HomeAndhra PradeshCM Jagan in Kakinada: రాబోయే రోజుల్లో కుటుంబాలను నిలువునా చీల్చుతారు.. సీఎం జగన్ ఎమోషనల్...

CM Jagan in Kakinada: రాబోయే రోజుల్లో కుటుంబాలను నిలువునా చీల్చుతారు.. సీఎం జగన్ ఎమోషనల్ కామెంట్స్

CM Jagan in Kakinada: రాబోయే రోజుల్లో ప్రతిపక్షాలు ఎక్కువ పొత్తులు పెట్టుకుంటాయని, కుట్రలు, మోసాలు ఎక్కువవుతాయని ఏపీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైయస్సార్ పెన్షన్ కానుక రూ.3,000కు పెంపు సందర్భంగా కాకినాడ బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా తన చెల్లెలు వైయస్ షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనుండటంపై పరోక్షంగా జగన్ కామెంట్ చేశారు. రాబోయే రోజుల్లో కుటుంబాలను నిలువునా చీల్చి రాజకీయాలు చేస్తారంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. (CM Jagan in Kakinada) సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. (CM Jagan in Kakinada)

* చంద్రబాబు సీఎంగా ఉండగా రైతు భరోసా అనే స్కీమే లేదు.
* ఇవాళ ప్రతి సంవత్సరం 53.52 లక్షల మంది రైతన్నలకు మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా రైతన్నల ఖాతాల్లోకి 13500 పడుతోంది. ఈ ఒక్క స్కీమ్ ద్వారా ఐదేళ్లలో రైతన్నలకు పంపిన మొత్తం 33,300 కోట్లు.
* గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగా వైయస్సార్ ఆసరా అనే స్కీమే లేదు.
* ఈ వైయస్సార్ ఆసరా పథకం ద్వారా అక్షరాలా 78.94 లక్షల మంది పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు 55 నెలల్లో ఈ ఒక్క స్కీమ్ ద్వారా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కి 19,178 కోట్లు ఖాతాల్లోకి పంపించడం జరిగింది.

* గతంలో చంద్రబాబు హయాంలో వైయస్సార్ చేయూత అనే స్కీమే లేదు.
* 45-60 సంవత్సరాల వయసులో ఉన్న అక్కచెల్లెమ్మలకు స్వావలంబన కోసం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని తాపత్రయపడి వరుసగా నాలుగు సంవత్సరాల పాటు తోడుగా ఉంటూ క్రమం తప్పకుండా రూ.18750 ఇస్తూ రూ.75 వేలు చేతిలో పెట్టే గొప్ప కార్యక్రమానికి అడుగులు పడింది మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే.
* ఈ ఒక్క స్కీమ్ ద్వారా 22.40 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు నేరుగా బటన్ నొక్కి పంపిన సొమ్ము రూ.14,129 కోట్లు.

* వైయస్సార్ కాపు నేస్తం ద్వారా రూ.2,028 కోట్లు కాపు అక్కచెల్లెమ్మల కోసం అందించాం.
* వైయస్సార్ నేతన్న నేస్తం ద్వారా 982 కోట్లు నేతన్నల కోసం అండగా నిలబడ్డాం
* వైయస్సార్ వాహన మిత్ర ద్వారా 1302 కోట్లు నా డ్రైవర్ అన్నదమ్ములకు అండగా నిలిచాం.
* ఈబీసీ నేస్తం కింద రూ.1257 కోట్లు ఇచ్చాం.
* అగ్రిగోల్డ్ బాధితులకు 905 కోట్లు, జగనన్న తోడు ద్వారా 2955 కోట్లు, జగనన్న చేదోడు ద్వారా 1253 కోట్లు ఇచ్చాం.
* ఇలా చెప్పుకుంటూ పోతేలిస్టు చాంతాడంత కనిపిస్తుంది.
* ఎక్కడా లంచాలు, వివక్ష లేవు. ప్రతిదీ గ్రామ సచివాలయంలో లిస్టులు పెడుతున్నాం. వాలంటీర్లు మీ ఇంటికి వస్తున్నారు.

* రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెబుతారు. మోసాలు చూడాల్సి వస్తుంది
* ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారిస్తామని చెప్పే నాయకుల మీ దగ్గరికి వస్తారు.
* కుట్రలు, కుతంత్రాలు, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి.
* రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, కుటుంబాలను చీలుస్తారు, రాజకీయాలు చేస్తారు, అబద్ధాలు చెబుతారు, మోసాలు చేస్తారు. ఇవన్నీ జరుగుతాయి.

* అప్రమత్తంగా ఉండాలని మిమ్మల్నందరినీ కోరుతున్నా.
* మీ బిడ్డకు వాళ్ల మాదిరిగా కుట్రలు చేయడం, అబద్ధాలు ఆడటం, రాజకీయాలు చేయడం చేతకాదు.
* మీ బిడ్డకు తెలిసిన రాజకీయం మంచి చేయడం, పేదవాడికి అండగా నిలబడటం,
* మీ బిడ్డ పైన దేవుడిని నమ్ముకున్నాడు, కింద ఉన్న మిమ్మల్ని నమ్ముకున్నాడు తప్ప మధ్యలో దళారులను నమ్ముకోలేదు,

* మీ బిడ్డకు ఈనాడు, ఆంధ్రజ్యోతి,టీవీ5, దత్తపుత్రుడి అండ లేకపోవచ్చు.
* మీ బిడ్డ నమ్ముకున్నది పొత్తుల్ని, జిత్తుల్ని, కుయుక్తుల్ని, కుట్రలను కాదు. పైన దేవుడిని, కింద మిమ్మల్నిమాత్రమే నమ్ముకున్నాడు.
* అప్రమత్తంగా ఉండండి అని మరోసారి విన్నవిస్తూ మీ అందరితోపాటు మీ సంతోషాల మధ్య ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం మీ బిడ్డగా ఇంతకన్నా సంతోషం ఏమైనా ఉంటుందా అని ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడుతున్నా. సంతోషపడుతున్నా.

Read also: YSRCP Candidates: గెలుపే లక్ష్యం.. వైయస్సార్‌సీపీ సమన్వయకర్తల రెండో లిస్టు ఇదీ..!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు