Anganwadi protest: రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీల సమస్యలపై సానుకూలంగా ఉందని, మూడు దఫాలుగా ప్రభుత్వం వారితో చర్చలు జరిపిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. జీతాల పెంపు మినహా అన్ని సమస్యలూ పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. జూలై వరకు జీతాల పెంపు కోసం సమయం ఇవ్వాలని కోరామన్నారు. నిన్న ఆయన మీడియాతో మాట్లాడారు. (Anganwadi protest)
* ప్రభుత్వం మూడు దఫాలు అంగన్వాడీలతో చర్చించింది
* వారి సమస్యలు పరిష్కరించే ఉద్ధేశంతోనే చర్చలు జరిపాం
* ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చారు
* ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే జీతాలు పెంచాం
* వచ్చే జూలైలో జీతాలు పెంచుతామని చెప్పాం
* అంగన్వాడీల టీఎ, డీఎలు కూడా ఫిక్స్ చేస్తున్నాం
* ప్రభుత్వంవైపు నుంచి సానుకూలంగా వ్యవహరించాం
* వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది
* సమ్మె చేస్తున్న అంగన్వాడీల పట్ల ఎప్పుడూ పోలీసులు దురుసుగా ప్రవర్తించలేదు
* గర్భిణీలు, పసిబిడ్డలకు ఇబ్బంది కలగకూడదనే ఎస్మా పరిధిలోకి తెచ్చాం
* అంగన్వాడీ కేంద్రాల్లో ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం
* ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సంయమనంతో వ్యవహరించాం
* సమ్మె విరమించి విధుల్లో చేరాలని కోరాం
* వారు విధుల్లో చేరకుంటే నిబంధనల ప్రకారం కొత్తవారిని రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుంది
* ప్రభుత్వం ప్రజల అవసరాలకు అనుగుణంగా కూడా పని చేయాలి
* అంగన్వాడీలు విధుల్లో చేరాలని మళ్లీ కోరుతున్నాం
* ఈ సమ్మె వెనుక పొలిటికల్ ఎజెండా ఉంది
* ఈ పొలిటికల్ ఎజెండాతో అంగన్వాడీలు నష్టపోతారు
* అంగన్వాడీల సమస్య పై సానుకూలంగానే ఉండాలని సీఎం చెప్పారు
* అంగన్వాడీల సమ్మెతో అనేక ఇబ్బందులు వస్తున్నాయి
* గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాల్సి ఉంది
* అంగన్వాడీల వేతనం పెంపు పై ఒక విధానం ఉంది
* వేతనాలను ఐదేళ్లకు ఒకసారి మాత్రమే పెంచాల్సి ఉంది
* ఈ ఏడాది జులై నాటికి ఐదేళ్లు నిండుతాయని చెప్పాం
* జులైలో తప్పకుండా వేతనాలు పెంచుతామని చెప్పాం
* వేతనాలు పెంచేందుకు ప్రభుత్వానికి ఒక పద్ధతి ఉంటుంది
* వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేస్తున్నాం
* విధుల్లో చేరితే సమ్మె కాలానికి వేతనం, కేసులపైనా సానుకూలంగా ఉంటాం.
Anganwadi: అంగన్‌వాడీలకు శుభవార్త.. డిమాండ్ల పరిష్కారం కోసం జగన్ సర్కార్ సానుకూలం

[…] […]