేషన్‌ అధికారాలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు