HomeAndhra PradeshYSR Pension Kanuka Sabha: మాట నిలబెట్టుకొని మీ బిడ్డ మీ మధ్యన ఉన్నాడు.. వైయస్సార్...

YSR Pension Kanuka Sabha: మాట నిలబెట్టుకొని మీ బిడ్డ మీ మధ్యన ఉన్నాడు.. వైయస్సార్ పెన్షన్ పెంపు సభలో సీఎం జగన్

YSR Pension Kanuka Sabha: వైయస్సార్ పెన్షన్ కానుక పెంపుపై రూ.3 వేల దాకా తీసుకొని పోతాం అని చెప్పిన మాట ప్రకారం మాట నెరవేర్చి మీ అందరి సమక్షంలో సంతోషాల మధ్య కార్యక్రమం జరుపుకోవడం దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నానని సీఎం జగన్ కామెంట్ చేశారు. కాకినాడ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. ప్రజల ఆత్మీయతల మధ్య దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం చేశామన్నారు. (YSR Pension Kanuka Sabha) ఈ సందర్భంగా జగన్ ఇంకా ఏమన్నారంటే..

* కొత్త సంవత్సరం అంటే కేవలం క్యాలెండర్‌లో ఒక మార్పు మాత్రమే కాదు.
* కొత్త సంవత్సరం అంటే ప్రతి ఒక్కరి జీవితంలో వారి ఆదాయం పెరగాలి, వారి ఆనందంలో కూడా మెరుగైన పరిస్థితిలోకి పోవాలి. జరగాలి.
* నిజంగా అలాంటి గొప్ప కార్యక్రమం, అలాంటి మంచి కార్యక్రమంలో ఈరోజు పాలు పంచుకుంటున్నాం.

* పెద్ద వయసు వల్ల, విధిరాత వల్ల తమకు తాము పోషించుకోలేని పరిస్థితిలో తల్లడిల్లుతున్న 66.34 లక్షల మంది అభాగ్యులకు, అవ్వాతాతలకు, వితంతువులకు వీళ్లందరికీ మంచి చేస్తూ ఈరోజు మనందరి ప్రభుత్వం సామాజిక పెన్షన్‌ను అక్షరాలా రూ.3 వేలు చేసింది.
* 66.34 లక్షల మందికి పెన్షన్లపై చేస్తున్న ఖర్చు నెల నెలా అక్షరాలా దాదాపుగా రూ.2 వేల కోట్లు.
* ఒకటో తారీఖున పండుగ దినమైనా, సెలవుదినమైనా, మీ జగనన్న సైన్యం, నా వాలంటీర్ తమ్ముళ్లకు, చెల్లెమ్మలకు మాత్రం అది ప్రతి అవ్వాతాత ముఖంలో చిరునవ్వును చూసే రోజు.

* పొద్దున్నే సూర్యోదయానికి ముందే చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ ప్రతి అవ్వకూ, తాతకూ మనవడిగా, మనవరాలిగా తోడుగా చేయూతనిస్తున్న నా వాలంటీర్లకు మాత్రం సెలవు దినం కాదు.
* మీ బిడ్డ ప్రభుత్వం రాక ముందు పరిస్థితిని గమనించాలి.

* అప్పట్లో చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు కూడా పెన్షన్ కేవలం రూ.1000 ఇచ్చే ఆరోజులు గుర్తు తెచ్చుకోవాలి.
* ఎన్నికలు వచ్చే సరికే రెండు నెలల ముందు పెన్షన్ రూ.2వేలు చేశాడు.
* ఎన్నికలు రాకపోయి ఉంటే, మీ బిడ్డ జగన్ రూ.2 వేలు చేస్తానని చెప్పకపోయి ఉంటే చంద్రబాబు చేసేవాడా?
* గత 5 సంవత్సరాల చంద్రబాబు పాలనలో యావరేజ్ కింద పెన్షన్ కేవలం 58 వేలు మాత్రమే ఇస్తున్న పరిస్థితులు.

* మీ బిడ్డ పరిపాలనలో ప్రతి అవ్వాతాత చేతిలో పెన్షన్ 1.47 లక్షలు పెట్టడం జరిగింది.
* వికలాంగులు లాంటి వారిని కూడా లెక్కేసుకుంటే కనీసం 1.82 లక్షలు పెట్టడం జరిగింది.
* గతంలో పెన్షన్ కావాలంటే పడిగాపులు కాయాలి. జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాలి. మిమ్మల్ని ఏ పార్టీ వారు అని అడిగేవారు.

* పెన్షన్లు కావాలంటే చాంతాడంత క్యూలో నిలబడాలి. ఎప్పుడిస్తారో తెలియదు.
* అడుగడుగునా జన్మభూమి కమిటీలకు లంచం ఇస్తే తప్ప పని జరగని పరిస్థితి. లంచాలు, వివక్ష, చాంతాడంత క్యూలు.
* గతానికి, ఇప్పటికి తేడా గమనించమని అడుగుతున్నా.
* ఈరోజు ఎవరికి పెన్షన్ కావాలన్నా, అర్హత ఒక్కటే ప్రామాణికంగా అడుగులు వేస్తున్నాం.
* ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్ వ్యవస్థ మీ కళ్ల ఎదుటే కనిపిస్తోంది. వివక్ష లేదు. లంచం అడిగేవాడు లేడు.
* ఈరోజు కులం, మతం, ప్రాంతం, వర్గం, చివరికి ఏ పార్టీ అని కూడా ఎవరూ అడగడం లేదు.

* అర్హత ఉంటే చాలు మీ కష్టం, నా కష్టంగా భావించి ప్రతి అవ్వకూ, తాతకూ, ప్రతి చెల్లెమ్మకూ అండగా నిలబడే కార్యక్రమం మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతోంది.
* గతంలో ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కేవలం 39 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేవారు.
* ఎన్నికలకు 2 నెలల ముందు వరకు 1000 పెన్షన్.
* నెలనెలా పెన్షన్ల కోసం అభాగ్యుల కోసం ఖర్చు చేస్తున్నది నెలకు 400 కోట్లు కూడా లేదు.
* ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో 39 లక్షల మంది నుంచి ఈరోజు 66.34 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం.
* గతంలో 1000 పెన్షన్ పోయి తొలి సంతకం మొట్ట మొదటి రోజు నుంచి 2250కి పెంచి, తర్వాత పెంచుకుంటూ పోయి ఈరోజు 3 వేల దాకా తీసుకుని పోయాం.

* ఈరోజు నా అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూడాలని, అభాగ్యులైన అక్కచెల్లెమ్మల, దివ్యాంగుల ముఖంలో చిరునవ్వులు చూడాలని పెన్షన్ కోసం నెలకు 2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం.
* ఎక్కడ రూ.1000, ఎక్కడ రూ.3000
* ఎక్కడ 39 పెన్షన్లు ఎక్కడ 66.34 పెన్షన్లు
* ఎక్కడ నెలకు 400 కోట్లు ఖర్చు ఎక్కడ నెలకు 2 వేల కోట్లు ఖర్చు
* ఒక్క పెన్షన్ విషయమే కాదు.. ఏ వర్గాన్ని తీసుకున్నా కూడా ఏ పథకాన్ని తీసుకున్నా గత ప్రభుత్వానికి, మీ బిడ్డ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో ఒక్కసారి గమనించాలి.

Read Also: CM Jagan in Kakinada: రాబోయే రోజుల్లో కుటుంబాలను నిలువునా చీల్చుతారు.. సీఎం జగన్ ఎమోషనల్ కామెంట్స్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు