YSRCP Candidates 3rd List: వచ్చే ఎన్నికల్లో ఘన విజయమే లక్ష్యంగా ఏపీలో అధికార పార్టీ పావులు ముమ్మరంగా కదుపుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తూ సీఎం జగన్ దూసుకెళ్తున్నారు. మొదటి విడతలో 11 మంది రెండో విడతలో 27 మందితో జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మూడో లిస్టు 21 మందితో విడుదలైంది. ఇందులో సామాజిక సమీకరణాలు క్రోడీకరించినట్లు పార్టీ నేతలు వెల్లడించారు. (YSRCP Candidates 3rd List)
మంత్రి బొత్స ఈ లిస్టును విడుదల చేసి మీడియాకు చదివి వినిపించారు.
1. శ్రీకాకుళం (ఎంపీ) – పేరాడ తిలక్
2. విశాఖ పార్లమెంట్ – బొత్స ఝాన్సీ
3. ఏలూరు పార్లమెంట్ – కారుమూరి సునీల్ కుమార్ యాదవ్
4. విజయవాడ పార్లమెంట్ – కేశినేని నాని
5. కర్నూలు పార్లమెంట్ -గుమ్మనూరు జయరాం
6. తిరుపతి పార్లమెంట్ – కోనేటి ఆదిమూలం
7. ఇచ్ఛాపురం పార్లమెంట్ – పిరియ విజయ
8. టెక్కలి అసెంబ్లీ – దువ్వాడ శ్రీనివాస్
9. చింతలపూడి అసెంబ్లీ – కంభం విజయరాజు
10. రాయదుర్గం అసెంబ్లీ – మెట్టు గోవింద్ రెడ్డి
11. చిత్తూరు అసెంబ్లీ – విజయానంద రెడ్డి
12. దర్శి అసెంబ్లీ – బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
13. పూతలపట్టు – మూతిరేవుల సునీల్ కుమార్
14. మదనపల్లె – నిస్సార్ అహ్మద్
15. రాజంపేట అసెంబ్లీ – అమర్నాథ్ రెడ్డి
16. ఆలూరు బూసినేని విరూపాక్షి
17. గూడురు అసెంబ్లీ – మెరుగు మురళి
18. కోడుమూరు- డాక్టర్ సతీష్
19. సత్యవేడు- గురుమూర్తి
20. పెనమలూరు- జోగి రమేష్
21. పెడన -ఉప్పాలరాము
ముఖ్యంగా శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు జిల్లాలపై ప్రధానంగా అధికార పార్టీ ఫోకస్ పెట్టినట్లు స్పష్టం అవుతోంది. ఎస్సీ, బీసీలకు ప్రాధాన్యం ఇస్తూ మూడో జాబితాను రూపొందించినట్లు తెలుస్తోంది. తొలి జాబితాలో 11 నియోజకవర్గాల్లో, రెండో జాబితాలో మరో 27 స్థానాలకు మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మూడో జాబితాను 21 స్థానాలతో పార్టీ కేంద్ర కార్యాలయం రిలీజ్ చేసింది. వీటితో పాటు ప్రస్తుతం ఇచ్ఛాపురం జెడ్పీటీసీగా ఉన్న ఉప్పాడ నారాయణమ్మను.. శ్రీకాకుళం జెడ్పీ చైర్మన్‌గా నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

